Onion Health Benefits: వేసవిలో మండే ఎండలు, వేడిగాలులు, డీహైడ్రేషన్ వంటి సమస్యలను నివారించడానికి, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం ముఖ్యం. పోషకాహారం తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు రాకుండా చేయడంలో కూడా మనం తినే ఆహారం సహాయపడుతుంది. ఇదిలా ఉంటే సమ్మర్‌లో ఉల్లిపాయ సూపర్ ఫుడ్ లాగా పనిచేస్తుంది. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.
సరైన పద్దతిలో, తగినంత మోతాదులో ఉల్లి శరీరానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. వేసవిలో ఉల్లిపాయ తినడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా అనేక వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది. వేసవిలో ఉల్లిపాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవిలో ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే లాభాలు:
1. హీట్ స్ట్రోక్ నుండి రక్షణ:
వేసవికాలంలో హీట్ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. కానీ ఉల్లిపాయలు తినడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. ఎందుకంటే ఉల్లిపాయ శరీరాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా హీట్ స్ట్రోక్ నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా పచ్చి ఉల్లిపాయ తినడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది.
2. డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది:
ఉల్లిపాయలో పుష్కలంగా నీరు, ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి నీటిని కొరత రాకుండా చేస్తాయి. అందుకే సమ్మర్‌లో ఉల్లిపాయ తినడం వల్ల డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది. డీహైడ్రేషన్ తగ్గాలనుకుంటే మాత్రం తరచుగా ఉల్లిపాయ తినడం అలవాటు చేసుకోండి.
3. బలమైన రోగనిరోధక శక్తి:
ఉల్లిపాయలో యాంటీఆక్సిడెంట్ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా వ్యాధుల నుండి రక్షిస్తాయి. బలమైన రోగ నిరోధక శక్తి కోసం ఉల్లిని ఆహారంలో భాగంగా చేసుకోవడం చాలా మంచిది.
4. జీర్ణ సమస్యల నివారణ:
వేసవిలో ఆమ్లత్వం, గ్యాస్ , అజీర్ణం వంటి సమస్యలు తరచుగా వస్తాయి. ఉల్లిపాయలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుండా జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. అజీర్ణంతో ఇబ్బంది పడే వారు తరచుగా ఉల్లి తినడం వల్ల అద్భుతమైప ప్రయోజనాలు ఉంటాయి.
5. క్యాన్సర్ నివారణ:
ఉల్లిపాయలో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే కొన్ని అంశాలు ఉన్నాయి, అవి బయోయాక్టివ్ సమ్మేళనాలు, అంటే ఫ్లేవనాల్స్ మరియు ఆర్గానోసల్ఫర్. ఇవి శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి మరియు క్యాన్సర్ కణాల వ్యాప్తిని అణిచివేస్తాయి.
6. అధిక రక్తపోటు:
ఉల్లిపాయలో సల్ఫర్ , పొటాషియం ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇది హైబీపీ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. రక్త పోటును తగ్గించడంలో ఉల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది.
7. చర్మం, జుట్టుకు మేలు :
వేసవిలో చర్మంపై మొటిమలు , దద్దుర్లు వస్తాయి. ఉల్లిపాయలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మ సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఉల్లిపాయ రసం జుట్టు రాలడాన్ని నివారించడంలో, వాటిని బలంగా చేయడంలో సహాయపడుతుంది.వేసవిలో దీనిని తరచుగా తినడం, జుట్టుకు ఉల్లి రసం అప్లై చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
8. బరువు తగ్గడం:
ఉల్లిపాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది . అంతే కాకుండా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులోని అధిక ఫైబర్ కంటెంట్ కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. ఇది అతిగా తినకుండా నిరోధిస్తుంది.
9. బలమైన ఎముకలు:
ఉల్లిపాయలలో కాల్షియం, ఇతర ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. తరచుగా ఉల్లిపాయలు తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.
Also Read: చియా సీడ్స్ కలిపిన నీరు తాగితే.. నమ్మలేనన్ని ప్రయోజనాలు
వేసవిలో ఉల్లిపాయలు తినడానికి సరైన మార్గం:
మీరు పచ్చి ఉల్లిపాయను కోసి సలాడ్‌లో నిమ్మకాయ, ఉప్పుతో కలిపి తినవచ్చు. ఇలా తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను లభిస్తాయి.
వడదెబ్బను నివారించడానికి, మీరు ఉల్లిపాయ రసం కూడా తాగవచ్చు. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది.
ఉల్లిపాయను పెరుగుతో కలిపి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతే కాకుండా శరీరం చల్లబడుతుంది.
సమ్మర్‌లో ఉల్లిపాయ రైతా తయారు చేసి తినడం ద్వారా డీహైడ్రేషన్‌ను నివారించవచ్చు.
టమోటా, వెల్లుల్లి, పచ్చిమిర్చితో ఉల్లిపాయ చట్నీ తయారు చేసి తినడం వల్ల దాని రుచి పెరుగుతుంది.