మన దేశంలో చాలా మంది పానీ పూరీని ఎంతో ఇష్టపడుతారు. కుర్రాళ్ల నుంచి పెద్ద వయసు వారి వరకు పానీ పూరీ అంటే పడి చచ్చిపోయే వాళ్లు ఉన్నారు. ఎంత చెత్త ప్రదేశంలో ఉన్నా ఎగబడి తింటారు. అయితే, గుజరాత్ లోని వడోదరలో ఓ యువతి పానీ పూరీ కోసం చేసిన రచ్చ ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె వీడియోలే దర్శనం ఇస్తున్నాయి. ఇంతకీ ఆమె చేసిన ఘనకార్యం ఏంటంటే..
వడోదరలో ఓ యువతి పానీ పూరీ బండి దగ్గరికి వెళ్లి రూ. 20 పానీ పూరీ ఇవ్వాలని అడిగింది. సాధారణంగా రూ. 20కి 6 పానీ పూరీలు ఇస్తారు. అయితే, సదరు మహిళకు కేవలం 4 పానీ పూరీలే ఇచ్చారట. 6కు బదులుగా 4 ఇవ్వడం ఏంటని లొల్లి మొదలు పెట్టింది. మరో 2 ఇవ్వాలని డిమాండ్ చేసింది. అందుకు పానీపూరీ బండి వ్యక్తి నో చెప్పాడు. ఒక్కసారిగా కోపంతో అరిచింది. చేతిలోని ప్లేట్ అక్కడే పడేసి వెళ్లి నేరుగా రోడ్డు మధ్యలో కూర్చోని ఆందోళన మొదలు పెట్టింది. వడోదర సాగర్ సరస్సు సమీపంలోని ఆమె ఈ ఆందోళన కొనసాగించింది. తనకు రావాల్సి 2 పానీ పూరీలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసింది. రోడ్డు మీద వెళ్లే వాళ్లు ఆమె ఆందోళన వీడియోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
वडोदरा अजीबोगरीब घटना सामने आई
महिला को सिर्फ 2 पानीपुरी सड़क पर धरना देकर किया विरोधप्रदर्शन
पानीपुरी वाले ने 20 रुपएमें 6 पूरी की जगह इस महिलाको सिर्फ 4 पूरी खिलाई
महिला नाराज़ हो गई दो और पूरी खाने की जिद्द में सड़क पर धरना देने बैठ गई
जिसके चलते सड़क पूरी तरह जाम हो गई pic.twitter.com/GHQHKSKpHo
— Gautam Shrimali (NEWS 18 GUJARATI) (@Gautamshrimali9) September 19, 2025
Read Also: వామ్మో.. చింపాంజీలు ఇంత తాగుబోతులా? ఇన్నాళ్లూ ఈ విషయం తెలియదే!
సదరు యువతి ఆందోళనతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు అన్ని రోడ్డు మీదే నిలిచిపోయాయి. వెంటనే విషయం తెలుసుకుని పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. ఆమెను రోడ్డు మీది నుంచి పక్కకు వెళ్లాలని చెప్పడంతో బోరున విలపించింది. తన రెండు పానీపూరీలు ఇప్పించాలని, లేదంటే అక్కడి నుంచి పానీ పూరీ స్టాల్ ను తొలగించాలని డిమాండ్ చేసింది. “నేను పానీ పూరీ తినడానికి ఎప్పుడూ ఆ పానీ పూరీ బండి దగ్గరికే వెళ్తాను. ఇటీవల అతడు 6 ఇచ్చాడు. కానీ, ఇవాళ రూ. 20కి కేవలం 4 పానీ పూరీలు ఇచ్చాడు. మరో 2 ఇవ్వాలని అడిగితే, తనపై దాదాగిరి చేశాడు. అన్యాయంగా పానీ పూరీ అమ్ముతున్న అతడి స్టాల్ ను తొలగించాలని అధికారులను కోరుతున్నా” అంటూ కంటతడి పెట్టుకుంది. పోలీసులు ఆమెను రోడ్డు మీది నుంచి పక్కకు తీసుకెళ్లి, ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఇంతకీ ఆమెకు మిగతా 2 పానీ పూరీలు ఇప్పించారా? లేదా? అనేది తెలియదు. ఈ వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
Read Also: వానల్లో జనాలకు సాయం.. స్విగ్గి, జొమాటో డెలివరీ బాయ్స్ పై హైదరాబాదీలు ప్రశంసలు!