Smriti Mandhana : మహిళల క్రికెట్ లో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో రికార్డుల మోత మ్రోగుతోంది. ఏకంగా పురుషుల క్రికెట్ రికార్డులను కూడా మహిళలు బ్రేక్ చేయడం విశేషం. భారత స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. ముఖ్యంగా ఆమె 125 పరుగులతో చెలరేగారు. వన్డేల్లో భారత్ తరపున (మెన్స్ అండ్ ఉమెన్స్) ఫాస్టెస్ట్ సెంచరీని 50 బంతుల్లోనే చేయడం విశేషం. ఈ తరుణంలో టీమిండియా కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ 12 ఏళ్ల రికార్డు కూడా మంధాన బద్దలు కొట్టారు. 2013లో విరాట్ కోహ్లీ సైతం ఆస్ట్రేలియా పైనే మెన్స్ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ 52 బంతుల్లో చేశారు. వీరిద్దరి జెర్సీ నెంబర్లు (18), ఐపీఎల్ టీమ్ ఒక్కటే కావడం విశేషం.
Also Read : Ind vs Pak : సూపర్ 4కు ముందు పాకిస్థాన్ కు మరో షాక్ ఇచ్చిన ఐసీసీ..ఇక చుక్కలు చూడాల్సిందే
భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధాన సంచలనం సృష్టించారు. ఆస్ట్రేలియా పై జరిగిన మూడో వన్డేలో ఆమె వేగవంతమైన సెంచరీ సాధించి కొత్త రికార్డు సృష్టించారు. సెప్టెంబర్ 20, 2025న జరిగిన ఈ మ్యాచ్ లో మంధాన కేవలం 50 బంతుల్లోనే సెంచరీని విజయవంతంగా పూర్తి చేసి భారత క్రికెటర్లలో అత్యంత వేగవంతమైన వన్డే సెంచరీ చేసిన రికార్డును తన పేరిట లిఖించుకుంది. భారత క్రికెటర్లలోనే అత్యంత వేగవంతమైన వన్డే సెంచరీ రికార్డును నెలకొల్పారు. మంధాన తన సెంచరీని భారీ సిక్సర్ తో పూర్తి చేశారు. ఈ సిక్సర్ తో ఆమె గత పదేళ్లుగా విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. కోహ్లీ 2012-13లో జైపూర్ వేదికగా ఆస్ట్రేలియా పై 52 బంతుల్లోనే సెంచరీ సాధించి ఈ రికార్డును నెలకొల్పాడు.
Also Read : Ind vs aus : కొత్త జెర్సీలో టీమిండియా..రెచ్చిపోయిన ఆసీస్.. తొలిసారిగా 400పైగా స్కోర్
స్మృతి మంధాన విరాట్ కోహ్లీ రికార్డు ను 2 బంతుల తేడాతో అధిగమించారు. మహిళల క్రికెట్ లో ఇదివరకే అత్యంత వేగవంతమైన సెంచరీ కూడా స్మృతి మంధాన పేరిటే ఉండింది. అయితే ఇప్పుడు 20 బంతుల తేడాతో దానిని కూడా అధిగమించింది స్మృతి. ఇక ముల్లాన్ పూర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో కూడా ఈమె సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 47.5 ఓవర్లలో 412 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 47 ఓవర్లలో 369 పరుగులు చేసి ఆలౌట్ అయింది. స్మృతి మంధాన 125 తో పాటు హర్మన్ ప్రీత్ కౌర్ 52, దీప్తి శర్మ 72 పోరాడినప్పటికీ టీమిండియా 413 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. స్మృతి మంధాన రికార్డులు సృష్టించినప్పటికీ మ్యాచ్ ఓటమి పాలవ్వడంతో మూడు వన్డేల సిరీస్ ని 2-1 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. దీంతో టీమిండియా అభిమానుల్లో కాస్త నిరాశ ఎదురైంది.