BigTV English

Viral News : కోహ్లీ ఔటయ్యాడని 14 ఏళ్ల బాలిక చనిపోయింది

Viral News : కోహ్లీ ఔటయ్యాడని 14 ఏళ్ల బాలిక చనిపోయింది

Viral News : రెండు రోజుల క్రితం జరిగిన ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఒక పరుగుకే ఔట్ అయిన సందర్భంలో షాక్ కు గురై ఓ 14 ఏళ్ల బాలిక గుండెపోటుతో మరణించింది. మ్యాచ్ చూస్తూ చూస్తూ కోహ్లీ ఔట్ అవ్వగానే గుండెపోటుకు గురైన బాలిక.. కొద్దిసేపటికి ప్రాణాలు విడిచింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సరదాగా మొదలైన క్రికెట్ మ్యాచ్.. తమ ఇంట్లో విషాదం నింపింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ ఘటనపై క్రీడాభిమానులు సైతం తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు.


భారత్ లో క్రికెట్ అంటే ఒక ఎమోషన్, స్టేడియంలో ఇండియన్ బ్యాట్స్ మెన్ సిక్సర్ కొడితే.. ఇక్కడ యువత గంతులు వేస్తారు. అక్కడ ఔట్ అయితే ఇక్కడ దిగాలు పడిపోతుంటారు. చిన్నప్పుడు నుంచి క్రికెట్ ని వారి జీవితంలో భాగం చేసుకున్న అనేక మంది క్రీడా అభిమానులకు.. మొన్నటి చాంపియన్స్ ట్రోఫీలో సందర్భంగా టీవీలకు అతుక్కు పోయారు. చిన్నా, పెద్ద అంతా పనులన్నీ పక్కన పెట్టేసి టీమిండియాకు సపోర్టుగా ప్రతి బాల్ ని ఎంజాయ్ చేశారు. అయితే ఆటలో గెలుపు, ఓటమి సహజమే. అలాగే తీవ్ర ఉత్కంఠకు గురి చేసే క్షణాలు ఎన్నో ఉంటుంటాయి. బయట నుంచి చూసే క్రీడా అభిమానులకే.. నరాలు తెగేలా ఉండే సందర్భాల్లో గ్రౌండ్ లో బ్యాటు, బాల్ తో ప్రయాణం చేసే క్రీడాకారుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతటి ఒత్తిడిని తట్టుకొని రాణిస్తుంటారు కాబట్టి వారు ఆ స్థాయి వేదికలపై ప్రదర్శనలు ఇవ్వగలుగుతారు. కానీ చాలా మంది అభిమానులు చిన్నచిన్న భావోద్వేగాలకు సైతం తీవ్రంగా స్పందించి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇప్పుడు ఈ సంగతి ఎందుకు అంటే.. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్.. చూస్తూ కింగ్ కోహ్లీ ఔట్ కాగానే షాక్ కు గురైన ఓ బాలిక ప్రాణాలు విడిచింది. ఈ దిగ్భ్రాంతికర ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది

ఉత్తరప్రదేశ్ లోని డియోరియాలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నారు. అందరూ ఒక్క చోటకి చేరుకుని.. ఉత్కంఠగా మ్యాచ్ చూస్తున్నారు. అభిమానులంతా భారత్ బ్యాట్స్ మెన్ ఆటను చూస్తూ కేరింతల కొడుతున్నారు. ఆ ఉత్సహాంలో.. అజయ్ పండే అనే న్యాయవాది కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అందునా.. 14 ఏళ్ల ఆయన కుమార్తె ప్రియాంషీ పాండే.. ఉత్సాహంగా మ్యాచ్ చూస్తోంది. టీమ్ ఇండియాకు నినాదాలు చేస్తూ కేరింతల కొడుతోంది.


