Viral Video: సోషల్‌మీడియా పిచ్చి యువత నుంచి పెద్దలకు పాకుతోంది. హాయిగా ఇంట్లో ఉండాల్సింది పోయి ఇదిలో జాతీయ రహదారులపై నానాహంగామా చేస్తున్నారు. పైన కనిపిస్తున్న ఆ మహిళ తుపాకీతో నానా బీభత్సం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అసలేం జరిగింది?
యువతకు వ్యసనంగా మారింది సోషల్ మీడియా. దీని ఉచ్చులో చాలామంది గిలగిల కొట్టుకుంటున్నారు. దీని పేరిట డబ్బులు సంపాదించేవారు కొందరైతే.. పని పాటా లేకుండా రోడ్ల మీద తిరిగేవారు మరికొందరు. ప్రాణాలు తీసుకునేవాళ్లు ఇంకొందరు. రీల్స్ పిచ్చి క్రమంగా మిగతావారికి పాకుతోంది.
తాజాగా ఓ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ అవ్వాలన్న ఉద్దేశ్యంతో బయటకు వచ్చింది. తుపాకీతో హైవేపై పట్టపగలు రెచ్చిపోయింది. ఓవైపు డ్యాన్స చేస్తూ ఇంకోవైపు తుపాకీతో ఊగిపోయింది. ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన షాలినీ పాండే గురించి చెప్పనక్కర్లేదు. ఈమె అందగత్తె కూడా. దీనికితోడు ఇన్‌స్టాగ్రామ్‌లో మాంచి ఫాలోయింగ్ ఉంది.
వెరైటీగా రీల్స్ చేస్తూ తనకంటూ అభిమానులను సంపాదించుకుంది. షాలినీ పెట్టే ప్రతీ వీడియోలను అభిమానులు ఓ రేంజ్‌లో వెతుకుతారు. 60 వేల మంది ఫాలోవర్స్ ఆమె సొంతం. ఈ సంఖ్యను లక్షకు పెంచాలని టార్గెట్‌గా పెట్టుకుంది. కేవలం తన అందం, డ్యాన్సుల వల్ల ఫాలోవర్స్ పెరగడం లేదని భావించింది.
ALSO READ: అమ్మో.. దేవుడికి పెట్రోల్ బంక్.. అదీ 10 కిలోల వెండితో
తుపాకీ పట్టుకుని ఆనాటి బందిపోటు పూలన్‌దేవి మాదిరిగా కాన్పూర్-ఢిల్లీ నేషనల్ హైవేపై ఎంట్రీ ఇచ్చింది. పట్టపగలు రోడ్డుపై తుపాకీ పట్టుకుని ఓ రేంజ్‌లో స్టెప్పులు వేసింది. ఆ తతంగాన్ని ఆ వీడియో తీసి తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్టు చేసింది. అదికాస్త వైరల్ కావడంతో వీడియో పోలీసుల కంటపడింది.
ఆమెపై చర్యలకు సిద్దమయ్యారు. షాలినీ గురించి తెలుసుకున్నవారు ఈమె ఎంబీఏ చేస్తే బాగుంటుందని సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమెపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ పోలీసులు విచారణకు పిలిస్తే షాలిని ఏం చెబుతుందో చూడాలి.
#कन्नौज : लाइसेंसी शस्त्र के साथ हाईवे पर रील बनाकर किया प्रदर्शन जांच का विषय हो सकता है महोदय तत्काल संज्ञान लेकर उचित कार्रवाई करें आरोपियों के खिलाफ@Uppolice @igrangekanpur @adgzonekanpur @kannaujpolice @kanpurnagarpol @wpl1090
क्या क्या देखना पड़ रहा है pic.twitter.com/FpgdCzR7BZ
— Mishra Rahul ब्राह्मण (@MishraRahul_UP) July 9, 2025