BigTV English

CM Chandrababu: ఎట్టకేలకు ఫలించిన చంద్రబాబు కృషి.. కుప్పంలో కృష్ణమ్మకు సీఎం జలహారతి

CM Chandrababu: ఎట్టకేలకు ఫలించిన చంద్రబాబు కృషి.. కుప్పంలో కృష్ణమ్మకు సీఎం జలహారతి

CM Chandrababu: ఎట్టకేలకు.. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి ఫలించింది. కుప్పం నియోజకవర్గంలో కృష్ణమ్మ జల సవ్వడులు కనిపించబోతున్నాయ్. 19 నియోజకవర్గాలని తాకుతూ.. 738 కిలోమీటర్లు ప్రయాణించి.. కృష్ణమ్మ కుప్పానికి చేరుతోంది. శ్రీశైలం నుంచి బయల్దేరి.. 10 రిజర్వాయర్లని నింపుతూ కుప్పం దాకా చేరుతున్నాయ్ కృష్ణా నీళ్లు. రాయలసీమని.. కోనసీమగా మార్చేలా.. రికార్డు టైమ్లో.. హంద్రీ-నీవా విస్తరణ పనులు పూర్తి చేశారు.


హంద్రీనీవా కాలువల్లో కృష్ణమ్మ ప్రవాహం
గత నెల 17న కర్నూలు జిల్లా మాల్యాల ఎత్తిపోతల నుంచి కుప్పానికి నీటిని విడుదల చేశారు. నాటి నుంచి హంద్రీనీవా కాలువల్లో ప్రవహించిన కృష్ణమ్మ.. 738 కిలోమీటర్లు ప్రయాణించి.. కుప్పానికి చేరింది. ఈ శనివారమే.. కుప్పంలో కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్నారు సీఎం చంద్రబాబు.

సీమ పల్లెల్లోకి నీళ్లు పారించారు చంద్రబాబు
అతి తక్కువ వర్షపాతం ఉండే సీమ జిల్లాల్లో.. నీళ్లతోనే సీమ ప్రజల స్థితిగతులు మారుతాయని.. ఇరిగేషన్‌కి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో హంద్రీ నీవా విస్తరణ పనులు పూర్తి చేసి.. బీడు భూముల్లోనూ నీళ్లు పారేలా చేశారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడే.. సాగునీటి ప్రాజెక్టులపై భారీ ఎత్తున నిధులు ఖర్చు చేశారు.


హంద్రీనీవా ప్రాజెక్టుపై రూ.4,183 కోట్లు ఖర్చు..
హంద్రీనీవా ప్రాజెక్టుపై.. తెలుగుదేశం ప్రభుత్వం 4 వేల 183 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టును పరుగులు పెట్టించింది. అందుకే.. హంద్రీనీవా నీళ్లు ఇప్పుడు చిత్తూరు జిల్లాలో చివరి భూముల దాకా చేరాయని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ సీజన్‌లో ఎలాగైనా నీళ్లివ్వాలనే లక్ష్యంతో.. పనుల్లో వేగం పెంచారు. రికార్డు స్థాయిలో కేవలం 100 రోజుల్లో మెయిన్ కెనాల్ విస్తరణ, లైనింగ్ పనులు పూర్తి చేసి.. ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3850 క్యూసెక్కులకు పెంచారు. ఇప్పుడు హంద్రీనీవా కాల్వ విస్తరణతో.. సీమకు జలకళ వచ్చిందనే చర్చ జరుగుతోంది.

Also Read: మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి అరెస్ట్..

కృష్ణా జలాలకు హారతి.. సంబరాలు చేసుకుంటున్న ప్రజలు..
హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందుతోంది. విస్తరించిన కాల్వల ద్వారా పరుగులు పెడుతోన్న కృష్ణమ్మ.. 19 నియోజకవర్గాలను తాకుతూ.. 10 రిజర్వాయర్లలని నింపుతోంది. హంద్రీనీవా ఆయకట్టులో చివరి జిల్లా చిత్తూరు. ఈ జిల్లాలో 16 లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నా.. కేవలం 6 లక్షల ఎకరాలకే సాగునీరు అందుతోంది. ఇప్పుడు.. హంద్రీనీవా రెండో దశ పనులు పూర్తి చేసి జిల్లాలోని 2 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తారు. కుప్పంలోని పరమ సముద్రంలో.. సీఎం చంద్రబాబు కృష్ణా జలాలకు హారతి ఇచ్చారు. తమకోసం తరలివచ్చిన కృష్ణమ్మని చూసి సంబరాలు చేసుకుంటున్నారు.

Related News

CM Chandrababu Naidu: తెలంగాణ నాయకులు ఈ విషయాన్ని గ్రహించాలి.. సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

Nellore: నాతో తిరిగి.. నన్నే లేపేస్తార్రా! హత్యకు కుట్రపై కోటంరెడ్డి ప్రెస్ మీట్..

AP Politics: నాగబాబుపై జనసైనికుల తిరుగుబాటు.. పవన్ ప్లాన్ ఏంటి?

APSRTC bus fight: ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులో ఘర్షణ.. సీటు కోసం బూతు దాకా వెళ్లిన వాగ్వాదం.. వీడియో వైరల్!

Kotam Reddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిపై హత్యకు కుట్ర

Big Stories

×