BigTV English

Vande Bharat Train: సుత్తితో వందే భారత్ రైలు అద్దాలు పగలగొట్టిన యువకుడు.. అరే ఎందుకు చేశావ్ రా అలా?

Vande Bharat Train: సుత్తితో వందే భారత్ రైలు అద్దాలు పగలగొట్టిన యువకుడు.. అరే ఎందుకు చేశావ్ రా అలా?

Vande Bharat train window smashed: వందే భారత్ రైలుపై వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. గత కొంతకాలంగా కొంతమంది దుండగులు కావాలనే రైలు ప్రమాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలో రైళ్లపై ఎక్కడో చోట అడపదడపా దాడులు చేస్తున్నారు. ఇటీవల కొంతమంది ఏకంగా రైలు పట్టాలపై సిలిండర్ అమర్చి రైలు ప్రమాదానకి యత్నించగా.. ఆ తర్వాతి రోజు సిమెంట్ దిమ్మెలు పెట్టారు. తాజాగా, ఓ యువకుడు ఏకంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ అద్దాలు పగులగొట్టాడు.


వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అద్దాలను ఓ యువకుడు సుత్తితో పగలగొడుతున్నాడు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయంపై క్లారిటీ రాలేదు. కానీ దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. కొంతమంది దీనిపై చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రితోపాటు రైల్వే శాఖకు ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ వీడియోలో ఓ యువకుడు రైల్వై ప్లాట్‌ఫారమ్‌పై నిల్చొని ఆగి ఉన్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు కిటికీ అద్దాన్ని సుత్తితో బలంగా కొడుతూనే ఉన్నాడు. రైలు అద్దం బలంగా ఉండడంతో పగిలే వరకు కొట్టసాగాడు. కావాలనే దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఎవరు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారో తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్‌గా మారుతోంది.


ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తుండగా.. మరోవైపు కొంతమంది దుండగులు కావాలనే రైలు ప్రమాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే దేశంలో ఈ వందే భారత్ రైలు ప్రారంభం నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది ఏకంగా రాళ్లు విసరడం సర్వసాధారణమైపోయింది.

Also Read: పిల్లల ముందే రెచ్చిపోయిన టీచరమ్మ.. అసభ్యకరమైన పాటకు డ్యాన్స్ చేస్తూ హల్‌చల్

రెండు రోజుల క్రితం కాన్పూర్‌లో కాళింది ఎక్స్ ప్రెస్ రైలును అజ్మీర్ లో ప్రమాదం సృష్టించేలా కుట్ర పన్నారు. ఏకంగా పట్టాలపై సిలిండర్ అమర్చారు. ఈ క్రమంలోనే వందే భారత్ రైలు అద్దాన్ని పగలగొట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు.

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×