BigTV English

Microsoft: మానవ మలాన్ని కొనుగోలు చేస్తున్న మైక్రోసాఫ్ట్.. వామ్మో, అన్ని కోట్లా?

Microsoft: మానవ మలాన్ని కొనుగోలు చేస్తున్న మైక్రోసాఫ్ట్.. వామ్మో, అన్ని కోట్లా?

మైక్రోసాఫ్ట్ కంపెనీ మానవ మలమూత్రాలను కొంటున్నట్టుగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అవును, అది నిజమే సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో రారాజుగా ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీ మానవ మలమూత్రాలను కొంటోంది. అయితే ఇది దాని సైడ్ బిజినెస్ ఎంతమాత్రం కాదు. దాని వెనక ఓ కారణం ఉంది, ఇంకా చెప్పాలంటే అది ఓ సోషల్ కాస్. పాప ప్రక్షాళణకోసం కొన్ని బడా కంపెనీలు ఇలాంటి పనులే చేస్తుంటాయి. ఇప్పడు మైక్రోసాఫ్ట్ చేస్తున్నది కూడా అందుకోసమే.


కర్బన ఉద్గారాలు..
పర్యావరణాన్ని భారీగా కలుషితం చేసే కంపెనీలు తాము కలుషితం చేసినంత మేర తిరిగి పర్యావరణానికి మేలు చేయాలనే అంతర్జాతీయ నిబంధనలున్నాయి. కాప్ సదస్సుల్లో తరచుగా వీటిని ప్రస్తావిస్తుంటారు. కొత్త లక్ష్యాలను నిర్దేశిస్తుంటారు. అంటే ఎంత ఎక్కువ కర్బన ఉద్గారాలను వాతావరణంలోకి పంపించే కంపెనీలు, అంత ఎక్కువగా పర్యావరణానికి మేలు చేయాలి. ఫ్యాక్టరీలు, రసాయనాలు విడుదల చేసే కంపెనీలంటే ఓకే, మరి మైక్రోసాఫ్ట్ తో వచ్చిన సమస్యేంటి అనే అనుమానం చాలామందిలో ఉంటుంది. మైక్రోసాఫ్ట్ అనేది సాఫ్ట్ వేర్ కంపెనీయే కావొచ్చు. కానీ ఆ కంపెనీకి ఉన్న బ్రాంచ్ లు, కొత్తగా వస్తున్న ఏఐ టెక్నాలజీకోసం ఏర్పాటు చేస్తున్న విస్తరణ ప్రాజెక్ట్ లు కార్బన్ ఉద్గారాలకు కారణం అవుతుంటాయి. ఆయా కంపెనీల్లో ఉపయోగించే జనరేటర్లు, విద్యుత్ ఉపకరణాలు, కంప్యూటర్ పరికరాల వల్ల కార్బన్ ఉద్గారాలు వాతారవణంలోకి విడుదలవుతుంటాయి. అంటే ఆమేరకు వాతావరణం కలుషితం కావడానికి మైక్రోసాఫ్ట్ కంపెనీ కారణం అవుతుందనమాట. దీనికి రెమెడీగా వారు పర్యావరణానికి అనుకూలమైన పనులు చేయాలి. పెద్ద ఎత్తున స్థలం సేకరించి మొక్కలు పెంచడం, పర్యావరణ హితమైన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం వంటివి చేయాలి. గతంలో మైక్రోసాఫ్ట్ ఇలాంటి పనులే చేసింది. అట్మాస్ క్లియర్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా వాల్టెడ్ డీప్ అనే కంపెనీతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. 1.7 బిలియన్ డాలర్ల భారీ డీల్ ఇది. సదరు కంపెనీ మానవ మలమూత్రాలను, సేకరించి ఆ వ్యర్థాలను భూగర్భంలోకి పంపిస్తుంది. సాధారణంగా ప్రభుత్వాలు ఇలాంటి వ్యర్థాలను సమీప జలవనరుల్లోకి విడిచిపెడుతుంటాయి. అలా కాకుండా ఆ కంపెనీ వ్యర్థాలు సేకరించి భూగర్భంలోకి ఇంజెక్ట్ చేస్తుంది. దీనికోసమయ్యే ఖర్చుని 12 సంవత్సరాల పాటు మైక్రోసాఫ్ట్ చెల్లించేలా ఒప్పందం కుదిరింది.

రూ.15వేల కోట్లు
ఒక టన్ను వ్యర్థాలను సేకరించేందుకు వాల్టెడ్ డీప్ కంపెనీతో కలసి మైక్రోసాఫ్ట్ ఏకంగా రూ.30,000 ఖర్చు చేయబోతోంది. 12 ఏల్లలో మొత్తం 4.9 మిలియన్ మెట్రిక్ టన్నుల సేంద్రీయ వ్యర్థాలను కొనుగోలు చేస్తుంది. మొత్తంగా 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. ఇలా పర్యావరణ హిత ప్రాజెక్టులతో కలసి దిగ్గజ కంపెనీలు చేసే ఖర్చుని కార్బన్ క్రెడిట్ లు అంటారు. అంటే అక్కడ తమ వ్యాపారం కోసం పర్యావరణాన్ని కలుషితం చేస్తూ, ఇక్కడ లాభాల్లో కొంతమొత్తం ఖర్చు చేసి పర్యావరణానికి మేలు చేస్తూ లెవల్ చేస్తున్నారనమాట.


కార్బన్ క్రెడిట్
పర్యావరణానికి మేలు చేస్తూ కార్పొరేట్ కంపెనీలతో డీల్ కుదుర్చుకునే సంస్థలు భారత్ లో కూడా చాలానే ఉన్నాయి. తమతో కుదుర్చుకునే ఒప్పందాల ప్రకారం ఆయా కంపెనీలు కార్బన్ క్రెడిట్ లను కార్పొరేట్ కంపెనీలకు అమ్ముతుంటాయి. వాటిని చూపించి తాము నిబంధనను పాటిస్తున్నట్టు చెబుతుంటాయి కార్పొరేట్ కంపెనీలు. మిగతా కంపెనీలు కూడా ఇలాంటి ప్రాజెక్ట్ లకు ఆర్థిక సాయం చేస్తుంటాయి. కానీ మైక్రోసాఫ్ట్ తొలిసారిగా మానవ మలమూత్రాలను భూగర్భంలోకి పంపించే కంపెనీతో టైఅప్ అవడం ఆసక్తిగా మారింది. అందుకే ఈ వార్త వైరల్ అయింది.

Related News

Baba Vanga Prediction: ఏంటి.. AI వల్ల అలా జరుగుతుందా? భయపెడుతోన్న బాబా వంగా జ్యోతిష్యం!

Noida Man: తల్లి మరణం.. 20 ఏళ్ల యువకుడి ఖాతాలోకి రూ.10,01,35,60,00,00,00,00,00,01,00,23,56,00,00,00,00,299..

Viral Video: ఇంగ్లండ్ లోనూ ఉమ్మేస్తున్నారు.. ఈ ఖైనీ బ్యాచ్ మారరు!

Biggest Banana: బెట్, ఈ బనానాను ఒక్కరే తినలేరు.. చరిత్రలో అత్యంత పెద్ద అరటి పండు పొడవు ఎంతో తెలుసా?

TCS Employee: ఐటీ ఉద్యోగి రోడ్డుపై నిద్ర.. టీసీఎస్ స్పందన ఇదే

Self Surgery: మత్తు లేకుండా.. కడుపు కోసుకుని.. తనకి తానే సర్జరీ చేసుకున్న ఈ డాక్టర్ గురించి తెలుసా?

Big Stories

×