Sukumar : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది కొన్ని కాంబినేషన్స్ ను అనౌన్స్ చేస్తూ ఉంటారు. అయితే చివరి నిమిషంలో ఆ కాంబినేషన్ క్యాన్సిల్ అవుతాయి. ఇదేమీ కొత్త విషయం కాదు. ఎప్పటినుంచో ఇలాంటి పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పూరి జగన్నాథ్ విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి హీరోగా దాదాపు 5 సార్లు తన ప్రాజెక్ట్ ఆగిపోయింది. రెండుసార్లు పూజ కూడా అయింది. మెగాస్టార్ రీ ఎంట్రీ ఫిలిం పూరి జగన్నాథ్ చేస్తాడు అని ప్రముఖుల ముందు అనౌన్స్ చేశారు. అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో దానయ్య ప్రొడ్యూసర్ గా మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తాడు అని అధికారికంగా ప్రకటించారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఇలా ఉదాహరణలు చెప్పడానికి ఎన్నో ఉన్నాయి.
మహేష్ బాబు – సుకుమార్ తో సినిమా అందుకే ఆగిందా.?
సుకుమార్ దర్శకత్వంలో ఇదివరకే మహేష్ బాబు నటించిన సినిమా నేనొక్కడినే. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. సంక్రాంతి కనుక విడుదలని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. సినిమా మొదటి షో పడగానే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పటికీ కూడా ఆ సినిమాను చాలామంది కల్ట్ క్లాసిక్ అని చెబుతూ ఉంటారు. సుకుమార్ ఇంటిలిజెన్స్ ఏంటో ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. అయితే మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుంది అని అనౌన్స్ చేశారు. కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఆ సినిమా పుష్పా అని చాలామంది అనుకుంటారు. ఒకటి రెండు సందర్భాల్లో అది కాదు అని కూడా సుకుమార్ చెప్పారు. అయితే పుష్ప సినిమా విడుదలైన తర్వాత అది ఖచ్చితంగా మహేష్ బాబు కి సెట్ అవదు అని చాలామందికి ఒక నమ్మకం వచ్చేసింది.
‘పుష్ప’లో మహేశ్‌బాబు నటించి ఉంటే ఇలా ఉండేదా ? (AI Video) #MaheshBabu𓃵 #aivideo #Tollywood #AlluArjun #Pushpa2 #BIGTVCinema @urstrulyMahesh @aryasukku @alluarjun pic.twitter.com/nhd38qABV7
— BIG TV Cinema (@BigtvCinema) June 17, 2025
ఏ ఐ వీడియోతో క్లారిటీ
ఇక రీసెంట్ టైమ్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంతగా ఉపయోగపడుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మన ఊహకు ఒక దృశ్య రూపాన్ని తీసుకొని వస్తుంది. అలానే ఈ మధ్యకాలంలో వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో చెప్పిన ఒక సీను రీ క్రియేట్ చేశారు. ఆ సీన్ బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ఒకవేళ పుష్ప సినిమాను మహేష్ బాబు చేసుంటే ఎలా ఉంటుందో అని ఏఐ ద్వారా ఒక వీడియో చేశారు. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ వీడియో చూసిన తర్వాత చాలామందికి ఈ సినిమా మహేష్ బాబుకి అసలు సెట్ అయి ఉండేది కాదు అని ఒక క్లారిటీ వచ్చింది.
Also Read: OTT Movie: మైండ్ చెదిరిపోయింది గురు, “దృశ్యం” సినిమాను మించి ట్విస్టులు