Nagin Dance Viral Video: తెలంగాణలో గణపతి ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి గల్లీలో గణపయ్య కొలువుదీరుతాడు. తొమ్మిది రోజుల పాటు భక్తుల నుంచి ఘనమైన పూజలు అందుకుంటాడు. ఇక ఈ 9 రోజులలో వినాయక మండపాల దగ్గర చేసే డ్యాన్సులు, కోలాటాలు, భజనలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఇక ఇదే సమయంలో కొంత మంది మందు బాబులు డ్యాన్సు పేరుతో చేసే రచ్చ మామూలుగా ఉండదు.
పాముతో రియల్ నాగిని డ్యాన్స్..
ఇక గణపతి మండపం దగ్గర ఓ వ్యక్తి పాముతో కలిసి నాగిని డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయ్యగారు కాస్త, కడుపులో సురాపానం వేసి గణపతి మండపం దగ్గరికి వచ్చాడు. పాము అక్కడికి వచ్చిందా? లేదంటే, ఎవరైనా తెచ్చారా? తెలియదు. కానీ, ఆ పామును చూడగానే సదరు వ్యక్తికి పూనకం వచ్చినట్టు అయ్యింది. పాముతో కలిసి నాగిని డ్యాన్స్ చేయాలనుకున్నాడు. వెంటనే తలకు రుమాలు చుట్టి రంగంలోకి దిగాడు. మోకాళ్ల మీద కూర్చొని చేతులను పిల్లన గ్రోవిలా ఫీలవుతూ ఓ రేంజ్ లో డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. అతడితో పోటీపడే చేయలేక, పామే ఓడిపోయింది. సారు కడుపులో ఉన్న తీర్థం తగ్గేదే లే అన్నట్లు నృత్యం చేయిస్తుంది. పెద్ద మనిషి డ్యాన్స్ చూసి అక్కడున్న వాళ్లంతా ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Read Also: 17వ బిడ్డకు జన్మనిచ్చిన 55 ఏళ్ల మహిళ.. ఇప్పటికైనా యుద్ధం ఆపుతారా?
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
ఇక ఈ రియల్ నాగిని డ్యాన్స్ చూసి నెటిజన్లు క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. “రేయ్ నన్ను పాము అనుకున్నావా? లేకపోతే ఉప్పల్ బాలు అనుకున్నావా?” అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ఒరేయ్ చారీ, నిజమైన నాగినీ డ్యాన్స్ అంటే ఇదేరా” అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. “వాడి డాన్స్ తర్వాత చూసేరు గానీ.. వెనక్కి తిరిగి చూసుకోండి అసలైన నాగరాజులు వచ్చాయేమో?” అని ఇంకో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఏం లేదు ఫ్రెండ్స్.. మా మామ క్వాటర్ తాగేవాడు. ఇవాళ రెండు క్వార్టర్లు తాగాడు. ఎదురుగా పామే కాదు, పాము వాళ్ల అమ్మమ్మ వచ్చినా తగ్గడు” అని ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు. “ఒరేయ్ ఆడికి ఎవడైన చెప్పండ్రా.. పోని ఎవరికైనా చూపించండ్రా” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. “పాము కే డ్యాన్స్ నేర్పిస్తున్నాడు. టార్చ్ బేరర్ అంటే ఇతడే కావచ్చు” అని మరో వ్యక్తి అభిప్రాయపడ్డాడు. మొత్తంగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపు ఊపేస్తోంది.
Read Also: పని మనిషికి రూ.8 లక్షల జరిమానా.. ఏంటీ, సెలవు రోజు పని చేసినా తప్పే?