BigTV English

Viral Video: కారు డ్రైవింగ్ చేస్తూ ముద్దులతో రెచ్చిపోయిన జంట, చివరికి..

Viral Video: కారు డ్రైవింగ్ చేస్తూ ముద్దులతో రెచ్చిపోయిన జంట, చివరికి..

తల్లిదండ్రులకు పట్టించుకునే తీరిక లేకపోవడం, అడిగినవన్నీ కొనివ్వడం, దండిగా పాకెట్ మనీ ఇవ్వడంతో యువత పెడదోవ పడుతున్నారు. కన్నూమిన్నూ ఎరుగకుండా ప్రవర్తిస్తున్నారు. నాలుగు గోడల మధ్య నచ్చినట్లు ఉండవచ్చు, ఫర్వాలేదు. కానీ, రోడ్డెక్కి వెర్రివేషాలు వేస్తే చూసేవారికి కోపం నషాలానికి ఎక్కుతుంది. తాజాగా ఓ అమ్మాయి, అబ్బాయి చేసిన చెత్తపని కూడా చూసేవారికి ఒళ్లు మండేలా చేసింది.


కారు డ్రైవింగ్ చేస్తూ రొమాన్స్.. వీడియో వైరల్..

తాజాగా కొంత మంది కలిసి కారులో ప్రయాణం చేస్తున్నారు. అందులో ఓ యువకుడు డ్రైవింగ్ చేస్తున్నాడు. కారు వేగంగా ముందుకెళ్తున్నది. ఓ యువతి ఆ యువకుడి మీదికి ఎక్కి ఎదురుగా కూర్చొని రొమాన్స్ మొదలు పెట్టింది. సదరు యువకుడు ఓవైపు కారును నడుపుతూనే, మరోవైపు అమ్మాయితో ముద్దు, ముచ్చట్లు సాగించాడు. ఈ తతంగాన్ని వెనుక సీట్లో ఉన్న మరో అమ్మాయి వీడియో తీసింది. ఇంకా చెప్పాలంటే, వాళ్లిద్దరు చేస్తున్న గొప్ప పనిని వీడియో తీయమని చెప్పి మరీ, రొమాన్స్ లో మునిగిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 24 గంటల్లో ఈ వీడియో రెండున్నర మిలియన్ల మంది చూశారు. అయితే, ఈ ఘటన నార్త్ లోనే జరిగినట్లు తెలుస్తున్నది. ఎక్కడ అనేది ఇంకా తెలియదు.


నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు

ఈ వీడియోను చూసి నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. వేలాది మంది నెటిజన్లు ఈ ఘటనపై తీవ్రంగా   మండిపడుతున్నారు. యువత రోజు రోజు మరింత దిగజారి పోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఏవైనా చేసుకోవాలి అనిపిస్తే, నాలుగు గోడల మధ్య చేసుకోవాలి. అంతేకానీ, నడిరోడ్డు మీద వెధవ పనులు చేయడం మంచిది కాదు. మీరు చచ్చినా ఫర్వాలేదు. ఎదుటి వారిని చంపకండి” అని ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “వీళ్లిద్దరికీ తమ కుటుంబం అంటే భయం లేదు. చట్టమంటే భయం లేదు. తోటి వారికి ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తున్న ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. “స్వేచ్ఛ పేరుతో బరితెగింపుకు పాల్పడుతున్నారు అని చెప్పడానికి ఈ ఘటన ఓ నిదర్శనం” అని మరో వ్యక్తి అభిప్రయాపడ్డాడు.

Read Also: భార్యకు 20 సంచుల చిల్లర ఇచ్చిన భర్త.. ఇదెక్కడి రివెంజ్ మామ!

అటు ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తున్నది. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వ్యహరించిన ఈ జంటపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో వారు ఎవరు? అనే విషయాన్ని తెలుసుకునే పనిలో ఉన్నారు. త్వరలోనే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. యువత హద్దులు మీరి ప్రవర్తించడం సరికాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాదని, తప్పుడు పనులు చేస్తే జైల్లో ఊచలు లెక్కించడంతో పాటు బంగారం లాంటి భవిష్యత్ నాశనం కాక తప్పదని హెచ్చరిస్తున్నారు.

Read Also: రెండుసార్లు పుట్టిన ఒకే బిడ్డ.. ఆధునిక వైద్యశాస్త్రంలో అద్భుతం!

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×