Wedding Cancel Fiance Buy Home| ఈ రోజుల్లో చిన్న చిన్న కారణాలకే ప్రేమికులు విడిపోతున్నారు. బ్రేకప్ చెప్పుకుంటున్నారు. ప్రేమికులు విడిపోతే నష్టమేమీ లేదు. కానీ అదే ప్రియుడితో చాలా కాలం డేటింగ్ పెళ్లి కూడా నిశ్చయించుకున్నాక.. చిన్న కారణంతో ఓ యువతి అతనితో పెళ్లి రద్దు చేసుకుంది. తాను ప్రేమించిన యువకుడు తనకు మోసం చేశాడని ఓ యువతి సోషల్ మీడయాలో పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ లో ఆమె కథ చదివిన నెటిజెన్లంతా రివర్స్ ఆమెదే తప్పు అని చిరాకు పడుతున్నారు. రెడ్డిట్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో వచ్చిన ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. ఒక 28 ఏళ్ల యువతి ఒక యువకుడిని ప్రేమించింది. వీరిద్దరికీ కొంత కాలం క్రితం ఎంగేజ్మెంట్ కూడా అయింది. అయితే వరుడికి సొంతిల్లు లేదు. అతను తన తల్లితో ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. గత అయిదేళ్లుగా ఈ ప్రేమికులిద్దరూ తమ భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఆ ప్లానింగ్ వీరిద్దరూ కలిసి ఒక ఇల్లు కూడా తీసుకుందామనుకున్నారు. కానీ తన కాబోయే భర్త తనను మోసం చేశాడని.. అతను తల్లితో కలిసి ఒక కొత్త ఇల్లు కొనేశాడని ఆమె తన రెడ్డిట్ పోస్ట్ లో వాపోయింది.
తనకు చెప్పకుండానే ఇల్లు కొనేసినందుకు తనకు చాలా బాధ కలిగిందని.. ఒక విధంగా ఇది అతను చేసిన ద్రోహమని రాసుకొచ్చింది. తన కాబోయే భర్తకు తల్లి కూడా ఉద్యోగం చేస్తోందని.. ఆమె ప్లాన్ ప్రకారం.. ఒక ఇల్లు చూసుకొని దాన్నికొనేయాలని ఆమె నిర్ణయించకుంది. అయితే తన కొడుకు జీతం కలిపితే ఆ ఇల్లు తమ బడ్జెట్ లో వస్తుందని భావించి ఆమె తన కొడుకుతో తన ప్లాన్ చెప్పింది. దీంతో అతను కూడా తన ఒక్కడి సంపాదన ఇల్లు కొనాలంటే చాలా సంవత్సరాలు పడుతుందని భావించి తన తల్లితో కలిసి ఆ ఇల్లు కొనేశాడు. ఇల్లు కొన్న తరువాత తన కాబోయే భార్యకు ఈ విషయం గురించి చెప్పాడు. తమ సొంతింట కల తీరిపోయిందని ఆమెకు సర్ప్‌రైజ్ ఇద్దామను కున్నాడు.
Also Read: 8 నెలల కుక్క.. బరువు 75 కిలోలు.. ధర రూ.50 కోట్లు
కానీ ఆమె మాత్రం అతనికే రివర్స్ లో షాకిచ్చింది. కొత్త ఇల్లు కొనేశాం డార్లింగ్ అంటూ తనకు అతను చెప్పగానే తాను సంతోషించానని ఆ యువతి తన పోస్ట్ లో రాసింది. కానీ ఎలా కొన్నాడో తెలియగానే.. తనకు బాధ కలిగిందని.. అందుకే అతను కొత్త ఇంట్లో ఉంటే తాను ఎక్కడ ఉండాలో అతని కి అడిగింది. దానికి అతను అదే ఇంట్లో తన తల్లితో కలిసి ఇద్దరూ ఉండవచ్చునని చెప్పాడు. కానీ యువతికి మాత్రం తన ప్రియుడి తల్లితో కలిసి ఒకే ఇంట్లో ఉండడం నచ్చలేదు. అందుకే ఆ ఇంట్లో తాను నివసించడం కుదరదని చెప్పి పెళ్లి కాన్సిల్ అనేసిందట.
ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు కూడా చెప్పిందట. కానీ వారు కూడా ఇంత చిన్న విషయానికి పెళ్లి రద్దు చేసుకోవడం తప్పు అని ఆమెనే నిందించారట. తన బాధ ఎవరూ అర్థం చేసుకోవడం లేదని ఆ యువతి సోషల్ మీడియాలో రాసింది.
అయితే ఆ పోస్ట్ పై చాలామంది యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. “అతను చేసిన తప్పు ఏంటంటే.. నీకు ఆ ఇల్లు కొన్నానని చెప్పకపోవడం తప్పు కాదు.. నువ్వు అతనితో కలిసి ఆదే ఇంట్లో కాపురం ఉంటావని నీ ప్రేమను నమ్మాడు చూడు అదే అతను చేసిన తప్పు” అని వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. మరొక యూజర్ అయితే.. ‘ప్రాక్టికల్ గా ఆలోచించు.. అతని సంపాదనతో ఇల్లు కొనడం చాలా కష్టం. అందుకే అతని తల్లి సాయం తీసుకోవడంలో తప్పు లేదు’ అని రాశాడు.