BigTV English

Vaishno Devi Temple: వందే భారత్‌లో వైష్ణోదేవి ఆలయం నుంచి శ్రీనగర్‌కు.. ఇలా ప్లాన్ చేసుకోండి

Vaishno Devi Temple: వందే భారత్‌లో వైష్ణోదేవి ఆలయం నుంచి శ్రీనగర్‌కు.. ఇలా ప్లాన్ చేసుకోండి

జమ్మూ కాశ్మీర్లోని కట్రా – శ్రీనగర్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు జూన్ 7 నుండి చీనాబ్ వంతెన ద్వారా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. దీనివల్ల 150 కిలోమీటర్ల ప్రయాణం రెండు నుంచి మూడు గంటల్లోనే పూర్తి చేస్తుంది ఈ హై స్పీడ్ రైలు. వైష్ణో దేవి ఆలయాన్ని చూడడానికి ప్లాన్స్ వేసుకునేవారు ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తక్కువ సమయంలోనే ఆ కోరికను తీర్చుకోవచ్చు.


ఇప్పటికే తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను 530 మంది ప్రయాణికులతో శ్రీమాతా వైష్ణో దేవి రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ఇది ఒక చారిత్రాత్మక ప్రయాణంగా చెప్పుకోవచ్చు. కాశ్మీర్ ను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానం చేయాలనే ఆలోచనతోనే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కాట్రా నుండి ఏర్పాటు చేశారు. రెండు భారత్ వందే భారత రైళ్లు కాట్రా నుండి శ్రీనగర్ మధ్య పగటిపూట నాలుగు సార్లు ప్రయాణిస్తాయి.

వైష్ణో దేవి యాత్రకు వెళ్లాలనుకునేవారు కాట్రా నుండి ప్రయాణాన్ని మొదలుపెడతారు. అందుకే వైష్ణో దేవి యాత్రను మరింత సులభతరం చేసేందుకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉపయోగపడుతుంది. శ్రీనగర్ నుంచి కట్రా వెళ్లేందుకు ఆరు గంటలకు పైగా సమయం పడుతుంది. అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ వల్ల మూడు గంటల సమయం ఆదా అవుతుంది. కేవలం మూడు గంటల్లోనే మీరు శ్రీనగర్ నుంచి కట్రా చేరుకోగలరు. వారంలో ఆరు రోజులు పాటు ఈ వందే భారత్ ట్రైన్ తిరుగుతూనే ఉంటుంది.


భారతదేశంలో అత్యంత పవిత్రమైన హిందూ దేవాలయాలలో వైష్ణో దేవి ఆలయం ఒకటి. ఇది జమ్మూ కాశ్మీర్ లోని త్రికూట పర్వతాల మధ్య ఉంది. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. దుర్గాదేవి స్వరూపమైన మాత వైష్ణో దేవి ఆశీర్వాదం పొందడానికి ఏటా హిందువులు పవిత్ర యాత్రను చేపడతారు. మీరు కూడా వైష్ణో దేవి యాత్రకు ప్లాన్ చేస్తుంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ ద్వారా త్వరగా చేరుకునే అవకాశం ఉంది.

విమానం ద్వారా వైష్ణోదేవి ఆలయానికి ఎలా వెళ్లాలి?
వైష్ణో దేవి ఆలయానికి చేరుకోవాలంటే ముందుగా విమానంలో జమ్మూ విమానాశ్రయానికి వెళ్లాలి. అక్కడనుండి కట్రా ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. కట్రా నుంచి వైష్ణో దేవి ఆలయం దగ్గరే. ఢిల్లీ, ముంబై వంటి నగరాల నుంచి జమ్మూకి నేరుగా విమానాలు ఉన్నాయి. జమ్మూ నుండి కట్రా చేరుకోవడానికి ట్యాక్సీని అద్దెకు తీసుకోవచ్చు. లేదా రైలు మార్గం ద్వారా జమ్ములోని తావి రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి. ఇదే వైష్ణోదేవికి సమీపంగా ఉండే ప్రధాన రైలు కేంద్రం. దీనికి ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై వంటి నగరాల నుంచి నేరుగా రైళ్లు ఉన్నాయి. జమ్మూ నుండి కట్రా చేరుకున్న తర్వాత స్థానిక రవాణా ద్వారా వెళ్లాల్సి వస్తుంది.

