Bride Without Clothes Ritual | భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా పెళ్లి అనగానే అందరూ సంబరంగా చేసుకుంటారు. ఈ వేడుకల్లో చాలా చోట్ల వినోదం కోసం డాన్సులు, పాటలు, ఆటలు చిందులు వేస్తూ ఎంజాయ్ చేస్తారు. దీంతో పాటు వివాహ సమయంలో వధువు, వరుడు ఇద్దరు కూడా పాటించే సంప్రదాయాలుంటాయి. ఇది వేర్వేరు మతాలు, ప్రాంతాల వారీగా భిన్నంగా ఉంటాయి. కొన్ని చోట్ల పెళ్లి కొడుకు బట్టలు చింపేసే సంప్రదాయం ఉంటే.. మరి కొన్ని చోట్ల టమోటాలతో కొట్టి వధూవరులకు స్వాగతం పలుకుతారు. ఇలాంటి ఆచారాలు కొందరు పెళ్లికి ముందు ఇవి పాటిస్తే.. మరి కొన్ని చోట్ల పెళ్లి తరువాత వీటిని ఆచరిస్తారు. అయితే ఒక ఊర్లో మాత్రం విచిత్ర సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయం ప్రకారం.. వధువు వివాహం జరిగిన వారం రోజుల వరకు బట్టలు వేసుకోకూడదు. అలాగే నూలు పోగులు లేకుండా ఇంట్లో ఉండాలి.
వివరాల్లోకి వెళితే… హిమాచల్ ప్రదేశ్‌లోని మణికర్ణ లోయలోని పిని గ్రామ ప్రజలు వివాహానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఇక్కడ నవ వధువులు పెళ్లి జరిగిన మొదటి వారం బట్టలు ధరించకుండా ఇంట్లో ఉంటారు. వారు మాత్రమే కాదు.. పెళ్లి చేసుకున్న మహిళలు కూడా ప్రతీ సంవత్సరం మాఘమాసంలో 5 రోజుల పాటు ఎలాంటి దుస్తులు ధరించరు. భార్య-భర్తలిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఒకరితో మరొకరు మాట్లాడుకోరు. ఇద్దరూ ఎవరికి వారే తెలియనట్టుగా ఉంటారు. ఈ 5 రోజుల్లో మహిళలు పురుషుల పూర్తిగా అరిపచయస్తులుగా ఉంటారు. ఇంటి పనులను దుస్తులు లేకుండానే చేస్తారు. కొన్ని సందర్భాల్లో మహిళలకు ఉన్నితో చేసిన ఏకవస్త్రం ధరించేందుకు అనుమతి ఉంది. ఈ సంప్రదాయం పాటించకపోతే వారికే కాదు, గ్రామానికి కూడా అరిష్టం వస్తుందని, కీడు జరుగుతుందని పిన్ని గ్రామస్తుల నమ్మకం.
Also Read: లీటర్ పాలు రూ.180.. నెయ్యి కిలో రూ.4000.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూపర్ బిజినెస్
ఇది మాత్రమే కాదు, ఈ సమయంలో పురుషులు కూడా మద్యం సేవించరు.. ఎవరితోనూ మాట్లాడరు, చూసి నవ్వుకోరు. మాంసం తినడం కూడా ఆ 5 రోజులు మానేస్తారు.
ఈ ఆచారం వెనుక వింత కథ
ఈ ఆచారం వెనుక ఒక విచిత్ర కథ ఉంది. పూర్వం పిని గ్రామంలోకి ఒక రాక్షసుడు వచ్చి.. చక్కగా బట్టలు వేసుకుని అందంగా ముస్తాబైన పెళ్లైన స్త్రీలను అపహరించేవాడట. అందమైన బట్టలు వేసుకున్న ఏ స్త్రీనైనా తీసుకుని వెళ్లి చిత్రహింసలు చేసేవాడట. పరిస్థితి మితిమీరడంతో గ్రామస్తుల దైవం లాహు ఘోండ దేవత.. ఆ రాక్షసుడిని చంపి స్త్రీలను రక్షించారట. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోందని గ్రామ ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ దేవత రాక్షసుడిని వధించిన సందర్భాన్ని గ్రామ ప్రజలు పండుగగా జరుపుకుంటారు.
అయితే, కాలక్రమేణా ఈ సంప్రదాయంలో కొంత మార్పు వచ్చింది. ఇప్పుడు ఆ 5 రోజులు మహిళలు సన్నని ఉన్ని బట్టలు ధరిస్తారు, కానీ వాటిని మార్చేవారు కాదట. ఈ ప్రత్యేక ఆచారం గ్రామ ప్రజల సాంస్కృతిక ఐక్యత, నమ్మకాలను ప్రతిబింబిస్తుంది.