BigTV English

Online Service: ఏజెంట్ల బెడద తిప్పినట్టే.. అంతా ఆన్‌లైన్ మయం

Online Service: ఏజెంట్ల బెడద తిప్పినట్టే.. అంతా ఆన్‌లైన్ మయం

Online Service: వాహనదారులు, డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకునేవారికి శుభవార్త. గంటల తరబడి ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పని అస్సలు లేదు.  ఏజెంట్లకు డబ్బులు ఇవ్వాల్సిన పని అంతకంటే లేదు. ఇంటి నుంచే ఎంచక్కా  ఆయా పనులు సులభంగా చేసుకోవచ్చు. ఎందుకంటే కేంద్రం తెచ్చిన కొత్త రూల్స్ ప్రకారం మార్చి తొలివారం నుంచి ఆన్‌లైన్ సేవలు తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.


తొలుత సికింద్రాబాద్ ఆర్టీఏ ఆఫీసులో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయి. దీని తర్వాత దశలవారీగా మిగతా జిల్లాలకు విస్తరించాలని రవాణా శాఖ ప్లాన్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం వాహన్, సారథి పోర్టల్‎లతో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అనుసంధానం అయ్యాయి. తెలంగాణలో ఆలస్యంగా అందుబాటులోకి రాబోతోంది.

కేంద్ర రోడ్లు, రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆన్‌లైన్ విధానానికి శ్రీకారం చుట్టింది. దీని ప్రకారం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కాకుండా దేశంలో అన్ని వాహనాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకేచోట ఉంచేందుకు వీలుగా ఆయా పోర్టల్‌ను రెడీ చేసింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ద్వారా అన్ని రాష్ట్రాల వాహనాల సమాచార బదిలీ ప్రక్రియ ఈ పోర్టల్‎లో జరగనుంది.


వాహనాదారులు ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లకుండా ఆన్‌లైన్‎లో తమ పనులు చేసుకునే పద్దతిని ప్రవేశపెట్టింది. 2016లో ఈ పద్దతి అమల్లోకి వచ్చింది. ఇందులో దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అనుసంధానమై సేవలు అందిస్తున్నాయి. తెలంగాణ మాత్రం ఈ పోర్టల్‎లో చేరలేదు. ప్రభుత్వం మారిన తర్వాత కేంద్రం పోర్టల్‎లో చేరేందుకు ముందుకొచ్చింది.

ALSO READ: పెళ్లిలో క్రికెట్ ఫీవర్.. అక్కడ మెరుపులు

తెలంగాణలో రవాణా శాఖకు సంబంధించి ఆన్‌లైన్ సర్వీసులు ఇంటి నుంచే చేసుకోవచ్చు. కేంద్రం తెచ్చిన రెండు రకాల పోర్టల్‎లో వాహన్ సర్వీసు మొదటిది. దీని ద్వారా వెహికిల్స్ రిజిస్ట్రేషన్లు, ఇతర ప్రాంతాలకు వాహనాల బదిలీ, యజమానుల పేరు మార్పు వంటివి ఆన్‌లైన్‎లో చేసుకునే వీలుంది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేస్తే సంబంధిత షోరూంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఏ మాత్రం ఉండదు. ఈ విషయాన్ని ట్రాన్స్‌‌పోర్టు అధికారులు చెబుతున్నారు.

ఇక రెండోది సారథి పోర్టల్. దీనిద్వారా డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. గడువు ముగిసిన లైసెన్స్‎ను ఆన్‌లైన్‌లో రెన్యువల్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్‎ల జారీలో ఇంతకాలం జరుగుతున్న అవినీతి, అక్రమాలకు ఈ పోర్టల్‌తో చెక్ పడనుంది. మార్చిలో నుంచి సేవలు మొదలైతే ఏయే పత్రాలు అప్ లోడ్ చేయాలనే దానిపై పూర్తి స్పష్టత వస్తుంది.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×