E-Paper
Advertisement

సైబరాబాద్‌లో నీళ్ల వేస్ట్ చేస్తే భవనాల నిర్మాణాలు బంద్! సీఎంసీ కమిషనర్ వార్నింగ్

సైబరాబాద్‌లో నీళ్ల వేస్ట్ చేస్తే భవనాల నిర్మాణాలు బంద్! సీఎంసీ కమిషనర్ వార్నింగ్
Advertisement

Water Conservation: స్వేచ్ఛ బ్యూరో: ఎల్ నినో ఎఫెక్టుతో సంబంధం లేకుండా ఇకపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శాశ్వతంగా నీటి పొదుపు చర్యలు పాటించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న ఎల్ నినో ప్రభావం, భూగర్భ జలాలు గణనీయంగా పడిపోవటం వంటి కారణాలతో జలమండలి సరఫరా చేస్తున్న తాగునీటితో పాటు భూగర్భ జలాలు భవన నిర్మాణ పనులకు, ఇతర వాషింగ్ అవసరాల కోసం వినియోగిస్తే సదరు నిర్మాణంలో ఉన్న భవనానికి స్టాప్ వర్క్ నోటీసులు జారీ చేయనున్నట్లు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి. సృజన తెలిపారు. ఎన్నో రకాలుగా శుద్ధి చేసి, తాగేందుకు సరఫరా చేస్తున్న నీటిని కేవలం తాగేందుకు, వంట అవసరాలకు మాత్రమే వినియోగించాలని ఇతర అవసరాల కోసం జలమండలి గ్రీన్ వాటర్ ట్యాంక్ ల ద్వారా సరఫరా చేస్తున్న ట్రీటెడ్ వాటర్ ను మాత్రమే వినియోగించాలని కమిషనర్ సూచించారు.

కమిషనర్ హెచ్చరిక..

Advertisement

ఈ నిబంధనను ఎల్ నినో ఎఫెక్టు ఉన్నంత కాలమే గాక, సైబరాబాద్ లో శాశ్వతంగా అమలు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. జలమండలి పరిధిలో సుమారు 36 గ్రీన్ వాటర్ టాంకర్లు ప్రతి రోజు 200 ట్రిప్పుులతో గ్రీన్ వాటర్ ను సరఫరా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పార్కులు, ల్యాండ్ ఎస్కేప్ లలో బోర్ వెల్స్ ఉన్నా, వాటిని వినియోగించకుండా, వాటి స్థానంలో ట్రీటెడ్ వాటర్ ను వినియోగిస్తున్నట్లు, ఎక్కడైనా ఈ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా ట్రీటెడ్ వాటర్ కు బదులుగా తాగునీటిని, భూగర్భ జలాలను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా కమిషనర్ హెచ్చరించారు. భూగర్భ జలాలాను పర్మినెంట్ గా కాపాకోవాలన్న ఉద్దేశ్యంతో పార్కుల్లో తాత్కాలిక సంప్ లను ఏర్పాటు చేసి, వాటిని నింపుతున్నట్లు ఆమె వివరించారు. ప్రస్తుతం జలమండలి డైలీ సరఫరా చేస్తున్న గ్రీన్ వాటర్ లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషనే ఎక్కువగా ట్రీటెడ్ వాటర్ ను వినియోగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

గ్రేటెడ్ కమ్యూనిటీలపై చర్యలు..

Advertisement

దీంతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిదిలోని 337 గేటెడ్ కమ్యూనిటీల్లోని సీవరేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్ (ఎస్ టీపీ)లు తప్పకుండా పని చేయాలని సూచించినట్లు, సీవరేజీ ట్రీట్ మెంట్లు పని చేయకుండా, నేరుగా మురుగును వదిలిన గేటెడ్ కమ్యూనిటీలపై చర్యలు తీసుకోనున్నట్లు కూడా కమిషనర్ స్పష్టం చేశారు. ప్రతి ఇంట్లో వాటర్ హార్వెస్టింగ్ పిట్ లను తప్పనిసరి చేయనున్నట్లు, కొత్తగా నిర్మిస్తున్న భవనాల్లో వాటర్ హార్వెస్టింగ్ పిట్, గేటెడ్ కమ్యూనిటీల్లో ఎస్టీపీలు లేకుంటే అక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీని నిలిపివేయాలని ఇప్పటికే టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించినట్లు కమిషనర్ వివరించారు. కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం 500 వరకు ఉండగా, కొత్తగా మరో 300 లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో గుర్తించిన 86 వాటర్ లాగింగ్ పాయింట్లను వాటర్ హార్వెస్టింగ్ పాయింట్లుగా మార్చినట్లు ఆమె తెలిపారు.

