E-Paper
Advertisement

Longest-Married Couple: వీరి దాంపత్యానికి 83 ఏళ్లు.. ఏకంగా గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కేసిన వృద్ధ జంట!

Longest-Married Couple:  వీరి దాంపత్యానికి 83 ఏళ్లు.. ఏకంగా గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కేసిన వృద్ధ జంట!

మారుతున్న వాతావరణ పరిస్థితులు, బలవర్థకం కాని ఆహారపు అలవాట్ల కారణంగా తక్కువ వయసులోనే చాలా మంది చనిపోతున్నారు. ఇండియాలో మనుషుల ఆయుష్షు రోజు రోజుకు తగ్గిపోతోంది. అయితే, విచిత్రంగా మయామిలోని ఒక జంట ఇటీవల ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం వివాహ జీవితాన్ని గడిపిన దాంపత్యంగా గుర్తింపు తెచ్చుకుంది. 107 ఏళ్ల ఎలియనోర్, 108 ఏళ్ల లైల్ గిట్టెన్స్ తమ 83 ఏళ్ల వివాహ దినోత్సవం జరుపుకున్నారు. తాము ఇంత కాలం సంతోషంగా జీవించడానికి కారణంగా ఒకరినొకరు ప్రేమగా ఉండటమేనని చెప్పుకొచ్చారు.

లాంగెవిక్వెస్ట్ వెబ్‌సైట్ ఏం చెప్పిందంటే?

100 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల రికార్డులను భద్రపరిచే లాంగెవిక్వెస్ట్ వెబ్‌సైట్.. ఈ జంట వైవాహిక జీవితం గురించి కీలక వివరాలు వెల్లడించింది. 1942లో తీసుకున్న వివాహ ధృవీకరణ పత్రం, అమెరికా జనాభా లెక్కల రికార్డులు, ఇతర డాక్యుమెంట్స్ ఆధారంగా వారు చెప్పింది నిజమేనని ధృవీకరించింది. బ్రెజిల్‌కు చెందిన మనోయెల్ ఏంజెలిమ్ డినో (106), అతడి భార్య మరియా డి సౌసా డినో (102) మరణించిన తర్వాత గిట్టెన్సెస్ దంపతులు ఈ గుర్తింపు తెచ్చుకున్నారు. వీళ్లు 85 సంవత్సరాల వివాహ మహోత్సవం తర్వాత ప్రపంచంలోనే ఎక్కువ కాలం వైవాహిక జీవితం గడిపిన జంటగా గుర్తింపు తెచ్చుకోకున్నారు.

కాలేజీ రోజుల నుంచే ప్రేమాయణం

ఎలియనోర్,  లైల్ మొదటిసారి 1941లో కాలేజీ బాస్కెట్‌ బాల్  ఈవెంట్ సందర్భంగా కలిశారు. లైల్ క్లార్క్ అట్లాంటా యూనివర్సిటీ తరపును ఆడగా, ఎలియనోర్ ఆటను చూసేందుకు వెళ్లారు. లైల్ జార్జియాలో సైనిక శిక్షణ నుంచి సెలవు తీసుకుని జూన్ 4, 1942న ఆమెను పెళ్లి చేసుకున్నారు.  కొద్ది రోజుల్లోనే ప్రపంచ యుద్ధం మొదలయ్యింది. లైల్ US ఆర్మీ  92వ పదాతిదళ విభాగంలో ఇటలీలో పని చేశారు.  ఆ సమయంలో ఎలియనోర్ గర్భవతిగా ఉంది. న్యూయార్క్ లో ఉన్న లైల్ కుటుంబం దగ్గరే ఉంది.

Read Also: బంగారు గుడ్డును మింగేసిన దొంగ.. ‘వెనుక’ నుంచే రికవర్ చేస్తారట, పాపం పోలీసులు!

న్యూయార్క్ లో స్థిర నివాసం

యుద్ధం తర్వాత, గిట్టెన్స్ దంపతులు న్యూయార్క్‌ లో స్థిరపడ్డారు. కలిసి సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.  ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. ఎలియనోర్‌కు ఇష్టమైన ప్రదేశమైన గ్వాడెలోప్‌ తరచుగా వెళ్లేవారు.  ఎలియనోర్ 69 సంవత్సరాల వయసులో ఫోర్డ్‌ హామ్ విశ్వవిద్యాలయం నుండి అర్బన్ ఎడ్యుకేషన్ లో డాక్టరేట్ పొందారు. ఈ జంట తమ కుమార్తె ఏంజెలా దగ్గర ఉండటానికి మయామికి వెళ్లారు. ప్రస్తుతం ఆమె దగ్గరే ఉంటున్నారు. ఎలియనోర్‌ తో సమయం గడపడం తనకు ఇష్టమని, ఆమెతో ఉండటం ఇప్పటికీ సంతోషాన్ని ఇస్తుందని లైల్ చెప్పారు. ఒకరిపై మరొకరు ప్రేమగా ఉండటం వల్లే ఇంతకాలం హ్యాపీగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. సంతోషం, ప్రేమ అనేది మనిషి ఆరోగ్యంగా జీవించేలా చేస్తుందన్నారు.

Read Also:  ఒక్క కాకి చనిపోతే వంద కాకులు వాలతాయ్, అది ఐక్యత కాదు.. అసలు సీక్రెట్ ఇదే!

Related News

ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు.. కానీ డ్యూటీలో చేరే లోపే రిటైర్ అయిపోయాడు!

ఉపాధి కూలీలకు ‘గుండు’ గండం.. యాప్‌లో విచిత్ర సమస్య!

హైదరాబాద్ మెట్రోలో బరితెగించిన యువకుడు.. సీటుపై కాళ్లు పెట్టి రచ్చ రచ్చ!

వీధి కుక్కలను ఉపయోగించి విద్యుత్ తయారీ.. ఎక్కడో తెలుసా..!

ఇదెక్కడి విచిత్రం సామి! 20 ఏళ్ల తర్వాత వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం.. ట్విస్ట్ ఏంటంటే?

ఐటీ జాబ్‌కు గుడ్‌బై చెప్పి.. ఆటో నడుపుతున్న మహిళ.. నెల సంపాదన తెలిస్తే షాకే!

పక్షులు తమ గూట్లో పాముల కుబుసం ఎందుకు పెట్టుకుంటాయి? అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాకే!

వైరల్ వీడియో .. కేవలం రూ. 1600 ఖర్చుతో ఏసీ.. సామాన్యుడి టాలెంట్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు!

Big Stories

×