Telangana Govt – Allu Arjun : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో అల్లు అర్జున్ ఒకరు. అల్లు అర్జున్ రీసెంట్ ఫిలిం పుష్ప 2 ఎంత పెద్ద ఘనవిజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అతి త్వరగా వెయ్యి కోట్లు సంపాదించిన మూవీగా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను డిసెంబర్ 5న రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్ కంటే ముందు రోజే కొన్నిచోట్ల ప్రీమియర్ షోస్ వేశారు. హైదరాబాదులో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ ఈ సినిమా చూడటానికి తన కుటుంబ సభ్యులతో పాటు వచ్చాడు. అయితే అల్లు అర్జున్ రావడంతో కేవలం టికెట్ కొనుక్కున్న ప్రేక్షకులు మాత్రమే కాకుండా చాలా మంది అభిమానులు కూడా ఒక్కసారిగా థియేటర్లోకి వచ్చేసారు. వీళ్ళని కంట్రోల్ చేయడంలో పోలీసులు కూడా కొంతమేరకు విఫలమయ్యారు. ఒకసారిగా క్రౌడ్ రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నాడు.
ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ ఈ కుటుంబానికి తన వంతు సహాయంగా 25 లక్షల రూపాయలను ప్రకటించి ఆ కుటుంబ బాధ్యతలు కూడా భవిష్యత్తులో తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే అంతా సద్దుమణిగిపోయింది అనుకునే టైంలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి గాంధీ హాస్పిటల్ లో వైద్య చికిత్సలు చేసి ఆ తర్వాత చంచల్గూడా జైలుకు తరలించారు. దాదాపు 14 రోజులు పాటు అల్లు అర్జున్ రిమాండ్ లో ఉంటారు అని వార్తలు కూడా వచ్చాయి. అయితే అల్లు అర్జున్ కి మద్యంతర బెయిల్ లభించింది. ఆ తరువాత ఒక్కసారిగా తెలుగు సినిమా ప్రముఖులు అంతా కూడా అల్లు అర్జున్ ను పరామర్శించారు. ఆ పరామర్శను లైవ్ టెలికాస్ట్ చేశాయి మీడియా ఛానల్స్.
ఇక్కడితో అల్లు అర్జున్ పై నెగిటివిటీ బాగా పెరిగింది. ఇక రీసెంట్ గా అసెంబ్లీ లో కూడా అల్లు అర్జున్ ప్రస్తావన వచ్చింది. ఇక ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీనితో అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తున్నారు అని కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలోనే గతంలో అల్లు అర్జున్ చేసిన కొన్ని మాటలు వైరల్ గా మారాయి. గతంలో అల్లు అర్జున్ అన్ స్టాపబుల్ అనే షోలో మాట్లాడుతూ… “నేను ఎవరికైనా నో చెప్పాను అని అంటే ఆ విషయంలో మాత్రమే నో చెప్పినట్లు, ఆ సబ్జెక్టు వరకే అది పరిమితం”అన్నట్లు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అల్లు అర్జున్ మీద ప్రత్యేకించి పగలు ప్రతీకారాలు ఏమీ లేవు కేవలం సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి మాత్రమే అబ్జెక్షన్ చేస్తూ మాట్లాడుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక అల్లు అర్జున్ నిన్న అసెంబ్లీ మీటింగ్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇంకొన్ని అనుమానాలకు దారితీసింది.
Also Read : Pushpa 2: ‘పుష్ప 2’ హెచ్‌డీ ప్రింట్ లీక్.. యూట్యూబ్‌లోనే మొత్తం..