జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధర్మారావుపేటలో ఐదేళ్ల బాలుని మిస్సింగ్ ఘటనలో విషాదం నెలకొంది. రాకేష్‌ను ట్రాక్టర్‌పై తీసుకెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు టైరు కింద పడి మృతి చెందాడు. బాలుడు చనిపోయిన విషయం ఎవరూ గమనించక పోవడంతో మృతదేహాన్ని తీసుకెళ్లి సమీపంలోని సింగరేణి ఓసి- 3 డంపు యార్డ్‌లో పడేశాడు డ్రైవర్ గంపల శంకర్. కుటుంబ సభ్యుల అనుమానంతో శంకర్‌ను పోలీసులు విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. డంప్ యార్డ్‌లో కూరుకుపోయిన బాలుడి మృతదేహాన్ని జేసీబీ సాయంతో బయటకు తీశారు పోలీసులు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.