BigTV English

Telugu Industry Directors : అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లే ఇప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్లు

Telugu Industry Directors : అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లే ఇప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్లు

Telugu Industry Directors: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దర్శకులుగా తమ ప్రతిభను నిరూపించుకోవడానికి చాలామంది అడుగులు వేస్తూ ఉంటారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలు చేస్తూ ఒక మంచి కథను సిద్ధం చేసుకుని దర్శకులుగా కూడా తమ ప్రయాణాన్ని మొదలుపెడతారు. అయితే అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్లు అవుతారని చెప్పలేము. లేకపోతే చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు హీరోలు అయిన సందర్భాలు ఉన్నాయి. అలానే చాలామంది యాక్టర్లు దర్శకులైన సందర్భాలు కూడా ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టిన నాని, కార్తీ వంటి వాళ్లు నేడు సక్సెస్ఫుల్ హీరోస్ అయ్యారు. హీరో గానే కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత కొన్ని కొన్ని పాత్రలలో కనిపించిన వెంకీ అట్లూరి (Venky Atluri) నేడు దర్శకుడుగా మంచి పేరును సంపాదించుకున్నాడు.


Also Read: Dil Raju about Naga Vamshi: ఒకప్పటి నన్ను నేను, నాగవంశీ లో వెతుక్కుంటున్నా

వెంకీ అట్లూరి మొదట హీరోగా ఒక సినిమాను చేశాడు. ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తర్వాత స్నేహగీతం సినిమాలో ఒక కీలకపాత్రలో కనిపించాడు. ఆ సినిమాలో నటనతో పాటు తనలో ఉన్న రచయితను కూడా బయటకు తీశాడు. నటుడు కంటే కూడా రచయితకు ఎక్కువ పేరు ఆ సినిమా నుంచి వచ్చింది. ఆ తర్వాత దర్శకుడుగా సినిమా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఒక సందర్భంలో దిల్ రాజు కూడా వెంకీ అట్లూరిని దర్శకుడుగా పరిచయం చేసే ప్రయత్నం చేశాడు. కానీ అది ఎందుకో కుదరలేదు. మొత్తానికి వరుణ్ తేజ్(Varun Tej) నటించిన తొలిప్రేమ (Tholi Prema) సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు వెంకీ అట్లూరి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించింది.


Also Read : RRR Movie: బాహుబలి తర్వాత అలాంటి ఘనత ఆర్.ఆర్.ఆర్ కే.. గ్రేట్ భయ్యా..!

ఇక రీసెంట్ గా లక్కీ భాస్కర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు వెంకీ. ఈ సినిమా మొదటి షో పడినప్పుడు నుంచే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ నేడు జరిగింది. ఈ సక్సెస్ మీట్ కి దర్శకులు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి హాజరయ్యారు. వెంకీ అట్లూరి నటుడిగా ఉన్నప్పుడు చంద్రశేఖర్ ఏలేటి సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్ అయిన హను రాఘవపూడి కి ఆడిషన్ ఇచ్చారు. అలానే శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నాగ్ అశ్విన్ కి కూడా ఒక ఆడిషన్ ఇచ్చాడు వెంకీ అట్లూరి. ఈ ఇద్దరి దర్శకులు దుల్కర్ సల్మాన్ తో సినిమా చేసి హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు వెంకీ అట్లూరి కూడా దుల్కర్ తో సినిమా చేసి మంచి హిట్ అందుకున్నాడు. ఈ ముగ్గురు కూడా ఒకే స్టేజ్ పంచుకోవడం అనేది గ్రేట్ థింగ్.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×