BigTV English

Woman Without Clothes Plane: విమానంలో పూర్తిగా బట్టలు విప్పేసి గంతులేసిన యువతి.. షాక్‌లో ప్రయాణికులు

Woman Without Clothes Plane: విమానంలో పూర్తిగా బట్టలు విప్పేసి గంతులేసిన యువతి.. షాక్‌లో ప్రయాణికులు

Woman Without Clothes Plane| ప్రపంచంలో ఎన్నో వింత ఘటనలు జరుగుతూ ఉంటాయి. తాజాగా ఒక యువతి ఎవరూ ఊహించని విధంగా చేసింది. అయితే చూసిన వారంతా భరించలేక కళ్లు మూసుకోవాల్సి వచ్చింది. ఆ యువతి తాను వేసుకున్న బట్టలు పూర్తిగా విప్పేసి అందరి ముందు గంతులు వేసింది. అంతటితో ఆగలేదు. ఏదో పిచ్చేక్కి నట్లు గట్టిగా కేకలు వేసింది. ఆ సమయంలో ఆమె చుట్టూ అంతా వందల సంఖ్యలో జనం ఉన్నారు. వారంతా ఏం జరుగుతోందోనని కాసేపు భయపడిపోయారు. ఈ ఘటన అమెరికాకు చెందిన ఒక విమానంలో జరగడం మరో విశేషం. ఆ విమానం గాల్లో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.


వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హౌస్టన్ నగరం నుంచి ఆరిజోనా రాష్ట్రం ఫీనిక్స్ నగరానికి వెళ్లే సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ విమానం ప్రయాణంలో భాగంగా ఎయిర్ పోర్ట్ నుంచి గాల్లోకి టేకాఫ్ చేసింది. విమానం ఫుల్ గా ప్రయాణికులున్నారు. ఆ ప్రయాణికుల్లో ఒక 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువతి కూడా ఉంది. విమానం ఎయిర్ పోర్ట్ నుంచి బయలు దేరిన కొన్ని నిమిషాల తరువాత ఒక అనూహ్య ఘటన జరిగింది.

విమానంలో వెనుక సీట్లలో కూర్చొని ఉన్న ఆ యువతి అనుకోకుండా తన బట్టలు విప్పేయడం ప్రారంభించింది. అమె పక్కనే కూర్చొని ఉన్న వారంతా అది చూసి ఏం చేస్తోందోనని ఆశ్చర్యంగా చూశారు. ఇంతలోనే ఆ యువతి పైకి లేచి తన బట్టలన్నీ విప్పేసి పూర్తిగా నూలుపోగులు లేకుండానే నిలబడింది. ఆ తరువాత విమానంలో గట్టిగా ఎగిరడం ప్రారంభించింది. అలా ఎగురుతూ ప్రయాణికుల మధ్య నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్లిపోయింది.


Also Read: బట్టతల ఉందని బాధపడుతున్నారా? అయితే, మీకు షఫీక్ గురించి తెలియాల్సిందే!

దీంతో విమానంలో ప్రతి ఒక్క ప్రయాణికుడి కన్ను ఆమెపై పడింది. అందరూ కళ్లు తేరేసి ఆమెనే చూస్తున్నారు. ప్రయాణికుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. దీంతో వారి తల్లిదండ్రులు ఆ పిల్లల కళ్లు మూసేశారు. కానీ ఆమె మాత్రం తనకేమీ పట్టనట్లు ముందుకు వెళ్లిపోయి విమానం నడిపే పైలట్స్ ఉన్న కేబిన్ ను గట్టిగా తట్టింది. వాళ్లు తెరవకపోవడంతో గట్టిగా అరిచింది. ఆమె కేకలు విని అందరూ ఆందోళన చెందారు.

అయినా ఆ యువతి ఆ అవస్థలో ఏదో దెయ్యం పట్టినట్లు తల గుండ్రంగా తిప్పుడూ కేకలు వేసింది. ఇదంతా విమాన సిబ్బంది లోపల ఉన్న పైలట్లకు సమాచారం అందించారు. దీంతో పైలట్లు విమానాన్ని వెనక్కి తిప్పారు. తిరిగి హౌస్టన్ విమానాశ్రయానికే వెళ్లారు. అక్కడ విమానం ల్యాండ్ చేసి ఎయిర్ పోర్ట్ పోలీసులకు సమాచారం అందించారు.

ఎయిర్ పోర్ట్ పోలీసులు ఆమెను అరెస్టు చేసి తీసుకెళ్లారు. తరువాత ఆ యువతిని నగరంలోని హ్యారిస్ హెల్త్ బెన్ టౌబ్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడ ఆమెకు మానసిక చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు మాత్రం ఆమెకు ఏదో మానసిక సమస్యలున్నట్లు తెలిసింది.. అందుకే ఏ విధమైన ఫిర్యాదు నమోదు చేయలేదు. అయితే వైద్య పరీక్షల రిపోర్ట్ లో ఆమెకు మానసిక సమస్య లేవి లేనట్లు తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కానీ విమనంలోని ప్రయాణికులు మాత్రం ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. “ఆమె అసభ్యంగా పిల్లలు కూర్చొని ఉండగాా. అందరి ముందు బట్టలు విప్పేసి భయానక అరుపులతో విమానంలో ఆందోళన పరిస్థితి సృష్టించింది. పిల్లలు అది చూసి భయపడిపోయారు” అని ఒక ప్రయాణికుడు చెప్పారు.

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×