E-Paper
Advertisement

Viral Video: ఐ ఫోన్ బాక్స్.. లంచ్ బాక్స్ గా.. నువ్ మామూలోడివి కాదురా అయ్యా!

Viral Video: ఐ ఫోన్ బాక్స్.. లంచ్ బాక్స్ గా.. నువ్ మామూలోడివి కాదురా అయ్యా!
Advertisement

విద్యార్థులు చేసే అల్లరి పనులు కొన్నిసార్లు అందరినీ ఆశ్చర్యం కలిగిస్తాయి. తాజాగా ఓ విద్యార్థి చేసిన పనికి క్లాస్ టీచర్ కూడా ఇలాగే అవాక్కైంది. తోటి విద్యార్థులు మాత్రం క్రేజీగా ఫీలయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. సాధారణంగా విద్యార్థులు లంచ్ ఎలా తీసుకెళ్తారు? స్టీల్ బాక్స్ లేదంటే టప్పర్ వేర్ బాక్స్ లో తీసుకెళ్తారు. కానీ, ఓ విద్యార్థి ఖాళీ ఐఫోన్ బాక్స్ లో స్నాక్స్ ప్యాక్ చేసుకుని స్కూల్ కు తీసుకెళ్లాడు. దాన్ని చూసి టీచర్ షాక్ అయ్యింది.

ఐఫోన్ బాక్స్ లో పరోటాలు!

క్లాస్ లో అందరి నోట్స్ చెక్ చేస్తూ వెళ్తుంది. ఓ విద్యార్థి దగ్గర ఐఫోన్ బాక్స్ కనిపిస్తుంది. వెంటనే టీచర్ ఆ బాక్స్ ఎందుకు తెచ్చావు? లోపల ఏముంది? అని అడుగుంది. వెంటనే, ఆ విద్యార్థి లంచ్ బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాడు. అందులో రెండు పరోటాలు ప్యాక్ చేసి ఉంటాయి. “దీన్ని ఎవరు ప్యాక్ చేశారు? నీకు ఇది లంచ్ బాక్స్ లాగా కనిపిస్తుందా?” అని అడుగుతుంది. “నేనే చేశాను” టీచర్ అని చెప్తున్నాడు. వెంటనే క్లాస్ లోని పిల్లలు అంతా ఆ బాక్స్ చూసి నవ్వుతారు. ఈ తతంతం అంతా టీచర్ తన సెల్ ఫోన్ లో రికార్డు చేసి, సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫన్నీ క్లిప్ మీమ్స్, జోకులు క్రేజీగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆ విద్యార్థి సృజనాత్మకత, హాస్య భావనను ప్రశంసిస్తున్నారు.

ఇంతకీ నెటిజన్లు ఏమంటున్నారంటే?

Advertisement

ఈ వీడియో నెటిజన్లను ఫన్నీగా ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తుంది. చాలా మంది నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. కొంత మంది నవ్వించే కామెంట్స్ పెడితే, మరికొంత మంది క్రేజీ ఐడియాను అభినందిస్తున్నారు. “ప్రీమియం లంచ్ బాక్స్ అప్‌ గ్రేడ్” అంటూ ఇంకొంత మంది కామెంట్స్ పెడుతున్నారు.  “బ్రో తన క్లాస్ లోని అమ్మాయిలు అందరినీ పడేయాలనుకున్నాడు. అందుకే ప్రీమియం లంచ్ బాక్స్ తెచ్చాడు” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. “అమ్మకు తెలియకుండా కొడుకు చేసిన లంచ్ ప్యాక్ ఇది” అని మరొక యూజర్ రాసుకొచ్చాడు. “లంచ్ బాక్స్ అంటే ఇలా ఉండాలి. నిజంగా ఇలాంటి ఐడియా రావడం గ్రేట్ బ్రో” అని మరో ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు. మొత్తంగా సదరు విద్యార్థి తీసుకొచ్చిన లంచ్ బాక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వుల పువ్వులు పూయిస్తుంది. అందరూ క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు.

Read Also: టైమ్‌కు ఆఫీస్‌కు రావాలన్న బీహారీ బాస్.. దారుణంగా కొట్టించిన మరాఠీ మహిళ!

Advertisement

Read Also:  సీటుపై కాలు, చేతిపై ఉమ్మి.. ఇండియన్ ట్రైన్ జర్నీపై యూకే ట్రావెలర్ షాకింగ్ కామెంట్స్!

 

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×