E-Paper
Advertisement

Liberty Replica Statue:తుఫాన్ బీభత్సం, కుప్పకూలిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ!

Liberty Replica Statue:తుఫాన్ బీభత్సం, కుప్పకూలిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ!
Advertisement

Viral Video:  బ్రెజిల్‌ లో తుఫాన్ విధ్వంసం సృష్టించింది. ఎక్స్‌ ట్రా ట్రాపికల్ సైక్లోన్ ప్రభావంతో ఆ దేశంలోని పలు ప్రాంతాలు అల్లకల్లోం అయ్యాయి. ముఖ్యంగా దక్షిణ రాష్ట్రం అయిన రియో గ్రాండే డో సుల్ లోని గువైబా నగరంపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపించింది. గంటకు 80 నుంచి 90 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. శక్తివంతమైన తుఫాను కారణంగా హవాన్ మెగాస్టోర్ బయట ఉన్న స్టాట్యూ ఆఫ్ లిబర్టీ రెప్లికా కూలిపోయింది. రియో ​​గ్రాండే డో సుల్ మీదుగా గాలి దుమారం కొనసాగిన సమయంలో ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విగ్రహం నెమ్మదిగా ఒరిగి కూలిపోయింది.

కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ రెప్లికా

హవాన్ మెగాస్టోర్ ముందు 35 మీటర్ల ఎత్తులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో 24 మీటర్ల పై భాగం కూలిపోయింది. 11 మీటర్ల కింది భాగం ఏమాత్రం దెబ్బతినలేదు. సమీపంలోని వ్యక్తులు ఈ విగ్రహం కూలిపోయే వీడియోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో సదరు విగ్రహం నెమ్మదిగా వంగి కూలినట్లు కనిపిస్తుంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. స్టోర్ స్టాఫ్ త్వరగా ఆ ఏరియా లోని వాహనాలను ఖాళీ చేశారు. ఈ విగ్రహాన్ని హవాన్ డిపార్ట్‌మెంటల్ స్టోర్ పార్కింగ్ లాట్‌ లో 2020లో ఏర్పాటు చేశారు.

వెంటనే స్పందించిన డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్

Advertisement

ఈ విగ్రహం కూలిపోయిన కొద్ది గంటల్లోనే డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ శిథిలాలను తొలగించడం మొదలు పెట్టాయి. హవాన్ కంపెనీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. విగ్రహం ఇంజినీరింగ్ స్టాండర్డ్స్ పాటించి నిర్మించారని చెప్పింది. 2021లో మరో రెప్లికా కూడా సైక్లోన్‌లో కూలింది. ఇది న్యూయార్క్‌ లోని అసలు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కాదు. బ్రెజిల్‌లో హవాన్ స్టోర్స్ బయట ఉండే రెప్లికాల్లో ఒకటి. దేశ వ్యాప్తంగా డజన్ల కొద్దీ ఉన్నాయి.

Read Also: సంతలో రిపోర్టింగ్.. లేడీ రిపోర్టర్ ను ఎత్తిపడేసిన ఎద్దు!

Advertisement

తుఫాన్ హెచ్చరికలు చేసిన అధికారులు

ఈ సంఘటనకు ముందు, రియో ​​గ్రాండే డో సుల్ సివిల్ డిఫెన్స్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో అధికారులు తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు. బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటియరాలజీ (ఇన్మెట్) కూడా సౌత్ స్టేట్ కు తుఫాను హెచ్చరిక చేసింది.  గంటకు 70 మరియు 100 కిమీల మధ్య గాలులు వీస్తాయని వెల్లడించింది.  రియో గ్రాండే డో సుల్‌ లో ఈదురు గాలులకు చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచించారు.

Read Also:  580 అడుగుల ఎత్తులో ఎయిర్ క్రాఫ్ట్ హోటల్, దుబాయ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×