ఆ సందర్భంలోనే తన ఫేవరెట్ క్రికెటర్.. కింగ్ కోహ్లీ క్రీజ్ లోకి అడుగు పెట్టాడు. మనకు ఇష్టమైన బ్యాట్స్మెన్ పరుగుల వరద పారిస్తారని ఆశించినా.. కోహ్లీ ఒకే పరుగుకు ఔట్ అయ్యాడు. దాంతో.. పెద్ద కేక పెట్టిన బాలిక ప్రియాంక పాండే అక్కడికక్కడే ముర్చబోయి కింద పడిపోయింది. బాలిక అలా పడిపోయే సరికి ఏం చేయాలో అర్థం కాని మిగతా కుటుంబ సభ్యులు.. ఆమె తండ్రికి అత్యవసరంగా ఫోన్ చేశారు. అతను హుటాహుటిన ఇంటికి వచ్చి బాలికను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ తన కుమార్తెకు వైద్య సహాయం అందించాల్సిందిగా వైద్యులను ప్రార్థించాడు.

Also Read : Man Set Fire Two Wheelers: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని బైకులకు నిప్పు, మరీ ఇంత ఘోరమా?

బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. బాలిక మరణించడానికి గుండె పోటే కారణంగా వైద్యులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. షాక్ వల్ల బాలిక గుండెపోటు వచ్చినట్లు ఉందని తెలిపారు. దాంతో.. ఆ కుటుంబానికి ఆ ఘటన తీవ్రంగా కలిచి వేసింది. చూస్తూ, చూస్తూనే.. అంతలోనే అంతటి విషాయాన్ని ఊహించలేకపోయారు. ప్రియాంషి తండ్రి మాత్రం.. కూతురు మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు అంగీకరించలేదు. దాంతో.. బాలికను ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చి.. అంత్యక్రియలు నిర్వహించారు. మ్యాచ్ చూస్తూ.. బాలిక చనిపోయిందనే వార్త కొద్దిసేపట్లోనే వైరల్ గా మారిపోయింది. అయితే ఆమె తండ్రి మాత్రం ఆ అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. కూతురు మరణానికి టీమిండియా క్రికెట్ మ్యాచ్ కు ఎలాంటి సంబంధం లేదు అని ఖండించారు.

Also Read : Viral Video: అరె ఏం ఉంది మామ..ఈ పిల్లల వీడియో చూస్తే ఫిదా కావాల్సిందే..

ఇక వీరుకి పొరుగున ఉండే అజయ్ పాండే, అమిత్ చంద్ర అనే ప్రత్యక్ష సాక్షులు సైతం బాలిక తండ్రి వాదనతో ఏకీభవిస్తున్నారు. అక్కడ జరిగిన సంఘటన గురించి చాలా స్పష్టంగా తెలుసని చెబుతున్న వాళ్లు.. బాలిక మూర్చబోయిన సమయానికి భారత క్రికెట్ జట్టు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవటం లేదని, అప్పడు భారత్ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోలేదని, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఇంకా ప్రారంభించనేలేదని బాలిక మృతిపై జరుగుతున్న ప్రచారం సరైంది కాదని అంటున్నారు.

Tags

Related News

Indonesian Elderly Couple: గూగుల్ స్ట్రీట్ వ్యూలో వృద్థ జంట.. పదేళ్ల జీవితం కళ్ల ముందు.. గుండె బరువెక్కడం ఖాయం!

Viral Video: పిల్లలా? నా వల్ల కాదు.. ఆడ సింహన్ని చూసి మృగరాజు పరుగోపరుగు!

Marriage: శోభనం రాత్రి.. బాల్కనీ నుంచి దూకిన వధువు.. కట్ చేస్తే, పెద్ద స్కామ్!

Monkey video viral: కోతి తలకు పగడి ధరించి.. ఓ మోడల్ లాగా..? వీడియో మస్త్ వైరల్

Hyderabad News: మిడ్ నైట్ రోడ్లపై హంగామా.. ఓ చేతిలో బాటిల్.. మరో చేతిలో, కెమెరాకి చిక్కాడు

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Big Stories

×