Thailand Snake Ice Cream: ఈ రోజుల్లో బయట ఫుడ్ తినాలంటేనే వణుకు పుడుతోంది. పేరు మోసిన రెస్టారెంట్లు, హోటల్స్ కూడా పరిశుభ్రత విషయంలో దారుణంగా ఉంటున్నాయి. ఆహారంలో బొద్దింకలు, పురుగులు, చనిపోయిన ఎలుకలు, కప్పలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వెళ్లి అట్ల సరదాగా ఫుడ్ తిందామనుకున్నా వెనుకడుగు వేస్తున్నారు. అడపా దడపా ఫుడ్ సెక్యూరిటీ అధికారులు దాడులు చేసినా, కొద్ది రోజుల తర్వాత మళ్లీ అదే బాట పడుతున్నాయి. తాజాగా ఐస్ క్రీమ్ కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి జీవితంలో మర్చిపోలేని పరిస్థితి ఎదురయ్యింది. అతడే కాదు, ఇతరులు కూడా ఐస్ క్రీమ్ కొనేందుకే వెనుకాడే పరిస్థితి నెలకొన్నది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
థాయ్ లాండ్ లో షాకింగ్ ఘటన
తాజాగా థాయ్ లాండ్ లోని మయాంగ్ రాట్చబురిలోకు చెందిన రేబాన్ నక్లెంగ్ బూన్ అనే వ్యక్తి ఓ హోటల్ కు వెళ్లాడు. అక్కడ బ్లాక్ బీన్ ఐస్ క్రీం బార్ తెచ్చుకున్నాడు. కవర్ తీసి పుల్ల ఐస్ క్రీమ్ హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. కాస్త తినగానే ఐస్ క్రీమ్ లో ఏదో ఉన్నట్లు అనుమానం కలిగింది. పరిశీలించి చూసి షాక్ అయ్యాయి. ఐస్ క్రీమ్ లో చనిపోయిన ఒక పాము కనిపించింది. చిన్న పాము ఐస్ లో గడ్డ కట్టుకుపోయింది. వెంటనే రెబాన్ భయంతో వణికిపోయాడు. అతను భయంతో వణికిపోయాడు. వెంటనే ఈ విషయాన్ని సదరు హోటల్ వాళ్లకు చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ ఐస్ క్రీమ్ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Thai ice cream with meat: a tourist bought ice cream from a street vendor in Thailand, and inside there was a whole snake. pic.twitter.com/uTDAiZ1Zsp
— Andrey Zubkov🇷🇺🇺🇦 (@Dhdh359005) March 6, 2025
ఐస్ క్రీమ్ లో ఉన్నది విషపూరిత పాము
ఇక ఐస్ క్రీమ్ లో ఉన్న పాము నలుపు, పసుపు రంగు తలతో కనిపించింది. దీనిని బంగారు చెట్టు పాము లేదంటే క్రిసోపెలియా ఆర్నాటా అని పిలుస్తారు. ఈ పాము విషపూరిత జాతికి చెందినది. ఈ పాములు సాధారణంగా 70 సెంటీ మీటర్ల నుంచి 130 సెంటీ మీటర్ల పొడవు పెరుగుతాయి, ఐస్ క్రీం లోపల ఉన్నది మాత్రం చిన్న పాము పిల్ల. ఇది సుమారు 10 సెంటీ మీటర్ల వరకు ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
అటు ఈ పాము ఐస్ క్రీమ్ ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేయగా, మరికొంత మంది ఫన్నీగా కామెంట్స్ చేశారు. “సరికొత్త ఫ్లేవర్ కోసం స్నేక్ ఐస్ తయారు చేశారు” అని కో వ్యక్తి జోక్ చేశాడు. “పాము చనిపోయినప్పటికీ మీరు హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సిందే!” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఇది చాలా సీరియస్ విషయం. ఈ ఘటనపై దర్యాప్తు చేసి, దోషులను కఠినంగా శిక్షించాలి” అని మరికొంత మంది కామెంట్స్ చేశారు.
Read Also: ఆ కారులో ఏముంది? ఆమె అంత భయంతో పరిగెట్టింది?