BigTV English

Viral Video: ఆ కారులో ఏముంది? ఆమె అంత భయంతో పరిగెట్టింది?

Viral Video: ఆ కారులో ఏముంది? ఆమె అంత భయంతో పరిగెట్టింది?

ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని కొన్ని ఘటనలు ఉంటాయి. అలాంటి వాటిలో ఎక్కువగా తృటిలో ప్రాణాలతో బయట సిచ్యువేషన్స్ ఉంటాయి. రెప్పపాటులో ప్రాణాలతో బయటపడిన ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. ఓ మహిళ కారు డోర్ ఓపెన్ చేసి ఉండటాన్ని గమనించి క్లోజ్ చేసేందుకు దగ్గరకు వెళ్తుంది. కారు లోపల చూసి భయంతో వణికిపోతుంది. బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి ఇంట్లోకి పరిగెత్తుతుంది. ఇంతకీ ఆ కారు ఏం ఉందంటే?


ఆ మహిళ అంతలా ఎందుకు భయపడిందంటే?

ఓ మహిళ కుటుంబం చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలతో ఉన్న చక్కటి ప్రదేశంలో ఇళ్లు కట్టుకుంది. ఎలాంటి పొల్యూషన్ లేని ప్రదేశంలో చక్కగా జీవిస్తున్నారు. ఇంటి ముందు అన్ని చెట్లే ఉన్నాయి. చూడ్డానికి ఆ ప్లేస్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పటిలాగే బయటకు వెళ్లి వచ్చి ఇంటి ముందుకు చెట్టు కింద కారు పార్క్ చేశారు. అందరూ ఇంట్లోకి వెళ్లారు. ఇక సదరు మహిళ పొద్దున్నే లేచింది. పెరటిలోని పండ్లను కోసి బుట్టలో వేసుకుని చంకన పెట్టుకుంది. బయటకు వెళ్లి చూసే సరికి కారు డోర్ ఓపెన్ చేసి ఉంది. అయ్యో.. కారు డోర్ వేయడం మర్చిపోయామే అనుకుంది. కారు దగ్గరికి వెళ్లి డోర్ క్లోజ్ చేయాలి అనుకుంది. లోపల ఏం ఉందో చూసి భయంతో వణికిపోయింది.


డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్లిన ఎలుగుబంటి

ఇంతకీ ఆ కారులో ఏం ఉందనే కదా మీ అనుమానం. అయితే.. ఒకసారి ఈ వీడియోను చూడండి. రాత్రి పూట కారు డోర్ సరిగా క్లోజ్ చేయకపోవడంతో అటుగా వచ్చిన ఓ ఎలుగు బంటి, కారు డోర్ ఓపెన్ చేసింది. అందులోకి వెళ్లి హాయిగా పడుకుంది. సదరు మహిళ అక్కడికి వెళ్లి చూసే సరికి వెంటనే మేల్కొంది. సదరు మహిళ మీదికి దూకేందుకు ప్రయత్నించింది. ఆమె బలంగా కారు డోర్ ను క్లోజ్ చేసేందుక ప్రయత్నించింది. కానీ, ఎలుగు బంటి లోపలి నుంచి బలంగా డోర్ ఓపెన్ చేసేందుక ప్రయత్నించింది. దీంతో సదరు మహిళ.. తన మీద ఎలుగు బంటి దాడి చేస్తుందని భావించి, అక్కడి నుంచి ఇంట్లోకి పారిపోయింది. ఈ క్రమంలో తన చేతిలోని పండ్ల బుట్ట కింద పడటంతో అన్ని దూరంగా దొర్లిపోయాయి. కొద్ది సేపు అక్కడే ఉన్న ఎలుగు బంటి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

ఈ దృశ్యాలు అన్ని వాళ్ల ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే 17 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. కారు పార్క్ చేసే సమయంలో కచ్చితంగా డోర్లు లాక్ చేయాలని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. లేదంటే ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత అయినా, ఇకపై కార్లు ఉన్న ప్రతి ఒక్కరు డోర్లు లాక్ చేయాలని సూచిస్తున్నారు.

Read Also: టర్కీకి చెక్కేస్తున్న బట్టతల బాధితులు.. ఇంతకీ అక్కడి ప్రత్యేకత ఏమిటో తెలుసా?

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×