BigTV English

Viral News : 4th క్లాస్‌లో గొడవ.. 50 ఏళ్ల తర్వాత రివేంజ్.. చివర్లో ట్విస్ట్

Viral News : 4th క్లాస్‌లో గొడవ.. 50 ఏళ్ల తర్వాత రివేంజ్.. చివర్లో ట్విస్ట్

Viral News : వాళ్లిద్దరూ ఫ్రెండ్స్. చిన్నప్పుడు క్లాస్‌మేట్స్. పెద్దయ్యాక అప్పుడప్పుడూ కలుస్తూ ఉండేవారు. మరీ క్లోజ్ కాకున్నా.. సో సో గా ఉండేవారు. ఇప్పుడు వాళ్ల వయస్సు 62 ఏళ్లు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ముసలి వాళ్లై రెస్ట్ తీసుకునే స్టేజ్‌కు వచ్చారు. ఇటీవల ఓ సందర్భంలో స్కూల్ మేట్స్ కొందరు కలిశారు. పిచ్చాపాటి మాట్లాడుకుంటుండగా.. మధ్యలో ఓ టాపిక్ వచ్చింది. ఇక అంతే.. అక్కడ సీన్ మొత్తం మారిపోయింది. స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది. ఇంతకీ ఆ టాపిక్ ఏంటంటే…


స్కూల్‌లో గొడవ.. కట్ చేస్తే..

బీజే బాబు, బాలకృష్ణన్ అనే ఇద్దరు 4వ తరగతిలో గొడవ పడ్డారు. ఆ సమయంలో బాబు.. బాలకృష్ణన్‌ను కొట్టాడు. 50 ఏళ్ల తర్వాత.. లేటెస్ట్‌గా ఆ విషయం వారి మధ్య మరోసారి చర్చకు వచ్చింది. ఎందుకు కొట్టావ్? అని అతను.. అందుకే కొట్టాను అని ఇతను. మళ్లీ మాటా మాటా పెరిగింది. 62 ఏళ్ల ఏజ్‌లో చిన్నపిల్లాళ్లా ఈ లొల్లి ఏంటి అంటూ పక్కనే ఉన్న ఫ్రెండ్స్ వారిద్దరినీ వారించారు. అప్పటికి నచ్చజెప్పి ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు. కానీ, చిన్నప్పుడు దెబ్బతిన్న బాలకృష్ణన్ మాత్రం ఆ టాపిక్‌ను వదిలిపెట్టలేదు. అతను ప్రతీకారంతో రగిలిపోయాడు. ఎలాగైనా బాలును తిరిగి కొట్టాల్సిందేనని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఏం చేద్దాం అని ప్లాన్ చేసి.. ఎదురుదాడికి సిద్ధమయ్యాడు.


ఫ్రెండ్‌తో కలిసి ఫ్రెండ్‌పై అటాక్

వాళ్లిద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన మాథ్యూను సంప్రదించాడు బాలకృష్ణన్. బాలు మేటర్ చెప్పి.. వాడిని ఎలాగైనా ఇప్పుడు కొట్టాల్సిందేనని పట్టుబట్టాడు. అందుకు మాథ్యూ సైతం సరే అన్నాడు. ఈ ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్ కలిసి.. తమ క్లాస్ మేట్‌కు ముసలితనంలో స్పాట్ పెట్టేందుకు రెడీ అయ్యారు. జూన్ 2న, వన్ ఫైన్ డే.. బాలకృష్ణన్, మాథ్యూ కలిసి తప్ప తాగారు. బాబును దారిలో దొరకపట్టారు. బాలకృష్ణన్.. బాబు కాలర్ పట్టుకున్నాడు. చిన్నప్పుడు తనను ఎందుకు కొట్టావంటూ నిలదీశాడు. అంతలోనే మాథ్యూ ఓ రాయి తీసుకుని బాబు ముఖంపై, వీపుపై బాదాడు. అలా బాబుపై అటాక్ చేసి.. చిన్నప్పటి రివేంజ్ తీర్చుకున్నామనే సంతోషంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాబుకు గట్టిగానే దెబ్బలు తగిలాయి. అతను ఆసుపత్రిలో చేరాడు.

Also Read : వయస్సు 30.. పెళ్లిళ్లు 10.. కిలాడీ లేడీ..

కేరళలోని కాసరగోడ్ జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసులు కేసు నమోదు చేసి.. బాలకృష్ణన్, మాథ్యూలను అరెస్ట్ చేశారు. 4వ తరగతిలో స్కూల్‌లో జరిగిన గొడవను మనుసులో పెట్టకుని.. 62 ఏళ్ల వయస్సులో ఫ్రెండ్‌ను కొట్టిన ఉదంతం వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఆ న్యూస్ ఇండియా మొత్తం చక్కర్లు కొడుతోంది.

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×