Viral Video: బెంగళూరు సిటీలో ఓ పెట్రోల్ పంపు సమీపంలో ఓ యాక్సిడెంట్ జరిగింది. అసలే చిన్న రోడ్లు ఆపై వేగంగా కారులో వచ్చిన ఓ మహిళ, బైక్‌ని ఢీ కొట్టింది. దీనిదాటికి కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. బైకర్‌కు గాయాలయ్యాయి.
వెంటనే కారులో నుంచి బయటకు దిగిన ఆ మహిళ, అసభ్యకర పదజాలంతో రైడర్‌ని చెడామడా బూతులు తిట్టింది. ఈ గొడవ పెద్దది కావడంతో పరిస్థితి గమనించింది. అక్కడి నుంచి సైలెంట్‌గా మరో కారు బుక్ చేసుకుని ఇంటికి వెళ్లిపోయింది. కారుని రోడ్డుపై వదిలేసింది.
బైక్ రైడర్‌కు ముఖంపై గాయాలు అయ్యాయి. రక్తం కారుతున్నా ఏ మాత్రం పట్టించుకోలేదు. పెట్రోల్ పంప్ బయట బాధితుడు వాటర్ బాటిల్ గాయాలను కడిగే ప్రయత్నం చేశాడు. బైక్‌కి ఏమీ కాలేదు అంతా బాగానే ఉందని ఎదురుదాడికి దిగింది.
నా కారు చూడు ఎంతగా డ్యామేజ్ అయ్యిందో అంటూ రైడర్‌ని విరుచుకుపడింది. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ మహిళ మాటలకు చుట్టు పక్కలవారు షాకయ్యారు. దీన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.
ALSO READ: నాలుగో క్లాస్‌లో గొడవ.. 50 ఏళ్ల తర్వాత రివేంజ్, అసలు ట్విస్ట్ ఏంటంటే..
అందుకు సంబంధించి వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఘటన వీడియో తీవ్ర విమర్శలకు దారితీసింది. గాయపడిన వ్యక్తి పట్ల ఆ మహిళ అసభ్యకరమైన భాష, ఆమె ప్రవర్తించిన తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు.
Road-Rage Kalesh after Accident b/w Lady Driver and Biker in Bengaluru (Lady is blalently abusing him)
⚠️: Please Use Headphones🎧
pic.twitter.com/wIA0HZUtLm— Ghar Ke Kalesh (@gharkekalesh) June 11, 2025