BigTV English

20 Feet King Cobra Caught: 20 అడుగుల కింగ్ కోబ్రా.. పట్టుకోబోయిన అమ్మాయి పైకి ఎలా ఎగబడిందో చూడండి!

20 Feet King Cobra Caught: 20 అడుగుల కింగ్ కోబ్రా.. పట్టుకోబోయిన అమ్మాయి పైకి ఎలా ఎగబడిందో చూడండి!

 


Women Caught the 20 feet King Cobra: పాములు అంటే చాలా మంది భయపడిపోతుంటారు. నిజమే కదా.. పాము రావడం చూస్తేనే ఒంట్లో వణుకు పుడుతుంది. ఏ జంతువులను చూసినా నిజంగా అలా అనిపించదేమో. క్షణాల్లో చిన్న కాటుతో మనిషి ప్రాణాలను తీసేస్తాయి పాములు. పాముల్లోను రకరకాల జాతులు ఉంటాయి. కొన్ని విషపూరితమైనవి ఉంటే, అసలు కొన్ని విషం లేనివి ఉంటాయి. ముఖ్యంగా పాముల్లో త్రాచు పాము, కింగ్ కోబ్రా వంటి కొన్ని విషపూరితమైన పాములు ఉంటాయి.


కింగ్ కోబ్రా.. ఈ పేరు వింటే ఒక్కొక్కరి ఒంట్లో భయం పుడుతుంది. సరీసృపాలలోనే అతి డేంజరస్ ఇది. ఇది కనుక పొరపాటున కాటు వేస్తే సెకన్లలో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇలా కింగ్ కోబ్రా కాటుకు బలైన వారి సంఖ్య ప్రపంచంలోనే చాలా ఎక్కువగా ఉంది. సాధారణంగా పాములు అంటే కోళ్లను, చిన్న చిన్న పురుగులు, కప్పలను తింటుంటాయి. కానీ కింగ్ కోబ్రాలు మాత్రం పాములనే తింటుంటాయి. చిన్న చిన్న పాములను తినడమే కాదండోయ్ కొన్ని కొన్ని సార్లు ఆకలి వేస్తే వాటిని అవే తిన్న పరిస్థితులు కూడా ఉన్నాయి.

సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు అది పాము, సింహం, పులి అనే తేడా లేకుండా వాటితో సాహసాలు చేస్తున్న వీడియోలు తరచూ చూస్తూనే ఉన్నాం. కొన్ని సార్లు ఇలా సాహసాలు చేసి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా వార్తల్లో వస్తుంటాయి. అయితే తాజాగా ఓ యువతి ఏకంగా కింగ్ కోబ్రాతోనే ఆటలాడింది. అతి పొడవైన కింగ్ కోబ్రాను పట్టుకుని పెద్ద సాహసమే చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: ఐస్‌క్రీం కావాలని మీ పిల్లలు మారాం చేస్తున్నారా.. ఈ వీడియో చూపించండి.. ఐస్‌క్రీం మాటే ఎత్తరు

ఓ యువతి చుట్టూ కొండలు ఉన్న ఓ ప్రాంతంలో ఆగింది. ఈ తరుణంలో రోడ్డుపై కనిపించిన కింగ్ కోబ్రాతోనే ఆటలాడింది. రోడ్డుపై పాకుతున్న కింగ్ కోబ్రాను పట్టుకోగా అది కాటు వేసేందుకు ప్రయత్నించింది. అయినా సరే సాహసం చేస్తూ కోబ్రాను పట్టుకుని వీడియోలు తీయించుకుంది. అయితే ఈ అమ్మాయి ఉత్తర భారతదేశానికి చెందిన యువతి వలె కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ( ఇన్ స్టాగ్రాం, యూట్యూబ్, గూగుల్) వైరల్ గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. ఏంటమ్మా నీ దైర్యం అది రబ్బర్ పాము అనుకున్నావా ఏంటి’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Viral News: బాల భీముడు మళ్లీ పుట్టాడు, బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Software Engineer Journey: సెక్యూరిటీ గార్డ్ To సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్.. ఆకట్టుకునే జోహో ఎంప్లాయీ సక్సెస్ స్టోరీ!

Viral News: ఎంతకొట్టినా చావడం లేదని.. నోటితో కొరికి పాముని చంపేశాడు, వింత ఘటన ఎక్కడ?

Nose Drinks Beer: ఓరి మీ దుంపలు తెగ.. ముక్కుతో బీరు తాగడం ఏంటి?

Happy Divorce: పాలతో స్నానం చేసి.. కేక్ కట్ చేసి.. విడాకులను సెలబ్రేట్ చేసుకున్న భర్త, వీడియో వైరల్

Viral News: ఉద్యోగికి పొరపాటున 300 రెట్లు ఎక్కువ జీతం చెల్లించిన కంపెనీ, ఊహించని తీర్పు ఇచ్చిన కోర్టు!

Viral Video: కారుపై ముద్దులాట.. కౌగిలింతలతో బరితెగింపు.. ఈ వీడియో చూస్తే ఏమైపోతారో!

Credit Cards: ఒకే వ్యక్తికి 1638 క్రెడిట్ కార్డులు.. అన్నీ పనిచేసేవే, గిన్నీస్ రికార్డుకు ఎక్కేశాడుగా!

Big Stories

×