Sankranthi movies 2025:.. మిగతా సినీ ఇండస్ట్రీలతో పోల్చుకుంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంక్రాంతి అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు. ముఖ్యంగా పెద్ద పెద్ద స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇక ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా స్టార్ హీరోలు బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సంక్రాంతి వచ్చిందంటే సినిమా విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. చివరికి బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. ఒకవేళ హిట్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి. అందుకే చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతికి తమ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తారు.
పెద్ద సినిమాల ముందు భారీ టార్గెట్..
ఇకపోతే 2025 సంవత్సరానికి గానూ.. రామ్ చరణ్ (Ram Charan), గేమ్ ఛేంజర్ (Game Changer) మూవీతో సంక్రాంతి పండుగ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా వచ్చే యేడాది జనవరి 10వ తేదీన విడుదల కాబోతోంది. ఆ తర్వాత బాలకృష్ణ(Balakrishna ) డాకు మహారాజ్ (Daaku Maharaj) సినిమా జనవరి 12వ తేదీన విడుదల కాబోతోంది. వెంకటేష్ (Venkatesh) సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇకపోతే ఈ మూడు సినిమాలలో గేమ్ ఛేంజర్ రూ.300 కోట్లు షేర్ కలెక్షన్స్ వసూలు చేస్తే.. ఈ సినిమా హిట్ టాక్ అనిపించుకునే అవకాశం ఉంది. అలాగే ‘డాకు మహారాజ్’ సినిమా రూ.100 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతోంది. దీనికి తోడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కూడా దాదాపు రూ.60 కోట్ల టార్గెట్ తోనే బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. ఇకపోతే నైజాంలో థియేటర్ల విషయంలో ఏ సినిమాకు అన్యాయం జరగకుండా.. ఎఫ్డిసి చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dilraju)జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.
సంక్రాంతికి వస్తున్నాం బ్రేక్ ఈవెన్ గ్యారంటీనా..?
ఇక ఈ మూడు సినిమాల విషయానికి వస్తే.. ముందుగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు భారీ టార్గెట్ లేకపోవడం, అనిల్ రావిపూడి(Anil Ravipudi) సక్సెస్ ట్రాక్ లో ఉండడం అలాగే వెంకటేష్ కూడా తన క్యారెక్టర్ కు సరిపోయే కాన్సెప్ట్ ను ఎంచుకోవడంతో సినిమాపై పాజిటివ్ టాక్ లభిస్తోంది. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన పాటల నుంచి కూడా మంచి రెస్పాన్స్ లభిస్తూ ఉండడం గమనార్హం. అందుకే ఈ సినిమా సులువుగానే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయని, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లతోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొట్టే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపోతే ఈ సినిమా 2025 జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈ సినిమా ట్రైలర్ కోసం కూడా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అనిల్ రావిపూడి తన కథనంతో మ్యాజిక్ చేస్తాడని, ఈ డైరెక్టర్ ఖాతాలో ఎనిమిదో విజయం పక్కా అని కూడా అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
సంక్రాంతి రిజల్ట్ మొత్తం దిల్ రాజు కేనా..?
ఇదిలా ఉండగా దిల్ రాజు సంక్రాంతి సినిమాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే గేమ్ ఛేంజర్ , సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా.. డాకు మహారాజ్ నైజాం డిస్ట్రిబ్యూటర్ గా కూడా దిల్ రాజు పనిచేస్తున్నారు. ఇక ఈ మూడు సినిమాలకు హిట్ టాక్ వస్తే మాత్రం దిల్ రాజు దశ తిరుగుతుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈ సంక్రాంతికి దిల్ రాజు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరి 2025 సంక్రాంతి ఎవరికి అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతుందో చూడాలి.