E-Paper
Advertisement

ట్రైన్ టాయిలెట్‌ లో పడిపోయిన గోల్డ్ రింగ్.. రైల్వే సిబ్బంది ఏం చేశారంటే?

ట్రైన్ టాయిలెట్‌ లో పడిపోయిన గోల్డ్ రింగ్.. రైల్వే సిబ్బంది ఏం చేశారంటే?
Advertisement

తాజాగా ఓ రైల్లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఓ ప్రయాణికుడి బంగారు ఉంగరం పొరపాటున రైలు టాయిలెట్‌ లో జారి పడిపోయింది. మామూలుగా అయితే, ఆ రింగ్ దొరకడం చాలా కష్టం అనుకుంటారు. కానీ, రైల్వే సిబ్బంది ఎంతో కష్టపడి ఆ ఉంగరాన్ని బయటకు తీసి ప్రయాణికుడికి అందజేశారు. ఈ ఘటనతో నెటిజన్లు సదరు సిబ్బందిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

ఈ ఘటన బాంద్రా టెర్మినస్–భుజ్ స్పెషల్ రైలులో జరిగింది. రైలు బి-8 కోచ్‌ లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి టాయిలెట్ కు వెళ్లాడు. ఆ సమయంలో తన బంగారు ఉంగరాన్ని అనుకోకుండా టాయిలెట్ బేషన్ లో పడేసుకున్నాడు. ఆ ఉంగరం నేరుగా డ్రైనేజ్ పైపు ద్వారా ట్యాంక్‌ లోకి వెళ్లిపోయింది.  ఉంగరం పోయిందని గుర్తించిన తర్వాత ప్రయాణికుడు చాలా బాధపడ్డాడు. తిరిగి దొరకదని భావించాడు. అయినా రైల్వే అధికారులు విషయం చెప్పాడు.

స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన రైల్వే సిబ్బంది

Advertisement

రైలు అహ్మదాబాద్ చేరిన తర్వాత..  డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం ఈ ఘటనపై స్పందించింది. రైల్వే సిబ్బంది దీనిని ఒక ప్రత్యేక బాధ్యతగా తీసుకుని ఉంగరాన్ని వెతికే పనిని ప్రారంభించారు. ఈ ఆపరేషన్‌ లో సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సంజయ్ యాదవ్, సీటీఎస్ సిబ్బంది వీరేంద్ర కుమార్ సింగ్‌తో పాటు మరికొందరు ఉద్యోగులు పాల్గొన్నారు. టాయిలెట్ ట్యాంక్, పైప్‌ లైనలలో తీవ్ర దుర్వాసన మధ్య గంటల పాటు శ్రమించి చివరకు ఆ ఉంగరాన్ని బయటకు తీశారు. ఇబ్బందికర పరిస్థితులు ఎదరైనా వారు వెనక్కి తగ్గకుండా తమ పని పూర్తి చేశారు. చివరకు బంగారు ఉంగరాన్ని సురక్షితంగా  ప్రయాణికుడికి తిరిగి అందించారు.

ఉంగరం లభించడంతో ప్రయాణికుడి ఆనందం

Advertisement

ఉంగరం తిరిగి లభించడంతో ఆ ప్రయాణికుడు ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై డిఆర్ఎం వేద్ ప్రకాష్ స్పందించారు. సిబ్బంది నిజాయితీ, అంకితభావాన్ని ప్రశంసించారు. భారతీయ రైల్వే కేవలం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా, వారి నమ్మకాన్ని కూడా కాపాడుతామన్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలామంది రైల్వే ఉద్యోగులను అభినందిస్తూ పోస్టులు చేశారు. కొందరు వారికి బహుమతులు, ప్రమోషన్స్ ఇవ్వాలని సూచించారు. మరికొందరు, ఇలాంటి సంఘటనలు ప్రజల్లో రైల్వేపై విశ్వాసాన్ని పెంచుతాయని అభిప్రాయపడ్డారు. సాధారణంగా రైల్వే సిబ్బందిపై ఫిర్యాదులు మాత్రమే ఎక్కువగా వినిపిస్తాయని, కానీ.. మంచి పని చేసినప్పుడు తప్పకుండా అభినందించాలని పలువురు కామెంట్స్ చేశారు. ప్రత్యేకంగా పారిశుధ్య కార్మికుల కష్టాన్ని చాలామంది ప్రశంసించారు. భరించలేని పరిస్థితుల్లో కూడా ప్రయాణికుడి విలువైన వస్తువును తిరిగి అందించడం నిజంగా గొప్ప విషయమన్నారు.

Read Also:  రైళ్ల రద్దుపై 2 నెలల ముందే అలర్ట్.. రైల్వే కీలక నిర్ణయం!

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×