BigTV English

OTT Movie : బామ్మ వీలునామాలో మతిపోగొట్టే ట్విస్ట్… ఐదు ఉంగరాల అసలు రహస్యం తెలిస్తే దిమ్మతిరగాల్సిందే మావా

OTT Movie : బామ్మ వీలునామాలో మతిపోగొట్టే ట్విస్ట్… ఐదు ఉంగరాల అసలు రహస్యం తెలిస్తే దిమ్మతిరగాల్సిందే మావా

OTT Movie : ఒక క్రిస్మస్ సీజన్‌లో, న్యూయార్క్ నగరం నుండి తన సొంత గ్రామానికి ఆడ్రీ అనే ఒక అమ్మాయి వస్తుంది. తన అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఆమె ఆఖరి కోరిక గురించి తెలుసుకుంటుంది. ఐదు బంగారు ఉంగరాలను, క్రిస్మస్ రోజుకు ముందే వాటి అసలు యజమానులకు చేర్చాలి. దానికి కేవలం తొమ్మిది రోజుల గడువు మాత్రమే ఉంది. ఇక ఆమె తన చిన్ననాటి స్నేహితుడితో కలిసి, ఈ ప్రయాణంలో అడుగుపెడుతుంది. అసలు ఈ ఉంగరాల వెనుక దాగిన రహస్యం ఏమిటి ? ఈ క్రిస్మస్ క్వెస్ట్ నిజంగా ఉంగరాల గురించి మాత్రమేనా, లేక ఇంకేదైనా విషయం ఉందా ? అనే వివరాల గురించి స్టోరీలో తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళితే

ఈ కథ న్యూయార్క్ నగరంలో ఫిమేల్ పెయింటర్ గా జీవిస్తున్న ఆడ్రీ మాస్ (హాలండ్ రోడెన్) చుట్టూ తిరుగుతుంది. క్రిస్మస్ సెలవుల కోసం ఆమె తన సొంత ఊరికి వస్తుంది. ఆమె అమ్మమ్మ ఇటీవలే చనిపోయి ఉంటుంది. అమ్మమ్మకి చెందిన ఒక షాప్‌ను అమ్మాలని చూస్తుంటుంది ఆడ్రీ తల్లి. ఆడ్రీ అమ్మమ్మ బీచ్‌లో దొరికిన వస్తువులను, వాటి యజమానులకు తిరిగి ఇవ్వడంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అయితే ఆడ్రీ తన అమ్మమ్మ వీలునామాలో రాసిన ఒక వింతైన కోరిక తెలుసుకుంటుంది. ఐదు బంగారు ఉంగరాలను, వాటి అసలు యజమానులకు క్రిస్మస్ ఉదయానికి ముందు తిరిగి ఇవ్వాలి. దానికి కేవలం తొమ్మిది రోజుల సమయం మాత్రమే ఉంది. అమ్మమ్మ ఆడ్రీని తన చిన్ననాటి స్నేహితుడు, ఇప్పుడు స్థానిక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌గా పనిచేస్తున్న ఫిన్ (నోలన్ జెరార్డ్ ఫంక్)తో కలిసి పనిచేయమని అందులో చెప్పి ఉంటుంది. ఇందులో ప్రతి ఉంగరం వెనుక ఒక సెంటిమెంట్ దాగి ఉంటుంది.


ఆడ్రీ, ఫిన్ ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉండేవాళ్లు. వీళ్ళు ఈ ఉంగరాల యజమానులను కనిపెట్టే క్రమంలో, గ్రామంలోని వివిధ వ్యక్తులను కలసి వాళ్ళ గురించి వివరాలు సేకరిస్తారు. ఈ యాత్రలో వీళ్ళు జింజర్‌బ్రెడ్ హౌస్ బిల్డింగ్, వార్షిక గివింగ్ గాలా, స్నోమ్యాన్ బిల్డింగ్ వంటి క్రిస్మస్ సంబంధిత కార్యకలాపాలలో పాల్గొంటారు. ఇవి వీళ్ళ మధ్య బంధాన్ని మరింత బలపరుస్తాయి. ఆడ్రీ తన కళ, కుటుంబం గురించి మరింత తెలుసుకుంటుంది. అయితే ఫిన్ తన గతం నుండి ఆడ్రీతో ఉన్న సన్నిహిత సంబంధాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక ఈ ఉంగరాల యాజమామూల కోసం వెతుకుతున్నప్పుడు, వీళ్ళు ఒకరి పట్ల ఒకరు ప్రేమను పెంచుకుంటారు. కానీ బయటికి మాత్రం చెప్పుకోలేక పోతారు. ప్రతి ఉంగరం యజమానిని కలసినప్పుడు ఒక సీక్రెట్ బయటికి వస్తుంది. చివరికి ఈ ఐదు ఉంగరాల వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? ఆడ్రీ,ఫిన్ లవ్ స్టోరీ ఏమౌతుంది ? అసలు బామ్మ ప్లాన్ ఏంటి ? అనే విషయాలను ఈ మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : పిల్లాడి మిస్సింగ్ కేసులో అడ్డంగా బుక్కయ్యే అన్నదమ్ములు … నరాలు కట్ అయ్యే సస్పెన్స్ మావా

ఏ ఓటీటీలో ఉందంటే

ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఫైవ్ గోల్డ్ రింగ్స్’ (Five Gold Rings). 2024 లో వచ్చిన ఈ సినిమాకి స్టీవెన్ ఆర్. మన్రో దర్శకత్వం వహించారు. ఇందులో హాలండ్ రోడెన్ (ఆడ్రీ మాస్), నోలన్ జెరార్డ్ ఫంక్ (ఫిన్ ఓ’సుల్లివన్), క్రిస్టెన్ హారిస్, హెన్రియెట్ ఇవానన్స్ (కే మిల్లర్), సుజాన్ ప్రింగిల్, మైలా వోల్క్, కెవిన్ మెక్‌ఇంటైర్ (ఫ్రాంక్ కెన్నెడీ జూనియర్) వంటి నటులు నటించారు. IMDbలో ఈ సినిమాకి 6.2/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

Related News

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Big Stories

×