ఎంతోమంది శ్రీనగర్ ద్వారా కూడా కట్రా ప్రాంతానికి చేరుకుంటారు. జమ్మూ నుంచి కాకుండా శ్రీనగర్ నుంచి వైష్ణో దేవి ఆలయానికి ప్రయాణం చేయాలనుకునే వారికి వందే భారత్ ఎక్స్ప్రెస్ మంచి ప్రయాణాన్ని అందిస్తుంది. 6 గంటల ప్రయాణాన్ని మూడు గంటల్లోనే మీకు పూర్తయ్యేలా చేస్తుంది. వైష్ణో దేవి యాత్రకు ఎవరైనా సరే కట్రా ప్రాంతాన్ని చేరుకోవాలి. అక్కడే భక్తులు తమను తాము నమోదు చేసుకుని స్లిప్ ను పొందుతారు. ఇది ఆ యాత్రకు తప్పనిసరిగా ఉండాల్సినది.

Also Read: మీరు ట్రైన్ లేదా కోచ్ మొత్తాన్ని బుక్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా చెయ్యండి

ఇక కట్రా నుండి యాత్రికులు వైష్ణో దేవి ఉన్న పవిత్ర గుహ ఆలయానికి చేరుకోవడానికి 13 కిలోమీటర్ల పాటు ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి శారీరక సామర్థ్యాన్ని ముందుగానే పెంచుకోవడం అవసరం. ఈ ట్రెక్కింగ్ ను కాలినడకన లేదా గుర్రాలపై లేదా పల్లకీలపై పూర్తి చేయొచ్చు. గుర్రాలు, పల్లకీలను వాడితే ఎక్కువ డబ్బును చెల్లించాల్సి వస్తుంది. అలాగే హెలికాఫ్టర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీనికి ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. కట్రా వసతి కోసం కూడా ముందస్తు బుకింగ్లు అవసరం. చివరి నిమిషంలో మీకు గదులు దొరకడం కష్టంగా మారుతుంది.

వైష్ణో దేవి ఆలయం నుంచి వెళ్లాలనుకునేవారు నిరాడంబరంగా గౌరవప్రదంగా ఉండే దుస్తులు ధరించాలి. ఎందుకంటే అది ఒక పవిత్రమైన ప్రార్థనా స్థలం. అలాగే ట్రెక్కింగ్ కు అనువైన సౌకర్యంతమైన చెప్పులు వేసుకోవడం కూడా ముఖ్యం. ఎందుకంటే ట్రెక్కింగ్ లో భూమి ఎగుడుదిగుడుగా ఉంటుంది. కాబట్టి హై హీల్స్ వంటి వాడకపోవడమే ఉత్తమం. ఇక ఒక బ్యాగులో నీటి బాటిల్స్, స్నాక్స్, ప్రధమ చికిత్స కు అవసరమైన వస్తువులు, రెయిన్ కోట్లు, జ్వరం జలుబు దగ్గు వంటి వాటి మందులు పెట్టుకోవడం ముఖ్యం. ఆ సమయంలో ఎక్కువగా నీరు తీసుకోవడం ఉత్తమం.

Related News

Kakori Train Action: కాకోరి రైల్వే యాక్షన్.. బ్రిటిషోళ్లను వణికించిన దోపిడీకి 100 ఏళ్లు!

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Raksha Bandhan 2025: వారం రోజుల పాటు రక్షాబంధన్ స్పెషల్ ట్రైన్స్.. హ్యపీగా వెళ్లొచ్చు!

Garib Rath Express: గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్ రైలు పేరు మారుతుందా? రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?

Safest Cities In India: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలు ఉన్నాయా?

Vande Bharat Express: ఆ మూడు రూట్లలో వందే భారత్ వస్తోంది.. ఎన్నేళ్లకో నెరవేరిన కల.. ఎక్కడంటే?

Big Stories

×