ట్రా ఫికర్ నివారణకు లండన్ నగరం తరహాలో చర్యలు

సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ పరిధిలో పెరుగుతున్న పట్టణీకరణకు తగినట్టుగా పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం లండన్ నగరంలో అనుసరిస్తున్న విధానాలను స్టడీ చేసి, ప్రత్యేకంగా చర్యలు చేపట్టనున్నట్లు కమిషనర్ సృజన తెలిపారు. ఇందుకోసం ట్రాఫిక్ తో సంబంధమున్న అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్ డేటా అనలైజర్స్ ను నియమించుకుని స్టడీ చేయనున్నట్లు తెలిపారు. లండన్ తరహాలో విధానాలను అనుసరించేందుకు వీలుగా ఇక్కడ పరిస్థితిని స్టడీ చేయటంలో భాగంగా త్వరలోనే లండన్ మాజీ మేయర్, లండన్ నగర చీఫ్ ట్రాన్స్ పోర్టు ఆఫీసర్లు త్వరలోనే సైబరాబాద్ కు రానున్నట్లు కూడా కమిషనర్ స్పష్టం చేశారు. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య నివారణ కోసం కేవలం రోడ్డు విస్తరణలు, కొత్త రోడ్ల ఏర్పాటు వంటివే పరిష్కారాలు కావని వివరిస్తూనే, ఐటీ కారిడార్ లో విధులు నిర్వహించే టెక్కీలు తమ వ్యక్తి గత వాహానాల వినియోగాన్ని తగ్గించి, మెట్రోలో రాకపోకలు సాగిస్తే, వారు పని చేస్తున్న సంస్థ దిశగా వారిని ప్రోత్సహించేందుకు వీలుగా వారికి మెట్రో టికెట్ రియంబర్స్ మెంట్ ఇచ్చేలా ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నట్లు కమిషనర్ వివరించారు.

చైల్డ్ ఫ్రెండ్లీ సిటీగా యునిసెఫ్ తో చేసుకున్న ఒప్పందం అమలు

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను చైల్డ్ ఫ్రెండ్లీ సిటీగా తీర్చిదిద్దేందుకు వీలుగా ఇటీవలే కార్పొరేషన్ యునిసెఫ్ తో చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. చైల్డ్ ఫ్రెండ్లీ అంశానికి సంబంధించి యూనిసెఫ్ సంస్థ మొట్టమొదటి సారిగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. అసలు పిల్లలు సమాజం కోసం, మున్సిపల్ కార్పొరేషన్ కోసం ఏమని భావిస్తున్నారు? వారి అభిప్రాయం ఏమిటీ? అన్న విషయాన్ని స్పష్టం తెల్సుకుంటే, వారి ఆలోచన విధానాన్ని అంచనా వేసి, వారి బంగారు భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే అవకాశం కల్గుతుందని కమిషనర్ అభిప్రాయపడ్డారు. ఇందుకు కోసం సీఎంసీ వచ్చే బాలల దినోత్సవం నుంచి రెండు నుంచి మూడు నెలల పాటు ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమ అమలు కోసం సీఎంసీలో స్పెషల్ సెల్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సెల్ కు యునిసెఫ్ నుంచి ఇద్దరు ప్రతినిధులను నియమించనున్నట్లు ఆమె వెల్లడించారు.

