HBD Actress Sarada..ప్రముఖ సీనియర్ నటీమణి శారద (Sarada) నేటికీ సినిమాలలో అడపాదడపా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు. 60 ఏళ్ల సినీ ప్రస్థానం కలిగిన నటి శారద ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి, వందల చిత్రాలలో అద్భుతంగా రాణించారు. ఇక సినీ తెరపై మహారాణిగా ఒక వెలుగు వెలిగిన ఈమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు, విమర్శలు ఎదుర్కొన్నారు. నటిగా తెలుగు, తమిళ్, మలయాళం,హిందీ, కన్నడ భాషల్లో హీరోయిన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఆఖరికి బామ్మగా కూడా పాత్రలు పోషించి, ఒక వెలుగు వెలిగిన శారద.. మూడుసార్లు నేషనల్ అవార్డులతో పాటు రెండుసార్లు ఫిలింఫేర్ అవార్డులు, ఒక ఎన్టీఆర్ జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. ఈరోజు ఈమె పుట్టినరోజు కావడంతో ఈమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
వెండితెర మహారాణిగా ఒక వెలుగు వెలిగిన శారద..
వెండితెరపై మకుటం లేని మహారాణిగా పేరు సొంతం చేసుకున్న శారద అసలు పేరు సరస్వతి. సినిమాల్లోకి వచ్చాక తన పేరును శారదాగా మార్చుకుంది. 1945 జూన్ 12 న ఆంధ్రప్రదేశ్ తెనాలి వెంకటేశ్వరరావు , సత్యవతి దేవి దంపతులకు లో జన్మించారు. ఈమెకి మోహన్ రావు అనే సోదరుడు కూడా ఉన్నారు. చిన్నతనంలోనే చెన్నైలో అమ్మమ్మ వద్ద పెరిగిన ఈమే తండ్రి వెంకటేశ్వర రావు కి.. ఈమె సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం ఉండేది కాదు. అయినా సరే అమ్మమ్మ సహాయంతో ఆరేళ్ల వయసు నుంచే శారదా నటన ఆరంభించారు. 1955 లో వచ్చిన ‘కన్యాశుల్కం’ సినిమాతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైన శారద.. ఆ తర్వాత 1961లో వచ్చిన ఇద్దరు మిత్రులు సినిమాతో మంచి గుర్తింపు అందుకున్నారు.
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే ప్రేమ, పెళ్లి..
ఇక ఇండస్ట్రీలో అప్పుడప్పుడే అవకాశాలు అందుకుంటున్న సమయంలో నటుడు చలం(Chalam) తో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి , వెంటనే పెళ్లి కూడా జరిగిపోయింది. అయితే చలం పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఎందుకంటే అటు చలం కెరియర్ పతనం అవడం, ఆయనకు ఇదివరకే పెళ్లయింది అనే విషయం శారదకు తెలియడం, దీనికి తోడు అదే సమయంలో శారద హీరోయిన్గా పీక్ స్టేజ్ లో ఉండడం అన్నీ జరిగిపోయాయి. అంతేకాదు డబ్బు కారణంగా చలం – శారదా మధ్య మనస్పర్ధలు వచ్చి, చివరికి విడిపోయారు. ఇదంతా చలం మొదటి భార్య శాప ఫలితమే అని కొంతమంది చెబుతూ ఉంటారు.
ALSO READ: Nikhil The indian House: షూటింగ్ సెట్లో ప్రమాదం అప్డేట్.. ఒకరికి కాలు విరిగింది.. మరో ఇద్దరికి…
ఆమె శాపమే శారదా కెరియర్ ను నాశనం చేసిందా?
అసలు విషయంలోకి వెళ్తే.. చలం కెరియర్లో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు శారదా కంటే ముందే రమణకుమారి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నారు. తన ప్రేమకు గుర్తుగా ఆమె పేరులోని రమణను తన పేరులో చేర్చుకొని రమణాచలం గా తన పేరును మార్చుకున్నారు. అంత ప్రేమించిన భార్యను శారద కోసం చలం మోసం చేశాడని, వీరి ప్రేమను ఒప్పుకోలేక రమణకుమారి ఆత్మహత్య చేసుకుందని, ఈ పాప ఫలితమే శారదా వైవాహిక జీవితం పై పడిందని అప్పట్లో చాలా మంది కామెంట్లు చేసిన వాళ్లు కూడా ఉన్నారు. మొత్తానికైతే ఆ శాపం వల్లేనేమో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట 1984లో విడిపోయారు. ఇకపోతే పిల్లలు లేకపోవడంతో ప్రస్తుతం చెన్నైలోనే తన సోదరుల కుటుంబంతో కలిసి శారదా నివసిస్తున్నట్లు సమాచారం.