Actress Anupama: ప్రేమమ్ అనే మలయాళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం తెలుగులో అ, ఆ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇక్కడ కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా తెలుగు, తమిళ, మలయాళ భాషలలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అనుపమ పరమేశ్వరన్ సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఈమె హీరో నిఖిల్ సరసన నటించిన కార్తికేయ 2(Karthikeya 2) సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరింత గుర్తింపు సంపాదించుకున్నారు.
ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా అనుపమ పరమేశ్వరన్ ఇటీవల తన సినిమా వేడుకలో తన గురించి వస్తున్నటువంటి విమర్శలపై ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అనుపమ నటించిన జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ (JSK) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమా వేడుకలో భాగంగా అనుపమ మాట్లాడుతూ… మలయాళ చిత్ర పరిశ్రమలో చాలామంది తన నటనపై ఎన్నో విమర్శలు చేశారని , సోషల్ మీడియా వేదికగా కూడా ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నానని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.
నటనపై విమర్శలు…
ఈ విధంగా అనుపమ పరమేశ్వరన్ ఈ కార్యక్రమంలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి, నటుడు సురేష్ గోపి(Suresh Gopi) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అనుపమ పరమేశ్వరన్ చేసిన ఈ వ్యాఖ్యలు తన మనసు నుంచి వచ్చినవని ఆమె ఎంతో బాధపడితేనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలిపారు. అయితే మలయాళ చిత్ర పరిశ్రమలో ఇలాంటివి కొత్త కాదని గతంలో ఎంతో మంది హీరోయిన్లు కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఈయన తన మద్దతును అనుపమకు తెలియజేశారు. ఒకానొక సమయంలో మలయాళ చిత్ర పరిశ్రమలో సిమ్రాన్ (Simran) నటన గురించి ఎన్నో విమర్శలు చేశారు. దీంతో ఆమె ఇండస్ట్రీకి దూరం కాగా ఎంతో మంది దర్శకులు తిరిగి ఆమెను వ్యక్తిగతంగా కలిసి సినిమా అవకాశాలు కల్పించిన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు.
కర్మ సిద్ధాంతం…
సిమ్రాన్ మాత్రమే కాకుండా ఆసిన్, నయనతార వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఈ విధమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారని తెలిపారు. ఇలా వారిని కించపరుస్తూ తిరిగి వారికి సినిమా అవకాశాలు కల్పించారని అనుపమ విషయంలో కూడా ఇదే జరుగుతుందని దీనినే కర్మ సిద్ధాంతం అంటారని ఈయన తెలియజేశారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ప్రవీణ్ నారాయణ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి ప్రధాన పాత్రలలో నటించగా దివ్య పిల్లై, శృతి రామచంద్రన్ వంటి వారు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇలా అనుపమ గురించి సురేష్ గోపి మాట్లాడుతూ తన పూర్తి మద్దతును తెలియజేయడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.
Also Read: Nagarjuna: ఆ విషయంలో నాగార్జునకు ఏ హీరో సాటిరారుగా…నిజంగా కింగే మరీ?