సొలార్ స్ట్రీట్ లైట్ల ఏర్పాటుకు ఈఓఐ

కార్పొరేషన్ పరిధిలో సొలార్ స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేసుకునే దిశగా ప్రయత్నాలను ప్రారంభించినట్లు కూడా కమిషనర్ సృజన తెలిపారు. ఈ అంశానికి సంబంధించి ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) లను ఆహ్వానించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, కార్పొరేషన్ పరిధిలో చికెన్ వ్యర్థాలను ప్రాసెస్ చేసేందుకు ప్రాథమికంగా కసరత్తు ఇప్పటికే మొదలైనట్లు కమిషనర్ తెలిపారు. చికెన్ వ్యర్థాలను ఎక్కడబడితే అక్కడ పారవేయకుండా, వాటిని చేపలకు ఆహారంగా మార్చేలా ప్రాసెస్ చేయనున్నట్లు ఆమె వివరించారు. ఇందుకు గాను కార్పొరేషన్ పరిధిలో ప్రతి రోజు ఎంత వరకు చికెన్ వేస్ట్ ఉత్పత్తి అవుతుంది? దాన్ని ఎవరు సేకరిస్తున్నారు? ఎంత చెల్లించి సేకరిస్తున్నారు? ఆ తర్వాత దాన్ని ఏం చేస్తున్నారు? అన్న విషయాలను గుర్తించేందుకు ఇప్పటికే ప్రక్రియ మొదలైనట్లు ఆమె తెలిపారు.

ప్రతి పనికి మార్చి మాసంలోనే టెండర్లు

కార్పొరేషన్ పరిధిలో చేపట్టనున్న ప్రతి మెయింటనెన్స్, కొత్త ప్రాజెక్టుల పనులకు ప్రతి ఏటా మార్చి మాసంలోనే టెండర్ల ప్రక్రియను చేపట్టనున్నట్లు కమిషనర్ తెలిపారు. అంతేగాక, ప్రతి పని పూర్తయిన తర్వాత ఆ పనికి సంబంధించిన పూర్తి వివరాలను సమీపంలోని గోడపై పెయింట్ తో పర్మినెంట్ గా ఉండేలా రాస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. కార్పొరేషన్ ఏర్పడిన గత ఫిబ్రవరి 11 వ తేదీ నుంచి ఇప్పటి వరకు సుమారు రూ. 850 కోట్లు మెయింటనెన్స్ కు వెచ్చించినట్లు కమిషనర్ సృజన తెలిపారు. చేపట్టిన ప్రతి పనికి సంబంధించిన పూర్తి వివరాలు, చేపట్టిన సంస్థ, అంచనా వ్యయంతో పాటు కాంట్రాక్టర్ వివరాలు, సంబంధిత అధికారి పేరు, ఫోన్ నెంబర్ వంటి వివరాలను డిస్ ప్లే చేస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా ప్రతి పనికి సంబంధించి డిఫెక్టు లియోబిలిటీ పీరియడ్ ను కూడా ఆ వివరాలతో సూచిస్తామని, ఏమైనా ధ్వంసమైనా, ఫిర్యాదు ఉన్నా ప్రజలు సంబంధిత కాంట్రాక్టర్ ను సంప్రదించేలా ఈ పూర్తి వివరాలను పొందుపర్చనున్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రయత్నాన్ని కార్పొరేషన్ పరిధిలోని వైశాలీనగర్ లో మొదటి సారిగా అమలు చేసినట్లు కమిషనర్ సృజన తెలిపారు.

Also Read: రాహుల్ గాంధీ గారూ.. ఈ దోపిడీకి కొత్త పదం ఏమైనా ఉందా? – KTR వ్యంగ్యాస్త్రాలు

Tags

Related News

రాహుల్ గాంధీ గారూ.. ఈ దోపిడీకి కొత్త పదం ఏమైనా ఉందా? – KTR వ్యంగ్యాస్త్రాలు

ORRపై ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆటో, ముగ్గురు దుర్మరణం!

తెలంగాణ బీజేపీ చీఫ్ మార్పు వార్తల్లో నిజమెంత? క్లారిటీ ఇచ్చేసిన కీలక నేతలు!

తెలంగాణ వైద్యరంగంలో బిగ్ అప్‌డేట్.. ఒకేసారి 359 పీజీ సీట్లకు NMC గ్రీన్ సిగ్నల్!

రాహుల్‌ గాంధీకి నల్ల జెండాల నిరసన తప్పదు: రాంచందర్ రావు

మాదాపూర్‌కు సరికొత్త ల్యాండ్‌మార్క్.. లగ్జరీ లుక్‌లో తమ్మిడికుంట చెరువు!

భార్య చిన్న కోరిక.. తట్టుకోలేక గొంతు నులిమి చంపిన భర్త, నిందితుడు కానిస్టేబుల్

Big Stories

Advertisement
×