BigTV English

WCL 2025 : సెమీస్ లో భారత్-పాక్ మ్యాచ్ మళ్లీ రద్దు అవుతుందా..? పాక్ ఫైనల్ కి ఖాయమా..?

WCL 2025 : సెమీస్ లో భారత్-పాక్ మ్యాచ్ మళ్లీ రద్దు అవుతుందా..? పాక్ ఫైనల్ కి ఖాయమా..?

WCL 2025 :   వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నమెంట్ లో ఇండియా ఛాంపియన్స్ జట్టు వెస్టిండీస్ ను ఓడించి సెమీ ఫైనల్ లో తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది. అయితై ఫైనల్ కి చేరుకోవాలంటే ఇప్పుడు పాకిస్తాన్ ఛాంపియన్ జట్టుతో తలపడాలి. దీంతో మళ్లీ అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. భారత దిగ్గజ ఆటగాళ్లు మరోసారి షాహిద్ అఫ్రిది జట్టుతో మ్యాచ్ ఆడటానికి నిరాకరిస్తారా..? మ్యాచ్ మళ్లీ రద్దు అవుతుందా..? అయితే ఈసారి ఇది సెమీ ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఒక వేళ రద్దు అయితే పాకిస్తాన్ ఆడకుండానే ఫైనల్ టికెట్ దక్కే అవకాశం ఉంది. గతంలో జులై 20న ఇండియా ఛాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.


Also Read : Oval Test: ఐదో టెస్టుకు జస్ప్రీత్ బూమ్రా దూరం?

టీమిండియా అద్భుత ప్రదర్శన 


కానీ కెప్టెన్ యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, సురేష్ రైనా వంటి భారత ఆటగాళ్లు పాకిస్తాన్ జట్టుతో ఆడటానికి నిరాకరించారు. దీంతో ఆ మ్యాచ్ రద్దు చేయబడింది. ధావన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఈ టోర్నమెంట్ లో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఎలాంటి మ్యాచ్ లు ఆడబోనని స్పష్టం చేశారు. యువరాజ్ సింగ్ కెప్టెన్సీలోని ఇండియా ఛాంపియన్స్ జట్టు వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ చివరి లీగ్ మ్యాచ్ లో వెస్టిండీస్ పై ఘన విజయం సాధించి సెమీస్ లోకి ప్రవేశించింది. సెమీ ఫైనల్ లో చోటు దక్కించుకోవడానికి 145 పరుగుల లక్ష్యాన్ని 14.1 ఓవర్లలో ఛేదించాల్సి ఉండగా.. టీమిండియా కేవలం 13.2 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఈ మ్యాచ్ లో ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన స్టువర్ట్ బిన్నీ, బ్యాట్, బాల్ రెండింటిలోనూ అద్భుత ప్రదర్శన చేశాడు.

ఇండియా-పాక్ మ్యాచ్ జరిగేనా..? 

బిన్ని 2 వికెట్లు తీయడంతో పాటు 21 బంతుల్లో అజేయంగా 50 పరుగులు చేశాడు. యూసూఫ్ పఠాన్ 7 బంతుల్లో 21 పరుగులు.. కెప్టెన్ యువరాజ్ సింగ్ 11 బంతుల్లో 21 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు సెమీ ఫైనల్ లో భారత్ మ్యాచ్ పాకిస్తాన్ తో ఖరారు అయింది. టీమిండియా ఛాంపియన్స్ ఈ సారి పాకిస్తాన్ ఛాంపియన్స్ తో మ్యాచ్ ఆడటానికి నిరాకరిస్తే.. వారికి పెద్ద నష్టం వాటిల్లవచ్చు. మ్యాచ్ రద్దు అయితే నిబంధనల ప్రకారం.. పాకిస్తాన్ ఫైనల్ కి వెళ్తుంది. శిఖర్ ధావన్ ఇప్పటికే దీనిపై స్పందిస్తూ.. గతంలోనే ఆడనప్పపుడు ఇప్పుడూ కూడా ఆడను అని తేల్చి చెప్పినట్టు సమాచారం. దేశభక్తి, క్రీడా స్పూర్తి మధ్య తలెత్తిన ఈ సంఘర్షణ క్రికెట్ అభిమానుల్లో భిన్నాభిప్రాయాలకు దారి తీసింది. కొందరూ ఆటగాళ్ల నిర్నయానకి మద్దతు తెలిపితే.. మరికొందరూ క్రీడా రాజకీయాలకు అతీతంగా చూడాలని వాదిస్తున్నారు. WCL 2025  సెమీ ఫైనల్ భవిష్యత్ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ టోర్నమెంట్ నిర్వాహకులు ఈ పరిస్థితిని ఎలా  ఎదుర్కొంటారో.. మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నది వేచి చూడాలి మరీ.

Related News

FOX Spotted: మ్యాచ్ మధ్యలో ఎంట్రీ ఇచ్చిన వింత జంతువు… ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

IND vs ENG: టీమిండియాలో మొత్తం గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లే…గిల్ విజయ రహస్యం ఇదేనా

Karishma Kotak : స్టేడియంలోనే బట్టలు మార్చుకున్న యాంకర్.. వీడియో చూస్తే!

Vindhya Vishaka : సిరాజ్ కెరీర్ మొత్తం కష్టాలే.. తండ్రి చనిపోయినా మ్యాచ్ ఆడాడు.. ఇప్పుడు రియల్ హీరో అయ్యాడు

Prasidh Krishna : వీడు మామూలోడు కాదు… చెప్పి మరి వికెట్ తీశాడు.. ఇంగ్లీష్ వాడి పరువు తీశాడు

Gautam Gambhir : డ్రెస్సింగ్ రూమ్ లో గౌతమ్ గంభీర్ చేసిన రచ్చ చూడండి

Big Stories

×