BigTV English
Advertisement

Viral video: రైల్వే ట్రాక్‌పై సెల్ఫీ.. వేగంగా దూసుకొచ్చిన రైలు, రెప్పపాటులో ఎగిరిపడ్డ యువకుడు

Viral video: రైల్వే ట్రాక్‌పై సెల్ఫీ.. వేగంగా దూసుకొచ్చిన రైలు, రెప్పపాటులో ఎగిరిపడ్డ యువకుడు

ఈ మధ్య యువతలో సెల్ఫీలు, రీల్స్ పిచ్చి మరింత ముదిరింది. చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. అయినా సెల్ఫీలు, రీల్స్ కు దూరంగా ఉండటం లేదు. ఇంకా చెప్పాలంటే సెల్ఫీలు, రీల్స్ ను వ్యసనంగా మార్చుకుంటున్నారు. చివరకు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా బంగ్లాదేశ్ లో జరిగింది. ఓ కుర్రాడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


రైలు ఢీకొట్టడంతో ఎగిరిపడ్డ యువకుడు

బంగ్లాదేశ్ లో కొంత మంది కుర్రాళ్లు రైల్వే ట్రాక్ మీదికి వెళ్లారు. అదే సమయంలో అటుగా రైలు వచ్చింది. గబగబా కొంత మంది ట్రాక్ నుంచి బయటకు వచ్చారు. ఇద్దరు కుర్రాళ్లు మాత్రం వేగంగా వస్తున్న రైలు ముందు నిల్చొని సెల్పీ తీసుకోవాలి అనుకున్నారు. ఓ కుర్రాడు పట్టాలకు కాస్త దగ్గరగా ఉండటంతో కుర్రాడి తలకు రైలు బలంగా తగిలింది. వెంటనే ఆ పిల్లాడు ఎగిరిపడ్డాడు. రైలు తగిలిన స్పీడ్ కు కుర్రాడు కచ్చితంగా చనిపోయాడని అందరూ అనుకుంటారు. కానీ, తలకు బలమైన గాయాలు తగిలి ప్రాణాలతో బయటపడ్డాడు.


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

ఈ వీడియోను ‘iSoumikSaheb’ హ్యాండిల్ ద్వారా Xలో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోకు “సెల్ఫీ తీసుకుంటుండగా రంగ్‌ పూర్స్ సింగిమారా బ్రిగ్జి మీద ఈ ప్రమాదం జరిగింది. రైలు వచ్చే సమయంలో పిల్లలు కాస్త అప్రమత్తంగా ఉండాలి” అంటూ క్యాప్షన్ లో రాసుకొచ్చారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియో సుమారు 8 లక్షల మంది వ్యూస్ సంపాదించుకుంది. ఆ వీడియోకు అప్ డేట్ గా మరో పోస్టు పెట్టారు. “అప్ డేట్: అతడు బతికిపోయాడు” అంటూ ఆ కుర్రాడు హాస్పిటల్లో ఉన్న ఫోటోలను షేర్ చేశారు.

నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు

ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ప్రజలకు సెల్ఫీల పిచ్చి ఎలా ఉంది? అనడానికి ప్రత్యక్ష ఉదాహారణ ఈ ఘటన” అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “దయచేసి ఇలాంటి పనులు చేయకండి. సేఫ్ గా ఉండేందుకు ప్రయత్నించండి” అని ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు. “ఇలాంటి వాటిని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. “ఇలాంటి పిచ్చి పనులు చేసేవారికి అలా జరగాల్సిందే” అని ఇంకొకరు కామెంట్ చేశారు. “టిక్ టాక్ ట్రెండ్ చాలా మంది ప్రాణాలు తీస్తున్నది. యువత దయచేసి ఊరికే ప్రాణాలు తీసుకోకూడదు” అంటూ ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు. మొత్తంగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఆ పిల్లాడు ప్రాణాలతో బయటపడటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: విమానాల్లో కొబ్బరి కాయలు తీసుకెళ్లకూడదు.. ఎందుకో తెలుసా?

Related News

Viral Video: ఆఫీసులో తింగరి వేషాలేంటి? హీటెక్కిపోయిన బ్యాంక్ మేనేజర్, ఆ తర్వాత ఏం జరిగిందంటే

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Big Stories

×