E-Paper
Advertisement

Crime News: ఈ భారతీయుడ్ని పట్టుకుంటే 9 కోట్లు మీకే.. ఎఫ్‌బీఐ ప్రకటన, ఇంతకీ ఏం చేశాడు?

Crime News: ఈ భారతీయుడ్ని పట్టుకుంటే 9 కోట్లు మీకే.. ఎఫ్‌బీఐ ప్రకటన, ఇంతకీ ఏం చేశాడు?
Advertisement

Crime News: ఆ భారతీయుడి కనిపిస్తే చెప్పండి.. ఏకంగా 9 కోట్ల రూపాయలు సొంతం చేసుకోండి. ఓ వ్యక్తి కోసం అమెరికాలోని ఎఫ్‌బీఐ చేసిన ప్రకటన ఇది. ఇంతకీ అతగాడు ఎవరు? చేసిన ఘన కార్యమేంటి? ఆ తరహా విషయాలు తెలుసుకునేందుకు ఈ స్టోరీపై ఓ లుక్కేద్దాం. అసలు అమెరికాలో ఏం జరిగింది?

భార్యని అత్యంత దారుణంగా హత్య చేసిన భారతీయుడు

Advertisement

అమెరికాలో దశాబ్దం కిందట భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు చేతన్‌భాయ్‌ పటేల్‌. ప్రస్తుతం అతగాడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం అన్నికోణాల్లో గాలింపు చేపట్టిన తర్వాత ఆచూకీ లభించకపోవడంతో ఈ ప్రకటన ఇచ్చింది అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్- ఎఫ్‌బీఐ. అతడి ఆచూకీ చెప్పినవారికి రివార్డును 2,50,000 డాలర్ల నుంచి ఏకంగా 1 మిలియన్ డాలర్లకు పెంచేసింది.

ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 9.18 కోట్లు. అంతేకాదు ఎఫ్‌బీఐ టాప్ 10 మోస్ట్ వాంటెడ్ జాబితాలో అతడు ఒకడు కూడా. సరిగ్గా 2015 ఏప్రిల్ 12న మేరీల్యాండ్‌లోని హానోవర్‌లో ఓ డంకిన్ డోనట్ షాపులో భద్రేశ్‌కుమార్‌- అతని భార్య పాలక్ పటేల్ నైట్ డ్యూటీలో ఉన్నారు. ఆ సమయంలో భార్యని దారుణంగా హత్య చేసినట్లు కుమార్‌పై బలమైన ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

11 ఏళ్లుగా ఎఫ్‌బీఐ వేట..  రికార్డు స్థాయిలో రివార్డు ప్రకటన

హత్యకు ముందు ఇద్దరు కలిసి కిచెన్‌ వైపు వెళ్లడం షాపులోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. కొంతసేపటికి కస్టమర్లు పిలిచినా ఎలాంటి స్పందన రాలేదు. చివరకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి కిచెన్‌లో పాలక్ మృత దేహం కనిపించడంతో షాకయ్యారు. ఘటనకు ముందు కొన్నాళ్లుగా భారత్‌కు వెళ్లిపోవాలని పాలక్ కోరింది. అందుకు భద్రేశ్‌కుమార్‌ ససేమిరా అన్నాడు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు తీవ్రమయ్యాయి. ఘటన జరిగిన రోజు పాలక్ తన ఫ్యామిలీతో ఫోన్‌లో మాట్లాడుతోంది. ఆ సమయంలో వాగ్వాదం పెరిగి హత్యకు దారితీసిందని ఎఫ్‌బీఐ అధికారులు చెబుతున్నారు. హత్య తర్వాత నిందితుడు అపార్ట్‌మెంట్‌కు వెళ్లి కొన్ని వస్తువులు, నగదు తీసుకుని న్యూజెర్సీలోని నెవార్క్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని ఓ హోటల్‌కి వెళ్లాడు. మరుసటి రోజు అక్కడి నుంచి నెవార్క్ పెన్ స్టేషన్‌కు వెళ్లాడు.

ALSO READ: 6 నెలల వ్యవధిలోనే.. 40 మంది ఆత్మహత్యలు కలకలం

ఆనాటి నుంచి నిందితుడి ఆచూకీ లభించలేదు. ఘటనకు సంబంధించి 300కు పైగా ఆధారాలు లభించాయి. కానీ భద్రేశ్‌కుమార్‌ను పట్టుకోలేకపోయారు అధికారులు. రివార్డు ప్రకటనతో పాలక్‌కు న్యాయం జరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు. టీచర్ కావాలని కలలు కన్న పాలక్‌ని ఆమె కుటుంబం ఎంతగానో మిస్ అవుతోందన్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రజల సహాయం అవసరమని అధికారులు చెబుతున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×