BigTV English

Viral Video : ఇండియన్ రైల్లో జర్నీ చేస్తూ పిజ్జా ఆర్డర్ చేసిన విదేశీయుడు.. వీడియో వైరల్

Viral Video : ఇండియన్ రైల్లో జర్నీ చేస్తూ పిజ్జా ఆర్డర్ చేసిన విదేశీయుడు.. వీడియో వైరల్

Viral Video : కో అంటే కోటి. దొర్లుకుంటు వస్తుంది కొండ మీది కోతి. ఇది పాటే కావొచ్చు కానీ.. ఇండియాలో ఏదైనా సాధ్యమే. భారత్ ఇప్పుడు చాలా మారిపోయింది. సర్వీస్ సెక్టార్‌లో మనకు తిరుగులేకుండా పోయింది. లేటెస్ట్‌గా ఇండియాలో పర్యటిస్తున్న ఓ విదేశీయుడికి మరిచిపోలేని అనుభవం ఎదురైంది. అదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే.. తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫారినర్ ఏం చేశాడు? ఏంటా సంగతి?


జస్టిన్ మర్ఫీ. అతనో ట్రావెల్ వ్లాగర్. ఫ్రెండ్స్‌తో కలిసి ఇండియాలో పర్యటిస్తున్నాడు. నార్త్ నుంచి సౌత్‌కు రైల్‌లో వెళుతున్నారు. 14 గంటల సుదీర్ఘ ప్రయాణం అది. మధ్యలో అతనికి ఆకలేసింది. రైల్లో అందించే ఇండియన్ ఫుడ్ వాళ్లకి తినాలని అనిపించలేదు. పిజ్జా, బర్గర్ లాంటివి ఉంటే బాగుండని అనుకున్నారు. ఇప్పుడెలా? జర్నీలో ఉన్నాం కదా? ఇప్పటికిప్పుడు పిజ్జాల్లాంటివి ఎలా వస్తాయి అనుకున్నారు. అంతలోనే వారికో ఐడియా వచ్చింది. ఆ ఐడియా వారికి పిజ్జాలను తెచ్చిపెట్టింది. ఇంతకీ ఆ ఐడియా ఏంటంటే…

ట్రైన్‌లో నుంచే డొమినోస్‌కు ఫోన్


తాము ప్రయాణిస్తున్న రైల్ కాసేపట్లో మధురై స్టేషన్‌ను రీచ్ అవుతుందని తెలుసుకున్నారు. వెంటనే గూగుల్‌లో సెర్చ్ చేసి.. లోకల్‌‌లో ఉన్న ‘డొమినోస్’కు ఫోన్ చేశారు. తమ రైల్ జర్నీ గురించి చెప్పి.. ట్రైన్ మధురైకి వచ్చేలోగా తమకు నాలుగు మీడియం సైజ్ పిజ్జాలు డెలివరీ చేయగలరా అని అడిగారు. అందుకు డొమినోస్ ఓకే అంది. కాల్ కట్ చేశాక.. ఆ విదేశీయుల్లో ఆసక్తి, ఆతృత పెరిగింది. ఆర్డర్ చేసినట్టే పిజ్జాలు టైమ్‌కు స్టేషన్‌కు వస్తాయా? రావా? అని కాస్త టెన్షన్ పడ్డారు. కట్ చేస్తే….

ప్లాట్‌ఫామ్‌పై పిజ్జాలతో రెడీ..

కాసేపటికి ఆ రైల్ మధురై స్టేషన్‌లో ఆగింది. ట్రైన్ బోగిలోంచి ప్లాట్‌ఫారమ్ మీదకు దిగారు. పిజ్జా డెలివరీ బాయ్ కోసం చూశారు. అప్పటికే అతను వారి కోసం వెయిట్ చేస్తున్నాడు. సరిగ్గా వారి బోగి ఆగిన చోటే అతను ఉన్నాడు. చేతిలో నాలుగు వేడి వేడి పిజ్జాలు. ఆర్డర్ చేసింది మీరేనా అని అడిగి.. ఆ పిజ్జాలు వారి చేతిలో పెట్టాడు. ఆ ఫారినర్స్‌కు మైండ్ బ్లాక్. వారంతా ఫుల్ ఖుషీ అయ్యారు. డెలివరీ ఏజెంట్‌తో సెల్ఫీలు దిగారు. ట్రైన్ ఎక్కేసి.. బాక్స్‌లు తెరిచి చూస్తే.. చీజీ, జ్యూసీ ఇటాలియన్ చికెన్ పిజ్జాలు హాట్ హాట్‌గా ఉన్నాయి. లొట్టలేసుకుంటూ తృప్తిగా తిన్నారు ఆ విదేశీయులు. ఈ ఎపిసోడ్ అంతా వీడియో రికార్డ్ చేసి.. ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తే తెగ వైరల్ అవుతోంది.

కామెంట్స్ సైతం ఖతర్నాక్ వస్తు్న్నాయి. ఇట్స్ హాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా అంటున్నారు. ZOMATOలో సైతం రైలులో ఫుడ్ డెలివరీ ఆప్షన్ ఉందని సూచించారు. ఫోన్ కూడా చేయాల్సిన పనిలేదు.. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే.. మీ సీటు దగ్గరికే వచ్చి డెలివరీ చేస్తారని ఒకరు కామెంట్ పెట్టారు.

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×