BigTV English

Pushpa 2: ‘పుష్ప 2’ హెచ్‌డీ ప్రింట్ లీక్.. యూట్యూబ్‌లోనే మొత్తం..

Pushpa 2: ‘పుష్ప 2’ హెచ్‌డీ ప్రింట్ లీక్.. యూట్యూబ్‌లోనే మొత్తం..

Pushpa 2: ఈరోజుల్లో పైరసీని ఆపడం మేకర్స్‌కు చాలా కష్టమైన విషయంగా మారిపోయింది. ఒక మూవీ థియేటర్లలో విడుదలయ్యింది అంటే మార్నింగ్ షో పూర్తవ్వగానే ఆ మూవీ మొత్తం పైరసీ సైట్స్‌లో అందుబాటులో ఉంది. మామూలుగా ఇలా చేస్తే కాపీరైట్ చర్యలు ఉంటాయి. కానీ కాపీరైట్స్‌కు కూడా దొరకకుండా కొందరు దుండగులు సినిమాలను పైరసీ చేస్తున్నారు. అలా పైరసీ జరిగినప్పుడు మేకర్స్‌కు తెలియగానే చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా పాన్ ఇండియా మూవీగా విడుదలయిన ‘పుష్ప 2’కు కూడా అవే కష్టాలు ఎదురయ్యాయి. ఏకంగా యూట్యూబ్‌లోనే ఈ సినిమా హెచ్‌డీ ప్రింట్‌ను అప్లోడ్ చేశారు దుండగులు. దీనిపై మేకర్స్ వెంటనే స్పందించారు.


మేకర్స్‌కు ఛాలెంజ్

మామూలుగా ఒక సినిమా విడుదలయిన తర్వాత వెంటనే దానికి సంబంధించిన పైరసీ ప్రింట్‌ను పలు పైరసీ వెబ్‌సైట్స్‌లో అప్లోడ్ చేస్తారు సైబర్ నేరగాళ్లు. ఆ పైరసీ సైట్ల గురించి తెలిసిన పలువురు వాటిని ఓపెన్ చేసుకొని థియేటర్‌కు వెళ్లకుండానే కొత్త సినిమాలను తమ ఫోన్లలో చూసేస్తారు. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ఫ 2’ విషయంలో కూడా అదే జరిగింది. ఈ మూవీ విడుదలయ్యి బెనిఫిట్ షో పూర్తయిన వెంటనే మొత్తం సినిమాను పైరసీ సైట్స్‌లో అప్లోడ్ చేశారు దుండగులు. ఈ విషయం తెలియగానే వెంటనే సినిమాను పైరసీ సైట్ల నుండి తొలగించేలా చేశారు మేకర్స్. మరోసారి ‘పుష్ప 2’ విషయంలో మేకర్స్‌కు అదే ఛాలెంజ్ ఎదురయ్యింది.


Also Read: ఫ్యాన్స్‌ కోసం అల్లు అర్జున్ స్పెషల్ పోస్ట్.. వారికి దూరంగా ఉండండి అంటూ రిక్వెస్ట్

ఆలస్యం చేయలేదు

ఈసారి ఏకంగా ‘పుష్ప 2’ హెచ్‌డీ ప్రింట్‌ను యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేశారు దుండగులు. మామూలుగా పైరసీ కంటెంట్ విషయంలో యూట్యూబ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాంటిది యూట్యూబ్‌లో ‘పుష్ప 2’ హెచ్‌డీ ప్రింట్ లీక్ అవ్వడం, దానిని చాలామంది చూడడం కూడా జరిగిపోయింది. దీంతో ఈ సమాచారం మేకర్స్ వరకు వెళ్లింది. నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ‘పుష్ప 2’ హెచ్‌డీ ప్రింట్‌ను యూట్యూబ్ నుండి తొలగించేలా చేశారు. ఇదంతా చూస్తుంటే పైరసీ సైట్స్ వల్ల థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు ఎంత ఇబ్బంది కలుగుతుందో అర్థమవుతుంది. ఏ సినిమా కూడా పైరసీ నుండి తప్పించుకోలేదని తెలుస్తోంది.

థియేటర్లు హౌస్‌ఫుల్

డిసెంబర్ 5న ‘పుష్ఫ 2’ (Pushpa 2) సినిమా థియేటర్లలో విడుదలయ్యింది. ఇప్పటికే ఈ మూవీ కోసం మూడేళ్ల నుండి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్‌గా ఈ సినిమా విడుదల అవ్వడంతో మొదటిరోజే చాలావరకు థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలు నడిచాయి. ఈ మూవీ విడుదలయ్యి మూడో వారంలోకి అడుగుపెట్టినా కూడా ఇప్పటికీ చాలావరకు థియేటర్లలో ఈ సినిమాను చూడడానికి ప్రేక్షకులు చాలానే వస్తున్నారు. ఇప్పటికే ‘పుష్ప 2’ ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ మార్క్‌ను టచ్ చేసింది. తెలుగులో మాత్రమే కాకుండా హిందీలో కూడా ‘పుష్ప 2’ హవా కొనసాగుతోంది. ఇప్పటికే ఒరిజినల్ హిందీ సినిమాను వెనక్కి నెట్టే రేంజ్‌లో ఈ మూవీ కలెక్షన్స్ రాబట్టింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×