Viral News: అదొక రహదారి. ఆ దారిలో కారు వేగంగా వెళుతోంది. కారు వెనుక గోమాతలు పరుగులు పెట్టాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా గోమాతల సమూహం. ఎందుకు అలా వెంట పడుతున్నాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. కారు మాత్రం ఆగకుండా పోతూ ఉంది. ఒక్కసారిగా ఒక్క గోవు , కారుకు ఎదురుగా అడ్డంగా వచ్చి నిలబడింది. ఆ కారులోని వ్యక్తికి ఏమి అర్థం కాని పరిస్థితి. ఆ గోవులన్నీ కారు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌ఘర్ రోడ్డు వద్ద జరిగింది. ఇంతకు ఆ గోమాతలు అలా ఎందుకు కారు చుట్టూ తిరిగాయో తెలుసుకుందాం.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌ఘర్ రోడ్డుపై వెళుతున్న కారును ఆవుల సమూహం వెంటపడింది. అందులో ఒక తల్లి ఆవు, మిగిలినవి పిల్ల ఆవులు. కారు మాత్రం యదావిధిగా పోతూనే ఉంది. ఎక్కడ కూడా నిలుపుదల చేయలేదు. ఆ కారు వెంట గోమాతలు కూడా మరింత స్పీడ్ పెంచాయి. అక్కడి జనాభా అసలేం జరిగిందంటూ ఆశ్చర్యపోయారు. అంతలోనే కారుకు అడ్డంగా వచ్చి నిలబడ్డ ఆవుల సమూహం, కారు చుట్టూనే తిరిగాయి. అలాగే తిరుగుతుండగా, స్థానిక ప్రజలు అక్కడికి చేరుకున్నారు.
అంతలోనే ఒక ఆర్తనాదం వినిపిస్తోంది. అది కూడా కారు కింది భాగాన నుండి వస్తోంది. అందరూ కలిసి కారు కింద ఏముందని చూశారు. అలా చూశారో లేదో, కారునే గాల్లోకి లేపారు. దానితో కారు కింద ఉన్న అరుపు ఆగింది. ఆ ఆవులు హమ్మయ్య అనే రీతిలో ఆనందంతో వెనుతిరిగి వెళ్ళాయి. అసలేం జరిగిందంటే.. ఎలా వెళ్లిందో కానీ కారు కిందికి ఓ పిల్ల ఆవు వెళ్లి చిక్కుకుంది. అది గమనించని కారు డ్రైవర్ మాత్రం కారును అలాగే నడిపారు. తన బిడ్డ కారు కింద ఉన్న విషయాన్ని గమనించిన తల్లి గోమాత, ఇతర పిల్లలతో కలిసి కారు వెంటపడింది. కారు వేగాన్ని కూడా అందుకొని, అడ్డంగా వచ్చి నిలబడి ఆపింది.
తన బిడ్డ కారు కింద ఉండడంతో, ఆ కారు చుట్టూ తిరుగుతూ స్థానికులను ఆకర్షించింది. ప్రజలు గమనించి కారు కింది భాగంలో ఉన్న ఆవును కాపాడారు. ఈ తతంగమంతా సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో, ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తల్లి నుండి బిడ్డను వేరే చేసే ప్రయత్నం చేస్తే, తల్లి దేనికైనా తెగిస్తుందని వీడియోకు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు ఆ పిల్ల ఆవు బ్రతకడంతో కారు ముందుకు కదిలిందని, లేకుంటే కారును ధ్వంసం చేసే రీతిలో తల్లి గోమాతలో ఆవేశం ఆ వీడియోలో కనిపించడం విశేషం. అందుకే అంటారేమో తల్లిని మించిన దైవం లేదని కదా!
దూడ మీదకు దూసుకెళ్లిన కారు.. ఆవులన్నీ ఏం చేశాయో చూడండి.#Car #Cows #Raigarh #CalfRescue #AnimalRescue #AnimalWelfare #ViralMoment #Swetchdailyepaper pic.twitter.com/2r9SLOZWW5
— Swetcha Daily (@swetchadaily) December 23, 2024