E-Paper
Advertisement

IDBI: డిగ్రీ అర్హతతో భారీగా పోస్టులు.. వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.. రేపే లాస్ట్ డేట్ భయ్యా..

IDBI: డిగ్రీ అర్హతతో భారీగా పోస్టులు.. వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.. రేపే లాస్ట్ డేట్ భయ్యా..
Advertisement

IDBI Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశమనే చెప్పవచ్చు. ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులంతా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మార్చి 12న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆలోగా అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రేపటితోనే దరఖాస్తు గడువు ముగియనుంది.

Advertisement

ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) 650 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్‌ల (గ్రేడ్ ‘O’) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులంతా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం చూద్దాం.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 650

Advertisement

ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియలో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

కేటగిరీ వారీగా ఉద్యోగాలు..

జనరల్: 260 ఉద్యోగాలు

ఎస్సీ: 100 ఉద్యోగాలు

ఎస్టీ: 54 ఉద్యోగాలు

ఈడబ్ల్యూఎస్: 65 ఉద్యోగాలు

ఓబీసీ: 171 ఉద్యోగాలు

పీడబ్ల్యూడీ: 26 ఉద్యోగాలు

దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: 2025 మార్చి 1

దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 మార్చి 12

ఆన్ లైన్ పరీక్ష తేది: 2025 ఏప్రిల్ 6

విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ప్రావీణ్యం, ప్రాంతీయ భాష పరిజ్ఞానం ఉండాలి. ఫైనల్ ఇయర్ చదువుతోన్న అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: 2025 మార్చి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.250  చెల్లించాలి. ఇతర అభ్యర్థులు రూ.1050 పే చేయాల్సి ఉంటుంది.

స్టైఫండ్: శిక్షణ సమయంలో స్టైఫండ్ ఇస్తారు. ఇంటర్న్ షిప్ సమయంలో నెలకు రూ.15000 ఇస్తారు.

జీతం: ఉద్యోగం చేరిన తర్వాత ఏడాదికి రూ.6,14,000 నుంచి రూ.6,50,000 వరకు ఉంటుంది.

ఎగ్జామ్ సెంటర్స్: ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, లఖ్‌నవూ, పట్నాలో ఎగ్జామ్ ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

-ఎంపికైనవారు ఏడాది వ్యవధితో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ (పీజీడీబీఎఫ్‌) కోర్సు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.. మణిపాల్‌ స్కూల్‌ ఆఫ్‌ బ్యాంకింగ్, బెంగళూరులో పీజీ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ (పీజీడీబీఎఫ్‌) కోర్సు పూర్తిచేయాలి.

-ఏడాది కోర్సులో 6 నెలల శిక్షణ ఉంటుంది. 2 నెలలు ఇంటర్న్‌షిప్, 4 నెలలు ఆన్‌ జాబ్‌ ట్రైనింగ్‌ ఉంటుంది. అందులో విజయవంతమైనవారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.idbibank.in/

ముఖ్యమైనవి:

దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: 2025 మార్చి 1

దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 మార్చి 12

ఆన్ లైన్ పరీక్ష తేది: 2025 ఏప్రిల్ 6

ALSO READ: BEL Recruitment: సొంత రాష్ట్రంలో ఉద్యోగం.. నెలకు రూ.1,40,000 జీతం భయ్యా.. మరి ఇంకెందుకు ఆలస్యం..!

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×