Devara 2..రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR).. రామ్ చరణ్ (Ram Charan) తో కలిసి నటించిన చిత్రం ఆర్.ఆర్.ఆర్. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని అందించింది. అంతేకాదు ఈ ఇద్దరి హీరోలకు గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత అంతే అంచనాలతో ఎన్టీఆర్.. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో సినిమా చేశారు. అదే దేవర(Devara).. మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. ఆ తరువాత రూ.600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి మంచి సక్సెస్ ను అందుకుంది. ఇకపోతే ఇప్పుడు దేవర సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ లాక్ అయినట్లుగా సమాచారం. కొరటాల శివ పూర్తి స్క్రిప్టు ఎన్టీఆర్ కి వినిపించగా.. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి మొదట ఈ సినిమా సీక్వెల్ అనగానే అందరూ పెదవి విరిచారు. కానీ పుష్ప2 రేంజ్ లో సినిమా మీ ముందుకు తీసుకొస్తానని హామీ ఇచ్చారు కొరటాల శివ. అందులో భాగంగానే కొరటాల శివ కూడా ఈ సినిమాలోని ప్రతి అంశంపై కూడా చాలా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ALSO READ:Devara 2: పుష్ప2 కి మించి.. సర్ప్రైజింగ్ పాత్రలతో కొరటాల భారీ ప్లాన్ చేశారుగా..?
సర్ప్రైజింగ్ పాత్రలతో దేవర 2..
ముఖ్యంగా దేవర 2 లోకి సర్ప్రైజ్ పాత్రల ఎంట్రీ కూడా ఉండనుంది అని అంటున్నారు. నిజానికి కొరటాల శివ దర్శకత్వంలో దేవర2 సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులతో పాటు దేవర సినిమా అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకు అంటే మొదటి పార్ట్ లో కథ నడిపించిన తీరు అంత ఆసక్తికరంగా ఉండడంతో సెకండ్ పార్ట్ లో ఏం జరగబోతోంది అనే విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ (Kalyan Ram) యువసేన బ్యానర్ మీద సుధాకర్ మిక్కిలినేని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే పుష్ప2 సినిమాలో ఏ రేంజ్ లో అయితే యాక్షన్స్ సన్నివేశాలు ఉన్నాయో.. అంతకుమించి దేవర2 సినిమాలో ఉంటాయని, అందుకు తగ్గట్టుగానే పలు జాగ్రత్తలు కూడా కొరటాల తీసుకుంటున్నారని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఎన్నో అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ఎన్టీఆర్ సినిమాలు..
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. డ్రాగన్ అనే టైటిల్ తో ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటికే 1500 మంది జూనియర్ ఆర్టిస్టులతో ప్రశాంత్ నీల్ హైదరాబాదులో సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ నెల ఆఖరి కల్లా ఎన్టీఆర్ కూడా సినిమా షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు. ఇక మరొకవైపు ఎన్టీఆర్ బాలీవుడ్లో హృతిక్ రోషన్ తో వార్ 2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కూడా ఊహకుమించి ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇటీవల హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మీద 500 మంది డాన్సర్లతో పాటు చిత్రీకరణ కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలా ఎప్పటికప్పుడు హై పెర్ఫార్మన్స్ తో ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాతో అటు బాలీవుడ్ ఆడియన్స్ ని కూడా ఒకేసారి ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయారు. ఈ సినిమాలతో ఎన్టీఆర్ ఇమేజ్ అమాంతం పెరిగిపోతుందని చెప్పడంలో సందేహం లేదని ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.