ఈ రోజుల్లో అమ్మాయిల ఆలోచనలు చాలా కొత్తగా ఉంటున్నాయి. అదే సమయంలో అందరినీ ఆలోచించేలా ఉంటున్నాయి. తమ జీవితం మీద చాలా మంది అమ్మాయిలు ఫుల్ క్లారిటీతో ఉంటున్నారు. లక్షల రూపాయలు వచ్చే ప్రైవేట్ ఉద్యోగాల కంటే సెక్యూరిటీ ఉండే ప్రభుత్వ ఉద్యోగం చేసే అబ్బాయిలను పెళ్లి చేసుకోవడం బెస్ట్ అనుకుంటున్నారు. అనుకోవడమే కాదు, బహిరంగంగా తమ మనసులోమాట బయటపెడుతున్నారు. తాజాగా ఓ అమ్మాయి తనకు ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అబ్బాయి కావాలంటూ ఏకంగా పోస్టర్ పట్టుకుని రోడ్డు మీద కనిపించడం అందరినీ ఆకట్టుకుంది.
ప్రభుత్వ ఉద్యోగం ఉంటే చాలు, అబ్బాయి ఎలా ఉన్న ఫర్వాలేదు అంటున్నారు యువతులు. తాము చేసుకోబోయే అబ్బాయిలు కష్టపడి పని చేయడం కంటే, భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, తక్కువ జీతం ఉన్నా ఫర్వాలేదు కానీ, ఉద్యోగ భద్రత ఉండాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఎలాంటి టెన్షన్ ఉండదంటున్నారు. ఒక్కసారి ఉద్యోగం సంపాదిస్తే 60 ఏండ్ల వరకు ఏ చీకూ చింతా లేకుండా ఉండవచ్చు అనుకుంటున్నారు.
కాబోయే వాడికి సర్కారీ నౌకరీ ఉండాలట!
తాజాగా ఓ యువతి తనకు సర్కారు ఉద్యోగం ఉన్న అబ్బాయి భర్తగా రావాలంటూ ఏకంగా ఓ పోస్టర్ పట్టుకని పబ్లిక్ లోకి వెళ్లింది. ఆ అమ్మాయి పెళ్లి కూతురులా ముస్తాబై “సర్కారు నౌకరీ ఉన్న అబ్బాయి కోసం చూస్తున్నాను” అంటూ రాసి ఉన్న పోస్టర్ ను పట్టుకుని కనిపించింది. దాని కింద ‘సర్కారీ బచ్చా’ అంటూ హ్యాష్ ట్యాగ్ ఉంచింది. ఇక రోడ్డు మీద వెళ్లే యువకులను మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందా? అంటూ అడగడం మొదలు పెట్టింది. ప్రైవేట్ ఉద్యోగం ఉన్న అందమైన అబ్బాయిలను కూడా ఆమె రిజెక్ట్ చేస్తూ కనిపించింది. అయితే, ఓ నల్లటి అబ్బాయి తనకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని చెప్పడంతో తనను పెళ్లి చేసుకునేందుకు సదరు యువతి ఓకే చెప్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Job security is first priority for girls nowadays for getting married than hard working boys because if you have secured job then you will secure your maintenance and alimony by setting ideal and enjoy on your husband’s hard earned money#WomenEmpowerment #1CroreAlimony pic.twitter.com/S2ecaepr5G
— SIFF-Fight For Right (@strife4rights) February 27, 2025
ఫన్నీగా రియాక్ట్ అవుతున్న నెటిజన్లు
ఈ అమ్మాయి వీడియోపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. “ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని ఎక్కువ రోజులు ఏమీ కలిసి ఉండదు. కొద్ది రోజుల్లో కోర్టులో విడాకుల కేసు వేసి భరణం ఇవ్వాలంటుంది” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “ఈ అమ్మాయి ఏదైన గవర్నమెంట్ ఆఫీస్ ముందు నిలబడితే త్వరగా పెళ్లి కొడుకు దొరికే అవకాశం ఉంటుంది” అని మరో వ్యక్తి కామెంట్ పెట్టారు. “ఆ అమ్మయి చాలా సిగ్గులేని పని చేస్తోంది” అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “భారతీయ యువకులు ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం కంటే, అసలు చేసుకోకపోవడమే మంచిది” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “ఇక ఈ వీడియోతో అమ్మాయి బాగానే పాపులర్ కాబోతోంది” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “అదంతా పక్కా స్క్రిప్ట్. బాగానే చేశారు” అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: పెళ్లికూతురి ఫ్రెండ్ మెడలో దండ వేసిన వరుడు.. చెంపవాచేలా కొట్టిన వధువు