Pawan Kalyan on YS Jagan: మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. గవర్నర్ నజీర్ అసెంబ్లీని ఉద్దేశించి తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్న సమయంలో వైసీపీ కి చెందిన ఎమ్మెల్యేలు, గవర్నర్ ప్రసంగం పత్రాలను చించివేశారు. ఆ తర్వాత మాజీ సీఎం జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పట్టుబట్టి నిరసన తెలిపారు. అనంతరం వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి అసెంబ్లీ నుండి వెళ్లిపోయారు.
ఇదే విషయంపై అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పవన్ మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు సబబుగా లేదని, గవర్నర్ గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, సమావేశానికి వచ్చి ప్రసంగించారన్నారు. అటువంటి సమయంలో ప్రసంగం ప్రతులను చించి వేయడం సరికాదని పవన్ హితువు పలికారు. ప్రతిపక్ష హోదా అడిగితే వచ్చేది కాదని, మెజారిటీ ఉన్న వ్యక్తులు అధికారాన్ని నిలుపెట్టుకుంటారన్న విషయాన్ని వైసీపీ గమనించాలన్నారు. మెజారిటీ సభ్యులు లేకుండానే తమకు ప్రతిపక్ష హోదా కావాలని జగన్ పట్టుబట్టడం చిన్నపిల్లల వ్యక్తిత్వానికి నిదర్శనంగా మారుతుందన్నారు.
కనీసం జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా, వైసీపీకి ప్రతిపక్ష హోదా వచ్చి ఉండేదని, అసెంబ్లీలో రెండవ అతిపెద్ద పార్టీ జనసేన అంటూ పవన్ చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ప్రతిపక్ష హోదా అవసరం లేదని, రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చిన కూడా, అసెంబ్లీకి రాకుండా గొడవ చేస్తామంటూ వైసీపీ నాయకులు పదే పదే చెప్పడం సరైన పద్ధతి కాదంటూ పవన్ అన్నారు. వైసీపీ బాధ్యతగా వ్యవహరించాలని, మీ విధానం ఇప్పటికైనా మార్చుకోవాలంటూ పవన్ సూచించారు. కేవలం అసెంబ్లీలో గొడవ చేయడం మాత్రమే వైసీపీ విధానం అంటూ పవన్ అన్నారు. ఈ 5 సంవత్సరాలలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని, అలా ఇవ్వడం కుదరదంటూ పవన్ కుండబద్దలు కొట్టారు. జగన్ మెంటల్ గా ప్రిపేర్ కావాలని, ప్రతిపక్ష హోదా అనేది స్థాయిని బట్టి శాసనసభ నియమ నిబంధనలను బట్టి ఇస్తారన్నారు.
Also Read: IND vs PAK In Wedding Hall: పెళ్లిలో క్రికెట్ ఫీవర్.. అక్కడ మెరుపులు.. ఇక్కడ ముత్యాల తలంబ్రాలు
ఇప్పటికైనా జగన్ అర్థం చేసుకొని అసెంబ్లీకి రావాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఢిల్లీలో ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో ఎన్డీఏ పక్ష నాయకుడిని ఎన్నుకునే సమయంలో తాను నాయకుల స్థానంలో కూర్చున్నానని, కానీ ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ప్రధాని పక్కన కూర్చోలేదంటూ పవన్ అన్నారు. తనది మంత్రి హోదా కాబట్టి మంత్రులతోనే కూర్చున్నానని ఈ విషయం కూడా జగన్‌కు తెలియకపోతే ఎలా అంటూ పవన్ ప్రశ్నించారు. నేడు స్పీకర్ తో పాటు తాను వెళ్లలేదని, కేవలం ముఖ్యమంత్రి, కౌన్సిల్ చైర్మన్ వెళ్లారని, డిప్యూటీ సీఎం గా తనకు ప్రోటోకాల్ ఉండదన్న విషయం తనకు తెలుసన్నారు. విధివిధానాలకు అనుగుణంగా నడుచుకోవాలి కానీ, ప్రతిపక్ష హోదా కావాలని జగన్ పదేపదే మారాం చేయడం తగదంటూ పవన్ అన్నారు. మొత్తం మీద వైసీపీకి ప్రతిపక్ష హోదా కల్పించడంపై జగన్ సంచలన కామెంట్ చేశారని చెప్పవచ్చు.