SVSC film – ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ను టీమిండియా గెలుచుకున్న సంగతి తెలిసిందే. మొన్న మార్చి 9 ఆదివారం రోజున జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైట్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టును… తక్కువ పరుగులకు కట్టడి చేసి సక్సెస్ అయిన టీమిండియా.. చేజింగ్ లో కూడా దుమ్ము లేపింది. ఈ తరుణంలోనే ఫైనల్ మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా.
Also Read: KL Rahul: ఏం గుండె రా అది… ఐపీఎల్ 2025 కంటే ముందు కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం ?
దీంతో మూడోసారి ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ గెలుచుకుంది. అయితే… టీమిండియా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ గెలుచుకున్న నేపథ్యంలో…. ఆసక్తికర విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కొంత మంది నెటిజెన్స్. ప్రిన్స్ మహేష్ బాబు అలాగే విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 2013 సంవత్సరంలో రిలీజ్ అయి సక్సెస్ అందుకుంది. అయితే ఈ సినిమా కారణంగానే ఈసారి ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ గెలుచుకున్నారని… టీమిండియా పై కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది.
2013 సంవత్సరంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రిలీజ్ అయినప్పుడు… ఛాంపియన్స్ ట్రోఫీ 2013 టోర్నమెంట్ను టీమిండియా గెలుచుకుంది. ఈ రెండు కూడా 2013లో జరిగాయి. దీంతో మహేష్ బాబు అలాగే వెంకటేష్ నటించిన… సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కారణంగానే టీమ్ ఇండియాకు అప్పుడు కప్పు వచ్చిందని చెబుతున్నారు. ఇక ఇదే నెలలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రీ- రిలీజ్ అయింది. ఇదే తరుణంలో ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ను కూడా టీం ఇండియా గెలుచుకుంది. 2013లో అలాగే 2025 సంవత్సరంలో… సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రిలీజ్ కావడం కారణంగానే… టీమిండియా కు ఛాంపియన్స్ ట్రోఫీలు రెండు వచ్చాయని… మహేష్ బాబు అలాగే విక్టరీ వెంకటేష్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Jio Hotstar – IPL 2025: ఐపీఎల్ ఫ్యాన్స్ కు జియో అదిరిపోయే శుభవార్త.. ఇకపై రూ.100 లకే
అంతేకాదు ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా.. 2013 సంవత్సరంలో… టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడం వెనుక మహేంద్రసింగ్ ధోని కష్టం ఎంతో ఉంది. అతని కెప్టెన్సీ లోనే టీమిండియా అప్పుడప్పుడే రాటు తేలింది. అప్పటికే t20 వరల్డ్ కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ కూడా గెలిచింది టీమిండియా. ఇక 2013లో కూడా ఛాంపియన్ ట్రోఫీ గెలుచుకుంది. ఇక ఈసారి 2025 ఛాంపియన్స్ ట్రోఫీని రోహిత్ శర్మ కెప్టెన్సీ లో టీమిండియా గెలుస్తుంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">