BigTV English

Viral Video : పిక్నిక్ స్పాట్‌లో పెద్ద పాము.. పర్యాటకులు ఫసక్

Viral Video : పిక్నిక్ స్పాట్‌లో పెద్ద పాము.. పర్యాటకులు ఫసక్

Viral Video : వర్షాకాలంలో వాటర్ ఫాల్స్ భలే అందంగా ఉంటాయి. నీటితో కళకళలాడుతుంటాయి. పైనుంచి నీళ్లు.. కింద కొలను. మధ్యలో మనం. ఆ ఎంజాయే వేరబ్బా. అలాంటి టూరిస్ట్ ప్లేసెస్‌లో ఒకటి కెంప్టీ జలపాతం. ఉత్తరాఖండ్, ముస్సోరీలో ఉంటుంది. చుట్టూ పచ్చని కొండలు. మధ్యలో 40 అడుగుల ఎత్తు నుంచి పారే జలపాతం. అక్కడే సహజ సిద్ధంగా ఏర్పడిన కొలను. అంతకంటే అట్రాక్టివ్ ప్లేస్ ఇంకేం కావాలి. లిరిల్, సింతాల్ సోప్ యాడ్‌లో కనిపించేలాంటి దృశ్యం. అందుకే, వానలు మొదలవగానే పోలో మంటూ ముస్సోరీకి పరిగెడుతుంటారు పర్యాటకులు. అలా టూరిస్టులతో బిజీగా ఉంది కెంప్టీ వాటర్‌ఫాల్. ఆ కొలనులో పదుల సంఖ్యలో జనాలు సందడి చేస్తున్నారు. నీళ్లల్లో జలకాలాడుతున్నారు. అంతా ఎవరి ఎంజాయ్‌మెంట్‌లో వాళ్లు మునిగిపోయి ఉన్నారు. అంతలోనే.. కొలనులో కలకలం చెలరేగింది. అనుకోని సీన్ చూశారు అక్కడి వారంతా. దెబ్బకు హడలిపోయారు. అక్కడ ఏం జరిగిందంటే…


పామును చూసి బెదిరి.. పామునే భయపెట్టి..

రాళ్లు, రప్పలు, పొదల చాటునుంచి మెళ్లిగా నీళ్ల వైపు వచ్చింది ఓ కింగ్ కోబ్రా. తెలుసుగా.. పాముల్లోకెళ్లా డేంజరస్ స్నేక్. నల్లగా ఉంటుంది.. చురుకుగా కదులుతుంది.. అది కాటేస్తే బతుకుడు కష్టమే. అలాంటి ఖతర్నాక్ పాము కొలను ఒడ్డున ఉండటం చూశాడు ఓ పర్యాటకుడు. దెబ్బకు బెదిరిపోయాడు. పాము నీళ్లలోకి రాకుండా దాన్ని భయపెడదామని చూశాడు. దోసిళ్లతో నీళ్లు తీసుకుని ఆ పామును చెదరగొట్టే ప్రయత్నం చేశాడు. ఆ టూరిస్ట్ అనుకున్నట్టే కింగ్ కోబ్రా భయపడింది. ఆ భయంలో బయటకు కాకుండా.. నీళ్లలోకి దూసుకొచ్చింది. అంతే.. క్షణాల్లో అక్కడ సీన్ అంతా మారిపోయింది.


పాము పక్కనుంచి పోతుంటే..

పాము..పాము.. అంటూ కేకలు, అరుపులు. ఆ సౌండ్‌కు కోబ్రా చాలా కంగారు పడింది. మరింత వేగంగా నీళ్లలోకి.. నీళ్లలో ఉన్న జనాల్లోకి.. స్పీడ్‌గా కదిలివచ్చేసింది. వాటర్‌లో ఉన్న పబ్లిక్ అంతా ఒడ్డుకు వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, అంతా గుంపులు గుంపులుగా ఉండటంతో కదల్లేక పోయారు. ఒకరినొకరు తోసుకున్నారు. అంతలోనే పాము జనం మధ్యలో వరకూ ఈదుకుంటూ మెరుపు వేగంతో వచ్చేసింది. తమ పక్కనుంచే పాము వెళుతుంటే గుండె ఆగినంత పనైంది కొందరికి. జనాల కంటే స్పీడ్‌గా.. జనం మధ్యలోంచి.. నీళ్లలో ఊదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరింది కింగ్ కోబ్రా. పాము అటునుంచి ఇటు వెళ్లే లోపు.. ఏ ఇద్దరో ముగ్గురో మాత్రమే నీళ్లలోంచి ఒడ్డుకు చేరగలిగారంతే. స్నేక్ వారిని ఏం చేయలేదు కాబట్టి సరిపోయింది.. అదే ఆ పాము కాటేయడం స్టార్ట్ చేసి ఉంటే.. అప్పటికే కొలనులో ఉన్న 100 మందినైనా లెక్క తక్కువ కాకుండా ఈజీగా కాటు వేసి వెళ్లిపోయేదు. అంత వేగంగా, చురుకుగా కదిలిపోయింది. అందుకే దానిని కింగ్ కోబ్రా అంటారేమో అనిపించింది ఆ వీడియో చూస్తుంటే. సోషల్ మీడియాలో పెడితే తెగ వైరల్ అవుతోంది. ఆ టూరిస్టులు ఎలా భయపడ్డారో మీరూ ఓ లుక్ వేసేయండి…

?utm_source=ig_embed

Related News

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Big Stories

×