Viral Video: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్పెషల్ ఈవెంట్ చేశారు. పర్యావరణం, పచ్చదనం, పరిశుభ్రతలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అనుకున్నారు. ఏం చేద్దాం? ఎలా చేద్దాం? అని ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ భవనం చుట్టూ సైకిల్ తొక్కాలని డిసైడ్ అయ్యారు. అలా చేస్తే.. విధాన సభ ప్రాంగణంలో ఉన్న గ్రీనరీ, నీట్‌నెస్‌తో జనాల్లోకి మంచి మెసేజ్ వెళ్తుందని ప్లాన్ చేశారు. పర్యావరణ పరిరక్షణయే కాన్సెప్ట్ కాబట్టి.. కారులోనో, బైక్‌లోనో వెళ్లకుండా.. సైకిల్ తొక్కుతూ అసెంబ్లీ చుట్టూ ఓ రౌండ్ వేయాలని భావించారు. ఇదంతా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రోగ్రామ్. ముఖ్యమంత్రి ఏజ్ కాస్త ఎక్కువే ఉండటంతో.. డిప్యూటీ సీఎంకు ఆ సైకిల్ తొక్కే బాధ్యత అప్పగించింది సర్కారు. ఇంకేం.. అందుకు ఆయన సైతం ఓకే అన్నారు. టీ షర్ట్, ట్రాక్ పాయింట్ వేసుకుని.. మెడలో స్కార్ఫ్, కళ్లకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని.. రెడీ అయి వచ్చారు. ఉదయమే ప్రోగ్రామ్ షురూ అయింది. మీడియా కవరేజ్ కూడా భారీగా ఉంది. అయితే…
జోరుగా.. హుషారుగా..
మొదట సైకిల్ ఎక్కేందుకే డిప్యూటీ సీఎం కాస్త ఇబ్బంది పడ్డారు. ఆయన కాలు.. సైకిల్ సీట్ హైట్ వరకు లేవలేదు. రెండు మూడు సార్లు ట్రై చేశాక సైకిల్ ఎక్కగలిగారు. ఇక తొక్కడం స్టార్ట్ చేశారు. నెమ్మదిగా, జాలీగా అలా అలా విధాన సభ చుట్టూ.. పచ్చని చెట్లను ఎంజాయ్ చేస్తూ.. సైకిల్ రైడ్ చేశారు ఉప ముఖ్యమంత్రి. సెక్యూరిటీ సిబ్బంది ఆయన వెంట పరుగులు పెట్టారు. మీడియా కెమెరాలు ఆయన్నే ఫాలో అయ్యాయి. మిగతా నాయకులూ సైకిల్ తొక్కుతూ.. అసెంబ్లీ ప్రాంగణంలో పర్యటించారు. ఆ సైకిల్ రైడ్ భలే సరదాగా సాగింది. కానీ…
బ్యాలెన్స్ తప్పి.. మెట్లపై పడిపోయి..
అప్పటి వరకూ అంతా బాగానే ఉంది. డిప్యూటీ సీఎం సైకిల్ బానే తొక్కారు. అసెంబ్లీ మెట్ల వరకు మంచిగానే వచ్చారు. ఇక సైకిల్ దిగాల్సిన సమయం వచ్చేసింది. దిగుదామని కాలు పైకి తీస్తుంటే సైకిల్ సీటు అడ్డు తగులుతోంది. ఆ హైట్ వరకు ఆయన లెగ్ లేవట్లేదు. సైకిల్ ఎక్కేటప్పుడు కూడా అదే ప్రాబ్లమ్ అయింది. దిగేటప్పుడు మరింత ఇబ్బంది పడ్డారు. కాలు తీస్తుండగా సీటు తగిలింది. ఇంకో కాలు అదుపు తప్పింది. ఉన్నట్టుండి ముందుకు తూలి పడ్డారు. సరిగ్గా అసెంబ్లీ మెట్లపై కూలబడ్డారు. అంతలోనే తేరుకున్నారు. మెళ్లిగా లేచి నిలబడ్డారు.
Also Read : పిక్నిక్ స్పాట్‌లో పెద్ద పాము.. వీడియో వైరల్
మీడియాకు స్వీట్ వార్నింగ్
ఇంకేం ఆ దృశ్యాలు అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కిందపడ్డందుకు కాకుండా మీడియాకు దొరికిపోయాననే టెన్షన్ ఆయన్ను డిస్టర్బ్ చేసింది. ఈ విషయాన్ని ఎక్కువగా చూపిస్తే.. మిమ్మల్ని వదిలిపెట్టను అంటూ సరదాగా మీడియాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. అలాంటి వీడియో దొరికితే వదిలిపెడతారా? కర్నాటక మీడియాలో, సోషల్ మీడియాలో ఆ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. కొంచెం హైట్ తక్కువున్న సైకిల్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండకపోయేదంటూ నెటిజన్స్ అంటున్నారు.
ఒక్కడ మొక్కారో.. అక్కడే పడ్డారు..
ఇక్కడ మరో ఆసక్తికర విషయం కూడా ఉంది. గత ఏడాది డిప్యూటీ సీఎంగా ఆయన తొలిసారి విధాన సభలో అడుగుపెట్టే ముందు.. ఆ భవనం మెట్లకు మోకరిల్లి నమష్కరించారు. ఆ రోజున ఆయన ఏ మెట్లకు అయితే మొక్కారో.. ఇప్పుడు సరిగ్గా అదే మెట్ల మీద సైకిల్ మీద నుంచి బ్యాలెన్స్ తప్పి పడిపోవడం యాదృచ్ఛికం.
— 🇮🇳 BHARATIYA 🇮🇳 (@bharatiyakk) June 17, 2025