Woman Second Wedding For Buffaloes | ఉచితంగా వస్తోందంటే ఇటీవలి రోజుల్లో మంచి చెడు ఆలోచించకుండా చాలామంది దానికోసం పాకులాడుతున్నారు. అందుకోసం నైతిక విలువలు, బంధాలు, బాంధవ్యాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. అలా స్వార్థంగా ఆలోచించిన ఒక వివాహిత అడ్డంగా పోలీసుల చేతిలో బుక్తైంది. తనకు గేదెలు కొనేందుకు డబ్బులు ఉచితంగా వస్తాయని భావించి భర్త ఉండగానే మరో యువకుడితో వివాహానికి అంగీకరించింది. ఈ ఘటన గురించి ఇప్పుడ సోషల్ మీడియాలో పోస్ట్ లు, వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఇలాక్కూడా చేస్తారా? అని ఆన్ లైన్ లో డిబేట్లు పెడుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) హసన్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో స్థానిక ప్రాంతాలకు చెందిన సుమారు 300 మంది జంటలకు సామూహిక వివాహాలు (Mass Marriages) నిర్వహించారు. ఇక్కడ వివాహం చేసుకున్న జంటలకు రూ.35,000 బహుమతి ఇచ్చారు. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా, ఇక్కడే షాకింగ్ ఘటన జరిగింది.
మంటపంలోకి వచ్చిన ఒక వృద్ధ జంట, వధూవరుల (bride and groom) వద్దకు వెళ్లింది. వారిని చూడగానే వధువు ఒక్కసారిగా షాక్ అయింది. తమ కోడలు రెండో పెళ్లి (Second marriage) చేసుకుంటోందని ఆ వృద్ధ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ జంటను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఆమె నూర్ మొహమ్మద్ అనే వ్యక్తిని మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నట్లు తెలిసింది. అయితే తర్వాత కుటుంబ సమస్యల కారణంగా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.
Also Read: పెళ్లికూతురు బట్టలు లేకుండా వారం పాటు ఉండాల్సిందే.. విచిత్ర సంప్రదాయం
ప్రస్తుతం వారి విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో ఆ మహిళ రూ.35,000 పథకం గురించి తెలుసుకుని, తన బంధువు జాబర్ అహ్మద్‌ను వివాహం చేసుకోవడానికి సిద్ధమైంది. ఆ డబ్బులతో గేదెలు (buffaloes) కొనడం, రెండు జతల బట్టలు, గోడ గడియారం, వెండి ఉంగరాలు మొదలైనవి కొనడం వారి మధ్య ఒప్పందం. ఇలా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి వివాహం చేసుకున్న ఈ జంటపై పోలీసులు వారి వివాహాన్ని రద్దు చేసి, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే ఇటీవల గుజరాత్ లో సామూహిక వివాహాల పేరుతో ఒక గ్యాంగ్ మొత్తం 28 జంటలను దోచుకుంది. గుజరాత్ లోని రాజ్ కోట్ ప్రాంతంలో ఉచితంగా వివాహాలు చేస్తాం, కొత్త దంపతులకు కానుకలు కూడా ఇస్తామని కొందరు పెద్ద మనుషుల వేషంలో ప్రకటన చేశారు. వారి ప్రకటనను నమ్మి తమ బిడ్డల పెళ్లికి ఖర్చు మిగిలిపోతుందని ఆశపడిన చాలా తల్లిదండ్రుల వారు పెళ్లి చేయడానికి అడిగిన కొంత సొమ్ముని ఇచ్చేవారు.
కానీ తీరా పెళ్లి మండపానికి చేరుకుంటే అక్కడ ఎటువంటి ఏర్పాట్లు లేవు. దీంతో ఆ మొత్తం 28 పెళ్లి కావాల్సిన జంటు షాకయ్యాయి. అందరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ కొందరు మాత్రం అదే ముహుర్తానికి పెళ్లి చేసుకోవాలని భావించి సమీపంలోని దేవాలయంలో పెళ్లి చేసుకోగా.. మిగతా 6 జంటలకు మాత్రం రాజ్ కోట్ పోలీసులు పెళ్లి చేశారు. సామూహిక వివాహాల పేరుతో దోపిడీలు చేసే ఆ గ్యాంగ్ ని త్వరలోనే పట్టుకుంటామని రాజ్ కోట్ పోలీసులు హామీ ఇచ్చారు.