Samsung Galaxy Z Flip| సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6ని కొనాలని ఆలోచిస్తున్నారా? ఇప్పుడే అద్భుతమైన అవకాశం. ఈ ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మొదట రూ. 1,09,999 ధరతో లాంచ్ అయింది. కానీ, జూలైలో గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 లాంచ్ కాబోతున్న నేపథ్యంలో.. అమెజాన్‌లో ఈ ఫోన్ ధర రూ.75,499 వరకు తగ్గింది. ఫ్లాట్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డీల్స్ కలిసి ఈ ఫోన్‌ను సగం ధరకే కొనే అవకాశం కల్పిస్తున్నాయి.
గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 అమెజాన్ డీల్
అమెజాన్‌లో ఈ ఫోన్ ధర రూ. 77,999గా ఉంది, అంటే లాంచ్ ధర కంటే రూ. 32,000 తక్కువ. అదనంగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడితే రూ. 2,500 అదనపు తగ్గింపు పొందవచ్చు, దీంతో ధర రూ. 75,499కి చేరుతుంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే రూ. 61,150 వరకు మరింత తగ్గింపు లభిస్తుంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ ధర మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్, కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్లను కలిపి వాడితే, ఈ స్టైలిష్ ఫ్లిప్ ఫోన్ చాలా తక్కువ ధరకే మీ సొంతం అవుతుంది.
గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 ఫీచర్లు
సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6లో 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లే ఉంది, ఇది 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో సున్నితమైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. ఫోన్‌ను తెరవకుండా నోటిఫికేషన్లు, సమయం వంటి సమాచారం చూసేందుకు 3.4-అంగుళాల సూపర్ అమోలెడ్ కవర్ డిస్‌ప్లే ఉంది. 60హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.
ఈ ఫ్లిప్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఫర్ గెలాక్సీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫ్లిప్ ఫోన్ అద్భుతమైన పనితీరును అందిస్తుంది. IP48 రేటింగ్‌తో, ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ల నుంచి రక్షణ పొందుతుంది. ఫోటోగ్రఫీ కోసం.. 50ఎంపీ ప్రధాన కెమెరా, 12ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 10ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది, ఇది 25వాట్ వైర్డ్ ఛార్జింగ్ 15వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఈ ఆఫర్ అమెజాన్‌లో పరిమిత సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి, ఈ స్టైలిష్, శక్తివంతమైన ఫోల్డబుల్ ఫోన్‌ను తక్కువ ధరకు సొంతం చేసుకోవాలనుకుంటే, వెంటనే చర్య తీసుకోండి. ఈ డీల్‌తో సామ్‌సంగ్ అత్యాధునిక ఫ్లిప్ టెక్నాలజీని తక్కువ ధరకే అనుభవించండి!
త్వరలోనే సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 విడుదల
సామ్‌సంగ్ తన కొత్త గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ గురించి టీజర్ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈ ఫోన్ సామ్‌సంగ్ యొక్క అత్యంత సన్నని, తేలికైన, మరియు అత్యాధునిక ఫోల్డబుల్ ఫోన్‌గా ఉంటుందని కంపెనీ పేర్కొంది. జూలైలో న్యూయార్క్‌లో జరిగే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7, జెడ్ ఫ్లిప్ 7ని లాంచ్ చేయనుంది.
మంగళవారం ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా సామ్‌సంగ్ ఈ కొత్త ఫోన్‌ను టీజ్ చేసింది. ఇది బుక్-స్టైల్ ఫోల్డబుల్ డిజైన్‌ను కలిగి ఉంటుందని.. గత ఫోన్ల కంటే సన్నగా, తేలికగా, మన్నికగా ఉంటుందని తెలిపింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 ఓపెన్ చేసినప్పుడు.. 3.9మిమీ, మడతపెట్టినప్పుడు 8.9మిమీ మందం ఉంటుందని పుకార్లు వచ్చాయి. పోలిక కోసం.. గత ఏడాది జెడ్ ఫోల్డ్ 6 మడతపెట్టినప్పుడు 12.2మిమీ, ఓపెన్ చేసినప్పుడు 5.6మిమీ ఉంది. ఒప్పో ఫైండ్ ఎన్5, వివో ఎక్స్ ఫోల్డ్ 5 కూడా దీనికంటే మందంగా ఉన్నాయి.
Also Read: 32ఎంపీ సెల్ఫీ కెమెరా, 100x జూమ్.. పవర్‌ఫుల్ ఫీచర్లతో వివో టీ4 అల్ట్రా విడుదల
సామ్‌సంగ్ ఈ ఫోన్‌ను అల్ట్రా-లెవల్ ఎక్స్‌పీరియన్స్‌తో అందించనుంది. జూలైలో జరిగే ఈవెంట్‌లో జెడ్ ఫోల్డ్ 7తో పాటు జెడ్ ఫ్లిప్ 7, దాని ఫ్యాన్ ఎడిషన్ (FE) వెర్షన్‌ను కూడా లాంచ్ కానుంది. లాంచ్‌కు ముందు మరిన్ని ఫీచర్లను టీజ్ చేయనున్నారు.