E-Paper
Advertisement

Viral video: బాబూ! అది స్లీపర్ బెర్త్ కాదు, మెట్రో రైల్- మరీ అలా పడుకుంటే ఎలా?

Viral video: బాబూ! అది స్లీపర్ బెర్త్ కాదు, మెట్రో రైల్- మరీ అలా పడుకుంటే ఎలా?
Advertisement

Delhi Metro Viral Video: సాధారణ రైళ్లలో ప్రయాణీకులు పడుకున్నా, నిల్చున్నా,  కూర్చున్నా పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ, మెట్రో రైళ్లలో పడుకుంటే? తోటి ప్రయాణీకులకు ఇబ్బందిగా ఉంటుంది. తాజాగా ఢిల్లీ మెట్రోలో ఇలాంటి ఘటన జరిగింది. ప్రయాణీకులతో కిక్కిరిసిన సమయంలో ఓ వ్యక్తి మెట్రో రైల్ ప్లోర్ మీద పడుకోవడమే కాదు, ఏకంగా మోబైల్ చూస్తూ ఎంజాయ్ చేశారు. ప్రయాణీకులు అతడి పట్టించుకోకుండా తమ ప్రయాణాన్ని కొనసాగించారు.  ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

‘ఢిల్లీ మేరే జాన్’ ఇన్ స్టా అకౌంట్ ద్వారా వీడియో షేర్

Advertisement

ఢిల్లీ మెట్రోకు సంబంధించిన ఈ వీడియోను తాజాగా ‘ఢిల్లీ మేరీ జాన్’ అనే ఇన్ స్టా గ్రామ్  హ్యాండిల్ నుంచి షేర్ అయ్యింది. ఈ వీడియోకు “చాలా కష్టపడి పనిచేసిన తర్వాత.. ఢిల్లీ మెట్రోలో సేద తీరుతున్నాడు” అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ ఘటన ఎప్పుడు జరిగింది? అనే విషయం కచ్చితంగా తెలియకపోయినా, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఢిల్లీ మెట్రోలో ఇలాంటి ఘనటనలు కామన్ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కొంత మంది మాత్రం ఇలాంటి ఘటనలను సీరియస్ గా తీసుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు.

నెటిజన్లు ఏం అంటున్నారంటే?

Advertisement

ఈ వీడియోకు సోషల్ మీడియాలో బోలెడు కామెంట్స్ వస్తున్నాయి. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. “అతడు తీసుకుంది మెట్రో టికెట్, ఫస్ట్ టైర్ టికెట్ కాదని ఎవరైనా చెప్పండి” అంటూ ఓ వ్యక్తి సరదాగా కామెంట్ చేశాడు. “ఇలాంటి ఘటనలు ఢిల్లీ మెట్రోలో చాలా కామన్. ఇలాంటి ఘటనలను మెట్రో అధికారులు పెద్దగా పట్టించుకోరు. వారిపై ఎలాంటి చర్య తీసుకోరు. అందుకే ఇలాంటి ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి” అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశారు. “ఇలాంటి చూసి పెద్దగా షాక్ కావాల్సిన అవసరం లేదు. ఇది మెట్రోలో రోజూ జరిగే తంతే” అని మరో వ్యక్తి రాసుకొచ్చారు. “సాయంత్రం వరకు కష్టపడి అలసిపోయినట్టు ఉన్నాడు. అందుకే మెట్రోలో కాస్త రిలాక్స్ అవుతున్నాడు” అంటూ ఇంకో వ్యక్తి అభిప్రాయపడ్డాడు. “ఓ వ్యక్తి అక్కడ పడుకుని ఉన్నా, ఎవరూ పట్టించుకోనట్లుగా అతడిని తన్నుకుంటూ వెళ్తున్నారు. నిజంగా దారుణం” అంటూ మరో వ్యక్తి కోప్పడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో బాగా వైరల్ కావడంతో అధికారులు ఇకపై ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also: రైల్వే ట్రాక్‌పై సెల్ఫీ.. వేగంగా దూసుకొచ్చిన రైలు, రెప్పపాటులో ఎగిరిపడ్డ యువకుడు

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Delhi meri Jaan! (@delhi.connection)

Read Also: పో*ర్న్ మూవీలో ఆఫర్.. సంతోషం తట్టుకోలేక తల్లికి చెప్పేసిన కొడుకు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×