Viral Video: చిన్న వయస్సులో స్కూల్ జ్ఞాపకాలు చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. అందులో స్నేహితులతో గడిపిన సమయాలు, కొత్త విషయాలు నేర్చుకోవడం, మొదటి రోజుల్లో ఉపాధ్యాయుల దగ్గర నుంచి నేర్చుకున్న పాఠాలు సహా అనేక విషయాలు ఉంటాయి. టీచర్ కొట్టినప్పుడు ఏడవటం నుంచి పరీక్షల్లో విజయం సాధించే వరకు అనేక జ్ఞాపకాలుంటాయి. అవన్నీ ఇప్పుడెందుకు అంటారా. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్ అవుతున్న ఓ వీడియో(Viral Video)లో స్కూల్ పిల్లలు బెంచిపై దోస్తులతో కలిసి దరువేసిన వీడియో అదిరిపోయింది.
ఆ క్రమంలో ఓ విద్యార్థి చేతితో బల్లను కొడుతూ శబ్దం చేస్తుండగా, మరో విద్యార్థి కంపాక్స్ పెట్టెతో సౌండ్ చేశాడు. ఇంకో స్టూడెంట్ తన వాటర్ బాటిల్తో సౌండ్ చేశాడు. మొత్తంగా పలువురు విద్యార్థులు కలిసి ఒక అద్భుతమైన సంగీతాన్ని సృష్టించారు. పూణేలోని ఒక పాఠశాల విద్యార్థులు ఈ అద్భుతమైన కళా ప్రదర్శన చేశారు. ఈ వీడియోను ప్రాజెక్ట్ అస్మి పూణే అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 3,095,018కుపైగా లైకులు వచ్చాయి. దీంతోపాటు ఈ వీడియోను అనేక మంది షేర్ చేస్తున్నారు.
వీడియోలో పిల్లలందరూ కూడా ఒక్కో శబ్దాన్ని చేస్తూ మంచి రిథమ్ ఉన్న మ్యూజిక్ ను ప్రదర్శించారు. ఇది చూసిన నెటిజన్లు వీడియోను లైక్ చేయకుండా ఉండలేకపోతున్నారు. మరికొంత మంది కామెంట్లు కూడా చేశారు. చిన్నారుల టాలెంట్ సూపర్ అని ఒకరు, అదుర్స్ మరొకరు ఇలా పలు రకాలుగా వ్యాఖ్యలు చేస్తూ, పిల్లల ట్యాలెంటును మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో చూస్తే స్కూల్ లైఫ్ ఎంత అమూల్యమైందో అర్థమవుతుందని ఇంకో వ్యక్తి అన్నారు. అంతేకాదు ఈ వీడియో చూసిన అనేక మంది వారి విద్యార్థి దశలోని క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు. ఆ వీడియోలో వారిని వారి చూసుకుని మురిసిపోతున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">